
Vishnu Vishal Aaryan Teaser Unveiled
Produced by Vishnu Vishal Studioz in association with Shubhra & Aryan Ramesh, and directed by Praveen K, Aaryan brings together leading star Vishnu Vishal in a gripping investigative thriller.
The teaser was launched today, as the film gears up for a worldwide release on October 31st, in both Tamil and Telugu.
Introducing a chilling murder investigation and unveiling Vishnu Vishal’s intriguing character, the teaser transports audiences into the dark and intense world of Aaryan, a police officer unlike any seen before on screen. With a strikingly different appearance, Vishnu Vishal captivates attention and the film seems to be another quality addition his long list of impressive titles.
After a gap of 34 months, Vishnu Vishal returns as a solo lead with this powerful teaser, which builds immediate excitement for the film.
Following the grand success of Ratsasan, Vishnu Vishal once again dons the role of a police officer in Aaryan. The film also stars Selvaraghavan, Shraddha Srinath and Maanasa Chowdhary in pivotal roles, while Sai Ronak, Tarak Ponnappa, Mala Parvathi, Avinash, and Abhishek Joseph George joining the ensemble.
Crafted as a unique investigative action thriller, the film is helmed by director Praveen K. Notably, Manu Anand, who directed FIR starring Vishnu Vishal, has contributed as the co-writer of this film.
Aaryan is gearing up to entertain audiences across all demographics. The trailer and music launch updates will be officially announced soon. The film is slated for a worldwide theatrical release on October 31st.
Producer – Vishnu Vishal (Vishnu Vishal Studioz)
Writer & Director – Praveen K
PRO – Sathish (AIM)
విష్ణు విశాల్ డార్క్ అండ్ సస్పెన్స్ ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ రిలీజ్
శుభ్ర & ఆర్యన్ రమేష్ తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది.
ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్ ని తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో, విష్ణు విశాల్ ఆకట్టుకున్నారు.
34 నెలల విరామం తర్వాత, విష్ణు విశాల్ ఈ శక్తివంతమైన టీజర్ తో సోలో లీడ్ గా కం బ్యాక్ ఇచ్చారు.
‘రాట్ససన్’ విజయం తర్వాత, విష్ణు విశాల్ మరోసారి ‘ఆర్యన్’ లో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఒక యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించబడిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ నటించిన FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయిత.
ఆర్యన్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ మ్యూజిక్ లాంచ్ అప్డేట్లు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం – విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి
నిర్మాణం – విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్)
దర్శకత్వం – ప్రవీణ్ కె
నిర్మాతలు – శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్
DOP – హరీష్ కన్నన్.
సంగీతం – జిబ్రాన్.
ఎడిటర్ – శాన్ లోకేష్.
స్టంట్స్ – స్టంట్ సిల్వా, పిసి స్టంట్స్ ప్రభు.
ఎడిషల్ స్క్రీన్ ప్లే – మను ఆనంద్.
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్.జయచంద్రన్.
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ – వినోద్ సుందర్
పీఆర్వో: వంశీ శేఖర్