
Operation Padma Trailer Released
డిఫరెంట్ పొలిటికల్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ పద్మ ట్రైలర్ విడుదల, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా
నరేష్ మేడి, రాగ్, రజిత శాండీ, రణధీర్ బీసు, రాఘవ మందలపు, పెద్ది రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆపరేషన్ పద్మ”. ఈ చిత్రాన్ని క్రిషవ్ సినిమాస్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్స్ పై ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మందలపు, రాంబాబు మందలపు నిర్మిస్తున్నారు. కార్తీక్ మందలపు కో ప్రొడ్యూసర్ గా, కె టి మల్లికార్జున క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ.వి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం “ఆపరేషన్ పద్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డైలాగ్ రైటర్ ప్రేమ్ రాజ్ ఎనుముల మాట్లాడుతూ – “ఆపరేషన్ పద్మ” సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. డైరెక్టర్ కార్తికేయ నాలుగు మూవీస్ రూపొందిస్తే అందులో మూడు సినిమాలకు నేను డైలాగ్స్ రాశాను. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు పెద్ది రాజ్ మాట్లాడుతూ – “ఆపరేషన్ పద్మ” సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా. మా కాస్ట్ అండ్ క్రూ అందరూ మాకు సపోర్ట్ చేశారు. మా చిన్న సినిమాకు తమ వంతు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ – మనం ఎన్ని మాట్లాడుకున్నా చిన్న సినిమా అనాథే. కానీ మంచి కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు తప్పకుండా ఆదరణ పొందుతున్నాయి. డైరెక్టర్ కార్తికేయ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో ఆయనకు, ఆయన టీమ్ కు హిట్ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత, నటుడు డీఎస్ రావు మాట్లాడుతూ – “ఆపరేషన్ పద్మ” ట్రైలర్ బాగుంది. మంచి డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ కార్తికేయ కొత్త నటీనటులను ఎంచుకుని వాళ్లతో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తుంటాడు. ఈ సినిమా కూడా ఈ టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.
నటుడు రణధీర్ బీసు మాట్లాడుతూ – ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నా. సినిమాలోని లీడ్ రోల్స్ లో నాది ఒకటి. “ఆపరేషన్ పద్మ” నాకు నటుడిగా రెండో మూవీ. ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అలాగే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. అన్నారు.
నటుడు నరేష్ మేడి మాట్లాడుతూ – పొలిటికల్ డ్రామా నేపథ్యంగా సాగే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సినిమా మీద కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇది థియేట్రికల్ గానే ప్రేక్షకులకు చేరువ చేయాలి అనిపించింది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కార్తికేయకు మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ రజిత శాండీ మాట్లాడుతూ – ఈ చిత్రంలో పద్మ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నా క్యారెక్టర్ కు రెండు షేడ్స్ ఉంటాయి. 20 రోజులు ఈ సినిమా కోసం వర్క్ షాప్ చేశాం. థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న నా మొదటి చిత్రమిది. ఒక డిఫరెంట్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ రాఘవ మందలపు మాట్లాడుతూ – డైరెక్టర్ కార్తికేయ రూపంలో మాకొక డైమండ్ దొరికింది. ఆయన టాలెంట్ ఉన్న దర్శకుడు. నేను ఒక సినిమా చేద్దామని వచ్చాను. కానీ ప్రెజెంట్ మూడు చిత్రాలకు సన్నాహాలు జరుపుతున్నాము. ఈ సినిమా ఔట్ పుట్ చూసి ఘట్టమనేని అరవింద్ బాబు గారు ప్రొడక్షన్ లో భాగమయ్యేందుకు ముందుకొచ్చారు. ఆపరేషన్ పద్మ సినిమా మా ప్రొడక్షన్ కు శుభారంభం ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ కార్తికేయ.వి. మాట్లాడుతూ – “ఆపరేషన్ పద్మ” సినిమాను అనుకున్న టైమ్ లో పూర్తి చేయగలిగాం. 18 రోజులు ఈ సినిమాకు వర్క్ షాప్స్ చేసి, 27 రోజుల్లో ఒకే షెడ్యూల్ లో సినిమాను రూపొందించాం. మా టీమ్ అందరి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. ప్రేమ్ రాజ్ గారు నా ప్రతి సినిమాకు డైలాగ్స్ అందిస్తూ సహకరిస్తున్నారు. మా నటీనటులు అంతా బాగా పర్ ఫార్మ్ చేశారు. మా మూవీ ఔట్ పుట్ చూసి ఘట్టమనేని అరవింద్ బాబు గారు ప్రొడక్షన్ లోకి రావడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మందలపు, రాంబాబు మందలపు గారికి థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – “ఆపరేషన్ పద్మ” మూవీ ట్రైలర్ చూస్తే వుమెన్ ఎంపవర్ మెంట్ థీమ్ కనిపించింది. పద్మ పాత్రలో రజిత బాగా నటించింది. మంచి ఫైట్స్ చేసింది. ప్రొడ్యూసర్ రాఘవ సినిమాను నిర్మించడంతో పాటు నటించాడు. సినిమా షూటింగ్ టైమ్ లోనే డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండటం కలిసొచ్చే విషయం. సినిమా చివరలో డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ పోట్లాడుకుంటారు. కానీ వీళ్లంతా కలిసి హ్యాపీగా ఉండటమే ఈ చిత్రానికి ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నా. అన్నారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – “ఆపరేషన్ పద్మ” ట్రైలర్ బాగుంది. ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. డైరెక్టర్ కార్తికేయ ప్రతిభావంతుడు. కొత్త వాళ్లతో సినిమా చేసినప్పుడు కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ సినిమానే మాట్లాడాలి. సినిమాను రూపొందించడమే కాదు దాన్ని ప్రేక్షకుల్లో తీసుకెళ్లడమూ ముఖ్యమే. ఇటీవల ప్రమోషన్ లేక ఓ మంచి సినిమా థియేటర్స్ లో కిల్ అయ్యింది. మీ “ఆపరేషన్ పద్మ” సినిమాకు మంచి ప్రమోషన్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటీనటులు – నరేష్ మేడి, రాగ్, రజిత శాండీ, రణధీర్ బీసు, రాఘవ మందలపు, పెద్ది రాజ్, తదితరులు
టెక్నికల్ టీమ్
స్టంట్స్ – అఖిల్ నకిరేకంటి
ఆర్ట్ డైరెక్టర్ – పవన్ ప్రసాద్
లిరిక్స్ – సాయికృష్ణ వేముల
ఎడిటర్ – జగదీశ్. కె.కె
మ్యూజిక్ డైరెక్టర్ – సుభాష్ ఆనంద్
డీవోపీ – కల్యాణ్ సమి, పవన్ మణి
డైలాగ్స్ – ప్రేమ్ రాజ్ ఎనుముల
క్రియేటివ్ హెడ్ – కె.టి. మల్లికార్జున
కో – ప్రొడ్యూసర్ – కార్తీక్ మందలపు
బ్యానర్స్ – క్రిషవ్ సినిమాస్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పీ
ప్రొడ్యూసర్స్ – ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మందలపు, రాంబాబు మందలపు
రచన, దర్శకత్వం – కార్తీకేయ.వి
పీఆర్ఓ – వీరబాబు
