Thanks Audience For Making “Vikatakavi” A Big Success – Rajani
O Andala Rakshasi Ready for Theatrical Release
Sheraz Mehdi has been making great impression as a director, actor, music director, and story-writer in both Telugu and Tamil cinema. He is making his comeback in Telugu as both the lead actor and director with the film “O Andala Rakshasi.” Vihanshi Hegde and Kriti Verma are the heroines opposite him. Produced by Surinder Kaur under the Sky Is The Limit banner, with co-producer Tejinder Kaur, “O Andala Rakshasi” is gearing up for release. Sheraz Mehdi has showcased his talent as a hero, villain, director, and music director until now. With this beautiful love story, he aims to enchant everyone. The shooting for the film has been completed, and post-production is currently underway. Meanwhile, the team held a press meet.
Director, actor, and music director Sheraz Mehdi said, “Greetings to everyone. The story, dialogues, and songs for the movie were written by Bhashyashree. He also lent his support for the screenplay writing. It is thanks to his cooperation that we were able to make this film so well. I extend my thanks to Bhashyashree. ‘O Andala Rakshasi’ is not a glamour-based movie. It has strong content. In a way, it can be considered a women-oriented film. We depict how innocent women are deceived by some, while also highlighting that those who deceive will face consequences. Suman and Tammareddy Bharadwaj have played important roles. The movie has turned out really well, and we look forward to meeting you in theatres soon.”
Writer Bhashyashree stated, “I penned the story, dialogues, and songs for ‘O Andala Rakshasi.’ I would like to thank our director and hero Sheraz Mehdi. He is a versatile person, directing, composing music, and acting as the hero. It is because of him that this film has turned out so well. We completed shooting in 45 days, wrapping up both the talkie and songs. We shot in and around Hyderabad, Goa, and Chennai. This is a content-oriented film. We focused on a strong script without prioritizing glamour. We will soon bring ‘O Andala Rakshasi’ to you all. I am sure everyone will enjoy the movie.”
Actress Vihanshi Hegde said, “Hi, I don’t speak Telugu very well. When director Sheraz narrated the story of ‘O Andala Rakshasi,’ I was very impressed, especially with the layers in my character. I thank Sheraz for giving me this opportunity. The story includes commercial elements along with a message. I hope Telugu audiences will support ‘O Andala Rakshasi.’ The film will definitely appeal to you all.”
Actress Neha Deshpande said, “I am happy to have the opportunity to act in ‘O Andala Rakshasi.’ I would like to thank director Sheraz, who has showcased an all-around performance in this film. As mentioned earlier, this is a women-centric movie. The script by Bhashyashree is compelling. ‘O Andala Rakshasi’ is coming with good content that will touch the hearts of the audience. I hope you will all support our film.”
Cast: Vihanshi Hegde, Sheraz Mehdi, Kriti Verma, Neha Deshpande, Suman Talwar, Tammareddy Bharadwaj, Ananth Babu, Priya, Krishna
Technical Crew:
Banner: Sky Is The Limit
Producer: Surinder Kaur
Co-Producer: Tejinder Kaur
Director: Sheraz Mehdi
Screenplay: Sheraz Mehdi /Bashyashree
Music: Sheraz Mehdi
Cameraman: Kaveti Praveen
Choreographer: Sai Raj
Story, Lyrics, dialogues: Bhashyashree
Action: Shaolin Jasmine
Editor: DV Prabhu
PRO: Sai Satish
స్ట్రాంగ్ కంటెంట్ తో త్వరలోనే గ్రాండ్ థియెట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న న్యూ కాన్సెప్ట్ మూవీ ‘ఓ అందాల రాక్షసి’
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. ఇంత వరకు షెరాజ్ మెహదీ హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు. ప్రస్తుతం ఓ అందమైన ప్రేమ కథా చిత్రంతో షెరాజ్ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ – అందరికీ నమస్కారం. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు భాష్యశ్రీ గారు కథ మాటలు, పాటలు రాశారు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాం. భాష్యశ్రీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ‘ఓ అందాల రాక్షసి’ సినిమా గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది వుమెన్ ఓరియెంటెడ్ మూవీ అనుకోవచ్చు. మహిళల గురించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాం. అన్నారు.
రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ – అందరికీ నమస్కారం. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు నేను కథ, మాటలు, పాటలు రాశాను. మా డైరెక్టర్, హీరో షెరాజ్ మెహదీకి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఒక వర్సటైల్ పర్సన్. డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోగానూ నటించారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. 45 రోజుల షూటింగ్ తో టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ మీద వెళ్లాం. త్వరలోనే మీ ముందుకు మా ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను తీసుకొస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా మూవీ నచ్చుతుంది. అన్నారు.
హీరోయిన్ విహాన్షి హెగ్డే మాట్లాడుతూ – హాయ్..నాకు తెలుగు బాగా రాదు. డైరెక్టర్ షెరాజ్ గారు ‘ఓ అందాల రాక్షసి’ కథ చెప్పినప్పుడు ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యంగా నా క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్ లో అవకాశం ఇచ్చినందుకు షెరాజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. కథలో కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.
హీరోయిన్ నేహా దేశ్‌పాండే మాట్లాడుతూ – ‘ఓ అందాల రాక్షసి’ సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ షెరాజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ మూవీలో ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ చూపించారు. ఇందాక సార్ చెప్పినట్లు ఇది వుమెన్ కోసం చేసిన మూవీ. వుమెన్ ఓరియెంటెడ్ మూవీలా ఉంటుంది. భాష్యశ్రీ గారి స్క్రిప్ట్ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల మనసులకు టచ్ అయ్యేలా మంచి కంటెంట్ తో ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రాబోతోంది. మీ సపోర్ట్ మా సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
తారాగణం: విహాన్షి హెగ్డే, షెరాజ్ మెహదీ, కృతి వర్మ, నేహా దేశ్‌పాండే, సుమన్ తల్వార్, తమ్మారెడ్డి భరద్వాజ్, అనంత్ బాబు, ప్రియా, కృష్ణ
సాంకేతిక బృందం
బ్యానర్: స్కై ఈజ్ ది లిమిట్
నిర్మాత: సురీందర్ కౌర్
సహ నిర్మాత: తేజిందర్ కౌర్
దర్శకుడు : షెరాజ్ మెహదీ
స్క్రీన్ ప్లే – షెరాజ్ మెహదీ/భాష్య శ్రీ
సంగీతం – షెరాజ్ మెహదీ
కెమెరామెన్ : కావేటి ప్రవీణ్
కొరియోగ్రాఫర్: సాయి రాజ్
కథ/మాటలు/పాటలు: భాష్యశ్రీ
యాక్షన్: షావోలిన్ మల్లె
ఎడిటర్: డివి ప్రభు
పీఆర్ ఓ: సాయి సతీష్