‘Sarangapani Jathakam’ Teaser Release Date Announced
‘Sarangapani Jathakam’ is directed by Mohanakrishna Indraganti and produced by Sivalenka Krishna Prasad under the banner of Sridevi Movies. It stars Priyadarshi in the titular role and Roopa Koduvayur as the female lead opposite him. This is the third film in the combo of Mohanakrishna Indraganti and Sivalenka Krishna Prasad, following their successful films, ‘Gentleman’ and ‘Sammohanam’. The film will hit the screens on December 20th, 2024. As of now, makers confirmed the Teaser release on November 21st, 11:12 AM.
Producer Sivalenka Krishna Prasad said, “We are releasing the teaser of our film ‘Sarangapani Jathakam’ on the 21st of November at 11:12 AM. On that day, we will introduce the audience to the world of our Sarangapani. We completed the film’s shooting in the first week of September and wrapped up the dubbing work. Post-production work is in the final stages with Re-recording currently underway. This is a perfect comedy film that answers the question if the person’s future is determined by their fate or actions. It’s a complete family entertainer. Mohanakrishna Indraganti has directed it wonderfully and we’re sure the audience will enjoy thoroughly.”
Cast:
Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, Sivannarayana, Ashok Kumar, Raja Chembolu, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, KLK Mani, ‘IMAX’ Venkat.
Crew:
Make-Up Chief: RK Vyamajala; Costume Chief: N Manoj Kumar; Costume Designers: Rajesh Kamarsu, Ashwin; Production Executives: K Ramanjaneyulu (Anji Babu), P Rasheed Ahmed Khan; PRO: Pulagam Chinnarayana; Marketing: Talk Scoop; Co-Director: Kota Suresh Kumar; Lyricist: Ramajogayya Sastry; Stunts: Venkat – Venkatesh; Production Designer: Raveender; Editor: Marthand K Venkatesh; Director of Photography: PG Vinda; Music Director: Vivek Sagar; Line Producer: Vidya Sivalenka; Producer: Sivalenka Krishna Prasad; Writer, Director: Mohanakrishna Indraganti.
నవంబర్ 21న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. నవంబర్ 21, ఉదయం 11:12 కి టీజర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు మా ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల చేయనున్నాం. ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఆ రోజు పరిచయం చేస్తాం. సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రమిది. ఇంటిల్లిపాది చూసి నవ్వుకునే వినోదాత్మక సినిమా. మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఏడాది ఆఖరులో అందరినీ నవ్విస్తుందీ సినిమా” అని అన్నారు.
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.