Title & First Look Of Moses Manikchand Part-2 Released
Visionary producer TG Vishwa Prasad’s production house People Media Factory announced an intriguing project #MM Part-2 with Chaitu Jonnalagadda, the elder brother of actor Siddhu Jonnalagadda, playing the lead role. Not only will Chaitu be headlining the film, but he will also take on the creative reins, contributing to the story, screenplay, and dialogue writing. The film will be directed by Raaj Virat of Bomma Blockbuster fame. Today, Natural Star Nani unveiled the film’s title and first look poster and wished the team all the luck.
From the very first glance at the poster, it’s clear that the film titled crazily- Moses Manikchand Part-2 is no ordinary film. The title itself stands out with its intriguing and unconventional tone, setting the stage for a unique cinematic experience. The poster reveals a mix of elements – a liquor bottle, clapboard, girl, and wine glass – all contributing to the film’s glamorous and bold aesthetic. The phrase “GIN & ASS” boldly displayed in the design further hints at the creative and irreverent approach behind the film.
Moses Manikchand Part-2 promises to deliver “A Pan Masala Film” experience. Interestingly, the first-look poster was released on Children’s Day, with a playful twist, stating: Happy ‘No Children’ Day, shows the creative thought that went into designing the poster.
Chaitu Jonnalagadda exudes confidence in the first look poster with a vibrant backdrop, as he sits regally on a royal chair. Sporting heavy jewellery, stylish hair, a light beard, and sunglasses, he embodies the affluence and swagger of his character. Tattoos cover his body, hinting at the rebellious, eccentric nature of the role. The striking and kickass poster instantly generates inquisitiveness.
The tagline- A Real Villain Is Always Better Than A Fake Hero- again is very intriguing and speaks volumes about complexities of Chaitu Jonnalagadda’s character in the movie.
This film is clearly shaping up to be an exciting project with a bold and unconventional narrative. Promises to be a full-on entertainer, Vivek Kuchibhotla is the co-producer, and Krithi Prasad is the creative producer for this project.
The other cast and crew of the movie will be revealed soon.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చైతు జొన్నలగడ్డ, రాజ్ విరాట్ ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని
నటుడు సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో #MM పార్ట్-2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇది వరకే ప్రకటించారు. విజనరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు.
చైతు ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. నేడు (నవంబర్ 14) నేచురల్ స్టార్ నాని సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించి, టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ పోస్టర్లో మద్యం బాటిల్, క్లాప్‌బోర్డ్, అమ్మాయి, వైన్ గ్లాస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. పైగా ఈ చిత్ర పోస్టర్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తూ.. హ్యాపీ ‘నో చిల్డ్రెన్స్’ డే అని పెట్టారు. దీంతో మరింత ఆసక్తికరంగా మారింది.
చైతు జొన్నలగడ్డ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో రాజకుర్చీపై రాజసం ఉట్టి పడేలా కూర్చుండగా.. భారీ ఆభరణాలు, స్టైలిష్ హెయిర్, లేత గడ్డం, సన్ గ్లాసెస్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒంటిపై ఆ టాటూలు పాత్ర తీరు, స్వభావాన్ని సూచించేలా ఉన్నాయి.
ఈ మూవీకి పెట్టిన ట్యాగ్‌లైన్ ‘ఎ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ ఎ ఫేక్ హీరో’ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.