వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
20 Minutes of KA Climax contains surprising elements – Kiran Abbavaram
Young and talented hero Kiran Abbavaram stars in the highly anticipated period thriller “KA.” Nayan Sarika and Tanvi Ram play the lead heroines in this film. Presented by Mrs. Chinta Varalakshmi, the movie is produced by Chinta Gopalakrishna Reddy under the banner of Srichakraas Entertainments, featuring high production values. The director duo, Sujeeth and Sandeep, have crafted “KA” as an action thriller set against a village backdrop. The film is gearing up for a grand theatrical release in Telugu on Diwali, October 31st. “KA” will also be released in Malayalam by hero Dulquer Salmaan through his company, Wayfarer Films. The recently released trailer has received a tremendous response, leading to a special press meet today.
During the press meet, director Sandeep remarked, “I hope you all enjoyed the trailer of ‘KA.’ We wrote this story with the audience of B and C centers in mind and crafted the screenplay accordingly. After sharing the story with Kiran, he immediately agreed to come on board, and we were encouraged by his confidence in us. Once the script was finalized, Kiran gave us ample creative freedom. Our goal was to present the story in a fresh way, so we designed each scene to reflect the 1970s and 80s. We incorporated elements of darkness during the day to make the town of Krishnagiri unique. From the moment the movie begins, you’ll be immersed in the world and connect with Vasudev’s character.”
Distributor Vamsi Nandipati stated, “The trailer of ‘KA’ is receiving a fantastic response. Since its release, we’ve been inundated with inquiries. We hope our film will bring in substantial revenue this Diwali. As an audience member, I thoroughly enjoyed this movie. I was just as excited watching it for the 30th time as I was the first. We’ve been discussing ‘Virupaksha,’ and I believe this movie will also become a reference point after its release. I’ve shared my suggestions with the team, and I’m thrilled to bring you a great movie for Diwali. We definitely seek your support.”
Actress Tanvi Ram expressed her excitement, saying, “I was thrilled when directors Sandeep and Sujeeth shared the story of ‘Ka’ with me. Whenever I choose a movie, I consider how my role as the heroine will contribute to the overall narrative. In ‘KA,’ every character holds significance, alongside mine. I’m happy to be part of this film and eagerly await your response.”
Heroine Nayan Sarika said, “I played the character of Satyabhama in the movie ‘KA.’ Acting in this role gave me great satisfaction. I would like to thank directors Sandeep and Sujith, as well as hero Kiran, for giving me the opportunity to act in this film. In ‘KA,’ I portrayed a character that is completely different from the one I played in my previous movie, ‘AAY.’ I am happy to have acted alongside Kiran. There are many twists and turns in the movie that will keep you excited. I look forward to meeting you in theaters on the 31st of this month and am eager for your feedback.”
Co-producer Chinta Vineesha Reddy said, “We wanted to show the trailer of the movie ‘KA’ to all of you and hear your response. We are delighted to see the positive reactions. Our entire team has worked hard to create a quality film, and we are all satisfied with the output. We believe that if the trailer is well-received, the movie will be even more enjoyable in theaters.”
Hero Kiran Abbavaram stated, “The feedback we’ve received about our ‘KA’ movie trailer has been very positive. With only four days left until the release, we are all very excited. The film will be released in Telugu on the 31st, and we plan to release it in Kannada, Tamil, and Malayalam a week later. We made this decision because we couldn’t find theaters in Tamil Nadu, and Dulquer’s ‘Lucky Baskhar’ is releasing on the same date in Malayalam. If we achieve success in Telugu, we anticipate a good response in the other languages as well.
“When I first heard the story of ‘KA,’ I felt it was a narrative that needed to be shared with the audience. I had some issues with the content in my previous films, so we made this movie very carefully, from the first scene to the last, ensuring everything was well-executed. The climax of our movie will unfold over 20 minutes and contains surprising elements. ‘KA’ will not include unnecessary commercial aspects; the action scenes are incorporated only when they are essential to the story.
“My character, Vasudev, has many layers, including shades of gray. He is curious about what is happening in his neighbor’s life, which is why he reads other people’s letters. It will be intriguing to see how his life takes unexpected turns because of this curiosity. We hope that the cast and crew of ‘KA’ will earn good recognition for their hard work.”
Cast: Kiran Abbavaram, Nayan Sarika, Tanvi Ram, and others.
Technical Team:
- Editor: Sree Varaprasad
- DOP: Vishwas Daniel, Satish Reddy Masam
- Music: Sam CS
- Production Designer: Sudheer Macherla
- Executive Producer: Chavan
- Creative Producer: Ritikesh Gorak
- Line Producer: KL Madan
- CEO: Rahasya Gorak (KA Productions)
- Costumes: Anusha Punjla
- Makeup: Kovvada Ramakrishna
- Fights: Real Satish, Ram Krishnan, Uyyala Shankar
- Choreography: Polaki Vijay
- VFX Producer: MS Kumar
- VFX Supervisor: Phaniraja Kasturi
- Co-Producers: Chinta Vineesha Reddy, Chinta Rajasekhar Reddy
- Producer: Chinta Gopalakrishna Reddy
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Written and Directed by: Sujith, Sandeep
ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే “క” సినిమా చేశా – హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ”క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ”క” సినిమా ట్రైలర్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో- దర్శకుడు సందీప్ మాట్లాడుతూ – “క” సినిమా ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా కథను బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కోసం రాసుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా అలాగే చేశాం. కథ చెప్పగానే కిరణ్ గారు వెంటనే ఓకే చేశారు. ఆయన ఇచ్చిన కాన్పిడెన్స్ తో కంటిన్యూ అయ్యాం. స్క్రిప్ట్ ఓకే అయ్యాక కిరణ్ గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మనకు కథల కంటే కథను కొత్తగా చెప్పడమే ఇంపార్టెంట్. అలా “క” సినిమాను స్క్రీన్ మీద కొత్తగా ప్రెజెంట్ చేశాం. 1970, 80 కాలాన్ని ప్రతిబింబించేలా ప్రతి సీన్ డిజైన్ చేసుకున్నాం. కృష్ణగిరి అనే ఊరు యూనిక్ గా ఉండేలా మధ్యాహ్నం చీకటి పడే ఎలిమెంట్ తీసుకున్నాం. సినిమా బిగిన్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే క ప్రపంచంలోకి వెళ్తారు, వాసుదేవ్ క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు.
డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి. మా సినిమా దీపావళికి కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నా. ఒక ఆడియెన్ గా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎంతగా ఎగ్జైట్ అయ్యానో 30వ సారి చూసినప్పుడు కూడా అంతే ఎగ్జైట్ అయ్యాను. మనం విరూపాక్ష గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. క సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాను కూడా రిఫరెన్స్ గా తీసుకుంటారనే నమ్మకం ఉంది. సినిమా చూశాక నాకు అనిపించిన సజెషన్స్ టీమ్ కు చెప్పాను. దీపావళికి ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నాం. అన్నారు.
నటి తన్వీ రామ్ మాట్లాడుతూ – “క” సినిమా కథను దర్శకులు సందీప్, సుజీత్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. నేను ఎప్పుడూ మూవీ సెలెక్ట్ చేసుకున్నా..అందులో హీరోయిన్ గా నేను చేసే రోల్ ఎలా ఉందని చూస్తాను. “క” మూవీలో నా క్యారెక్టర్ తో పాటు ప్రతి రోల్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మూవీలో భాగమవడం సంతోషంగా ఉంది. “క” సినిమాకు మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అన్నారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “క” సినిమాలో సత్యభామ అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ లో నటించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నాకు “క” మూవీలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు సందీప్, సుదీప్, హీరో కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నా గత మూవీ ఆయ్ లో చేసిన క్యారెక్టర్ కు కంప్లీట్ డిఫరెంట్ రోల్ “క” సినిమాలో చేశాను. కిరణ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సినిమాలో అనేక మలుపులు ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని చాలా ఎగ్జైట్ చేస్తాయి. ఈ నెల 31న థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాను. మీ ఫీడ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నారు.
కో ప్రొడ్యూసర్ చింతా వినీషా రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమా ట్రైలర్ మీ అందరికీ చూపించి మీ రెస్పాన్స్ తెలుసుకోవాలని భావించాం. మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మా టీమ్ అంతా ఒక మంచి మూవీ చేయాలనే ప్రయత్నంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాం. “క” సినిమా ఔట్ పుట్ మేమంతా సంతృప్తిపడేలా వచ్చింది. ట్రైలర్ ను ఎంతగా ఇష్టపడుతున్నారో థియేటర్స్ లో సినిమాను అంతకంటే ఎక్కువగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” మూవీ ట్రైలర్ చాలా బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. మరో నాలుగు రోజులే ఉంది సినిమా రిలీజ్ కు . చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ దొరకలేదు, మలయాళంలో దుల్కర్ గారి లక్కీ భాస్కర్ సేమ్ డేట్ కు రిలీజ్ అవుతోంది. కాబట్టి ఒక వారం ఆగి “క” సినిమాను ఆ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. తెలుగులో మీరు మంచి సక్సెస్ ఇస్తే ఆ భాషల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. “క” సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. నా గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి లేకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఎంతో జాగ్రత్తగా సినిమాను చేశాం. దీని వెనక మా టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్ ప్రైజ్ చేస్తాయి. “క” సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. కథలో కావాల్సివచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ సీన్స్ పెట్టాం. “క” సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా. వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వాసుదేవ్ కు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక. అందుకే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. “క” సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం : సుజీత్-సందీప్