Supreme Hero Sai Durgha Tej completes 10 Years Film Career
Mega Supreme Hero Sai Dharam Tej is an energetic phenomenon. The entertainer made his smashing entry into the Telugu film industry on November 14, 2014, with Pilla Nuvvu Leni Jeevitham. The crazy and beautiful love entertainer became a massive success. The actor made a powerful debut and continued his rise with a string of successful films.
First impressions are often the best, and this mega nephew quickly won over mega fans with his energy in his first movie. Over his 10-year film career, he has experienced both highs and lows. However, the major setback came when he became the victim of an accident, which took a toll on him. But, he made a remarkable recovery and returned to the sets in no time.
The actor delivered his career-best blockbuster last year with Virupaksha and shared screen space with his inspiration and the current Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan in Bro. His massive comeback impressed everyone. Now, after a long gap, he is gearing up to create a sensation with SDT18.
His new looks and makeover have raised expectations for the film. Along with entertaining his audience, he continues to showcase his good heart and social responsibility. Recently, he responded to miscreant comments about children and donated a significant amount for the flood relief efforts in the Telugu states. With everything going perfectly for Sai Dharam Tej, he is all set to continue his Supreme reign.
Fans, celebrities, and the audience are congratulating the sensational actor on completing a decade in the Telugu Film Industry.
పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజై ఈ రోజుతో పదేళ్లవుతోంది. 2014, నవంబర్ 14న పిల్లా నువ్వు లేని జీవితం సినిమా తెరపైకి వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సాయిదుర్గ తేజ్. ఆయన ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్ డమ్ పెంచుకున్నారు సాయిదుర్గ తేజ్. మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు సాయిదుర్గ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా ఎస్ డీటీ 18 భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. సాయిదుర్గ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసులు గెల్చుకున్నారు సాయిదుర్గ తేజ్. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు