
Sriimurali Teams Up with Director Halesh Kogundi for Paraak
After the success of Bagheera, Roaring Star Sriimurali has signed up for ‘Paraak’. The film’s Muhurat ceremony took place today at Bangalore’s Bandi Mahakali Temple, graced by Channagiri MLA Shivaganga Basavaraju who marked the occasion with the inaugural clap and conveyed his best wishes to the team.
Speaking to reporters, Sriimurali said, “Paraak is a vintage-style film. I was quite anxious about which story to choose for my next project and listened to nearly 200 scripts. I have already travelled with the ‘Paraak’ team for the past two years. Shooting will start from this month. Charan Raj will be the music director,” he shared
Taking the director’s seat for ‘Paraak’ is young talent Halesh Kogundi. ‘Paraak’ marks his debut feature, after working on a handful of short films. ‘Paraak’ is his first step into mainstream cinema, and the project is already being spoken of as a promising start for the budding director. The film is being produced by Brand Studios.
Charan Raj takes charge of the music, Sandeep Valluri handles cinematography, Ullas Hydur leads art direction, and Inchara Suresh designs the costumes. The team is set to share more updates soon.
రోరింగ్ స్టార్ శ్రీమురళి పరాక్ అఫీషియల్ గా లాంచ్
బగీరా విజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ కు సైన్ అప్ చేశారు. ఈ చిత్రం ముహూర్త వేడుక ఈరోజు బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది, చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ప్రారంభోత్సవం సందర్భంగా క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ..”పరాక్ ఒక వింటేజ్ స్టైల్ సినిమా. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు సంవత్సరాలుగా ‘పరాక్’ టీంతో ప్రయాణించాను. ఈ నెల నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది. చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు.
‘పరాక్’ చిత్రానికి హలేష్ కోగుండి దర్శకత్వం వహిస్తారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి పనిచేసిన తర్వాత ‘పరాక్’ అతని తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని బ్రాండ్ స్టూడియోస్ నిర్మిస్తోంది.
చరణ్ రాజ్ సంగీతం అందిస్తారు, సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్, ఉల్లాస్ హైదూర్ ఆర్ట్ డైరెక్టర్. ఇంచార సురేష్ కాస్ట్యూమ్స్ డిజైనర్. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తారు మేకర్స్.