‘Ukku Satyagraham’ releasing on 29th of this month in more than 300 theaters – Satya Reddy
“Ukku Satyagraham” is the last film starring Praja YuddhaNauka and revolutionary poet Gaddar in the production of director, producer, hero, People Star Satya Reddy with the slogan of Visakha Ukku Telugu Prajala Hakku. Gaddaranna sang three songs and acted in two songs and some informative scenes. Goreti Venkanna and Suddala Ashok Teja have provided excellent lyrics. Now this movie is being released on 29th of this month.
On this occasion, film director, producer and protagonist Satya Reddy speaks: With the slogan of Visakha Ukku Andhrula Hakku, I produced the movie Ukku Satyagraham as the last film starring Praja YuddhaNauka and Revolutionary Poet Gaddar to prevent the privatization of the Visakha Steel Plant, which was achieved with the sacrifice of 32 people. In this movie, all the labor unions, union leaders and land evacuees of Visakhapatnam Steel Plant acted. But the film was postponed for so many days due to the delay of the censor because of some scene against to the government and the death of Gaddar. But now the censor of this movie is completed and we are releasing it in more than 300 theaters on 29th of this month. It was very difficult to make films related to revolution during this period. Censors will stop and efforts will be made not to release the film. But we are bringing this movie to the audience on 29th of this month, because Visakha steel plant has achieved success in preventing the privatization of Visakha steel plant with the slogan of the Visakha Ukku Andhrula Hakku. The last film starring the revolutionary poet Gaddar who led the masses towards revolution with revolutionary songs. We are showing many things that the world does not know in this movie. What happened when Kurnool became the capital of Andhra state after its separation from Madras? Similarly, what happened when Indira Gandhi thought that a steel plant should be put in Madras? Are shown in this movie. This story is very well written by Gaddar anna. He wrote four songs in this film and acted in some key scenes. How should his successors be and how should movements be built was also there in the last song he wrote before his death. He said that the activists, Gaddar’s fans and audience would support this film and make it a success.
Actors:
Gaddar Garu, Satya Reddy, ‘Pulsar Bike’ Jhansi, MLA Dharmashree Garu, MVV SatyaNarayana, Prasanna Kumar, Vennela.
Technicians:
Music: Srikoti
Editor : Menaga Srinu
Production : Janam Entertainments
Story, Screenplay, Producer and Direction : P. Satya Reddy
P R O : Madhu VR
విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ ఈనెల 29న 300 కు పైగా థియేటర్లలో బ్రహ్మాండమైన విడుదల – ఢిల్లీ ఏపీ భవన్ లో ప్రస్తావించిన సత్యారెడ్డి
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు.
ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతు : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాల తో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా, ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి చిత్రం గా ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను. ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు నటించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను నిర్మించామని సెన్సార్ లేట్ అవ్వడం వల్ల మరియు గద్దర్ గారి మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా కష్టం. సెన్సార్ ఆపేస్తారు సినిమాని విడుదలకుండా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆగకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా విజయాన్ని సాధించిన కారణంగా ఈ సినిమాని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. విప్లవ గీతాలతో కొట్లాదిమందిని విప్లవం వైపు నడిపించిన విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం. ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను మద్రాస్ లో పెట్టాలి అని ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది చాలా చక్కగా ఈ కథను గద్దర్ గారే రాశారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న చివరి పాట. ఉద్యమకారులు, గద్దర్ గారి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల.
సాంకేతిక నిపుణులు:
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు VR