‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల – విక్టరీ వెంకటేష్
Kantara: Chapter 1 – Release Date Confirmed
Kantara: Chapter 1, one of the most highly anticipated Kannada language films in recent times, is set to release on OCTOBER 2, 2025. As the next Pan-India offering from Hombale Films, is all set to woo the audiences once again across the globe once again after Kantara.
Hombale Films, known for its grand and authentic cinematic experiences, has spared no effort in creating a visual masterpiece. The production team has recreated the historic Kadamba Empire at Kundapur, immersing viewers in an era of valor, culture, and mystique. This intricate set, complete with detailed architecture and lifelike surroundings, is expected to transport audiences to a bygone time.
Rishab Shetty, the actor-director at the helm of this ambitious project, has left no stone unturned in preparing for his role. To authentically portray his character, Rishab underwent rigorous training in Kalaripayattu, one of the oldest martial art forms originating from Kerala. His dedication to mastering the art has added depth and authenticity to his performance, making his character a true representation of resilience and tradition.
It was Kantara : Chapter 1 that introduced the richness of Konkan folklore to the world. With its gripping narrative, breathtaking visuals, and heartfelt performances, the film connected with audiences far beyond Indian borders. Its authentic portrayal of local traditions and storytelling brilliance made it a sleeper hit, establishing a global fanbase for the franchise.
As the makers have announced the release date of the film the excitement surrounding Kantara: Chapter 1 has multiplied. With Hombale’s vision, Rishab Shetty’s dedication, and the legacy of the first chapter, this film is on its way to become yet another cinematic milestone.
బిగ్ అనౌన్స్మెంట్.. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్- 1 గ్రాండ్ రిలీజ్
ఇటీవల కాలంలో ప్రపంచ ఆడియన్స్ మనసు దోచుకున్న కాంతారా సిరీస్ నుంచి ఇప్పుడు కాంతారా చాప్టర్- 1 రాబోతోంది. ఈ కన్నడ సినిమా కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతారా చాప్టర్- 1 చిత్రాన్ని అక్టోబర్ 2, 2025న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. పాన్ ఇండియా సినిమాగా మరోసారి ప్రపంచాన్ని ఆకర్షించేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది.
భారీ నిర్మాణ విలువలతో ఆడియన్స్ మెచ్చే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హోంబలే ఫిల్మ్స్.. కాంతారా చాప్టర్- 1 అనే మరో కళాఖండాన్ని రూపొందించడానికి ఎంతో సాహసం చేసింది. ఈ నిర్మాణ బృందం కుందాపూర్‌లో చారిత్రాత్మక కదంబ సామ్రాజ్యాన్ని పునఃసృష్టి చేసింది. శౌర్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక యుగం వీక్షకులకు కళ్లకు కట్టినట్లు కనిపించేలా సెట్టింగ్స్ చేసింది. ఈ క్లిష్టమైన సెట్, వివరణాత్మక ఆర్కిటెక్చర్, లైఫ్‌లైక్ పరిసరాలతో పూర్తి చేయబడింది. ఇది ప్రేక్షక లోకాన్ని గత కాలంలోకి తీసుకెళ్లి వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహిస్తున్న నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత్ర కోసం ఎంతో శ్రమించారు. తన పాత్రలో రియాలిటీ ఉట్టిపడేలా కష్టపడ్డారు. కేరళ నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్ కఠినమైన శిక్షణ పొందారు. కళలో ప్రావీణ్యం సంపాదించడానికి అంకితభావంతో పని చేసి తన పాత్ర, సంప్రదాయానికి మచ్చుతునకలా నిలిచేలా చేశారు. సినిమాలో ఈ రోల్ హైలైట్ కానుందట.
కాంతారా చాప్టర్- 1 కొంకణ్ జానపద గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. గ్రిప్పింగ్ కథనం, ఉత్కంఠభరితమైన విజువల్స్ తో ఈ చిత్రం భారతదేశ సరిహద్దులను దాటి ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది. ఇప్పటికే వచ్చిన కాంతారా మూవీ స్థానిక సంప్రదాయాల యొక్క ప్రామాణికమైన వర్ణన, స్టోరీ టెల్లింగ్ తో స్లీపర్ హిట్‌గా మారింది. ఈ ఫ్రాంచైజీకి ప్రపంచ స్థాయి అభిమానులను సొంతం చేసింది.
ఈ క్రమంలోనే తాజాగా నిర్మాతలు కాంతారా చాప్టర్- 1 విడుదల తేదీని ప్రకటించడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠ నెలకొంది. హోంబాలే దృష్టి, రిషబ్ శెట్టి అంకితభావం.. కాంతారా చిత్రం వారసత్వంతో, ఈ చిత్రం సినీ చరిత్రలో మరో మైలురాయి అవుతుందనే టాక్ మొదలైంది.