Kanguva has received best openings among South Indian films released in the North – KE Gnanavel Raja
Star hero Suriya’s highly anticipated movie Kanguva, a grand period action film directed by Siva, has become massive success. Featuring Disha Patani and Bobby Deol in pivotal roles, Kanguva was produced by KE Gnanavel Raja, Vamsi, and Pramod under the banners of the renowned production houses Studio Green and UV Creations, with a substantial budget. The film was released on the 14th of this month and has garnered an overwhelmingly positive response, especially in the Telugu-speaking regions, where it is performing exceptionally well. In this context, blockbuster producer KE Gnanavel Raja shared his thoughts on the film’s success in a recent interview:
- “The audience has given Kanguva a grand success after three years of hard work. The Telugu audience’s ability to appreciate quality films has been proven once again. In fact, Kanguva has garnered more collections in Telugu than in Tamil. It stands as the highest-grossing film in Suriya’s career. Collections in the Telugu market are continuing to rise, and multiplexes are seeing packed houses. We are also receiving positive reports from Mythri Movie Distributors, who handled the film’s release in the Nizam area, which makes us even happier.”
- “The film is performing strongly in the North belt as well. We are receiving encouraging box office numbers, especially on weekdays, which indicates a positive long-term performance. Kanguva has received some of the best openings among South Indian films released in the North. Our team is thrilled after seeing the audience’s enthusiastic response in theaters.”
- “Audiences today enjoy watching big-scale movies, and with Kanguva, we’ve created an entirely new world. The high production values and top-notch CGI work are impressing viewers. As a producer, I am proud of the quality of the production. We shot the film on live locations as well as meticulously crafted sets, and when watching the film, it’s hard to distinguish between the two. The entire team worked together to create a seamless final product.”
- “Director Siva has been a great support throughout the production. His guidance helped reduce production-related tensions, ensuring everything ran smoothly. He skillfully blended commercial elements with a strong narrative, making sure the authenticity of the story wasn’t compromised. The guest appearance in the climax was kept under wraps as a surprise, and the audience is absolutely thrilled by that element.”
- “Suriya’s performance in two distinct roles has earned him much acclaim. The dedication and hard work he put into the film are visible on screen, and everyone is praising his performance. Bobby Deol’s role has also become a highlight, and the credit for his casting goes entirely to director Siva.”
- “Devi Sri Prasad has composed a fantastic soundtrack for Kanguva, and the background score has been receiving positive feedback. Songs like Yolo, Fire Song, and Nayaka, are especially resonating with the audience. We did receive some feedback about the BGM being slightly loud, and we are taking this feedback seriously. We are making adjustments in theaters to improve the sound, although the issue was a technical oversight, and not the fault of Devi Sri Prasad.”
- “There is no truth to the rumors about Deepika Padukone being cast as the heroine in Kanguva 2. Work on the sequel hasn’t started yet. Director Siva is committed to working with Ajith in his next project, and after that, we will begin preparations for Kanguva 2. For now, our team has been busy promoting the film across various locations, with little rest, and once we take a short break, I will be open to listening to new scripts.”
- “We are also gearing up for the release of Va Vaathiyar, which we are producing with Karthi under Studio Green. The film will likely release in late January or February, and after that, we will announce our new projects.”
హీరో సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాధిస్తోంది – బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా
స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు రిలీజైన ప్రతి ఏరియా నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ హ్యాపీనెస్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా.- ‘కంగువ’ సినిమాకు మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ టేస్ట్ మరోసారి వెల్లడైంది. తమిళ్ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. సూర్య గారి సినిమాల్లో టిల్ డేట్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ‘కంగువ’ నిలుస్తుంది. తెలుగులో కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. మల్టీప్లెక్స్ లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ సంస్థ నుంచి మాకు సంతోషాన్నిచ్చేలా కలెక్షన్స్ నెంబర్స్ వస్తున్నాయి.
- నార్త్ బెల్ట్ లో ‘కంగువ’ మంచి నెంబర్స్ చేస్తోంది. వీక్ డేస్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గుడ్ సైన్ అంటూ అక్కడి నుంచి బాక్సాఫీస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నార్త్ లో రిలీజైన అన్ని సౌత్ మూవీస్ లో ‘కంగువ’ బిగ్ ఓపెనింగ్స్ దక్కించుకుంటోంది. మా టీమ్ మెంబర్స్ థియేటర్స్ కు వెళ్లి ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.
- ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ బిగ్ స్కేల్ మూవీస్ చూసేందుకు బాగా ఇష్టపడుతున్నారు. ‘కంగువ’ లో మేము ఒక కొత్త వరల్డ్ బిల్డ్ చేశాం. హ్యూజ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సీజీ వర్క్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వైజ్ హై క్వాలిటీతో ఉందనే అప్రిషియేషన్స్ రావడం ప్రొడ్యూసర్ గా నేను సంతోషించే విషయం. సినిమాను లైవ్ లొకేషన్స్ తో పాటు సెట్స్ వేసి చేశాం. అయితే టీమ్ అంతా ఒక యూనిటీగా వర్క్ చేయడం వల్ల పర్పెక్ట్ ఔట్ పుట్ వచ్చింది. నేను స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ఏది సెట్, ఏది సీజీ అనేది గుర్తుపట్టలేకపోయాను.
- మూవీ ప్రొడక్షన్ లో దర్శకుడు శివ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ టెన్షన్స్ నా మీద పడకుండా కొంత తగ్గించారు. ఆయన మూవీని కథ, పాత్రల్లోని జెన్యూనిటీ తగ్గకుండా, మరోవైపు కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేస్తూ అద్భుతంగా ‘కంగువ’ను రూపొందించారు. క్లైమాక్స్ లో వచ్చే గెస్ట్ రోల్ ను సర్ ప్రైజ్ కోసం రివీల్ చేయలేదు. మేము అలా హైడ్ చేసి ఉంచడం వల్లే ఈరోజు థియేటర్స్ లో ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు.
- సూర్య గారు చేసిన రెండు డిఫరెంట్ రోల్స్ కు మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఆయన ఈ మూవీ కోసం పడిన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. సూర్య గారి నటనకు ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందిస్తున్నారు. బాబీ డియోల్ పర్ ఫార్మెన్స్ మరో హైలైట్ అని చెబుతున్నారు. బాబీ డియోల్ గారి సెలెక్షన్ డైరెక్టర్ శివ గారి ఛాయిస్.
- ‘కంగువ’కు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ది బెస్ట్ అందించారు. యోలో, ఫైర్ సాంగ్, నాయకా ..ఇలా ప్రతి సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. బీజీఎం కొంత సౌండ్ ఎక్కువగా ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అది థియేటర్స్ లో రెండు పాయింట్స్ తగ్గిస్తున్నాం. లౌడ్ సౌండ్ టెక్నికల్ గా జరిగిన మిస్టేక్ గానీ దేవి తప్పేం లేదు. ఇదే కాదు ‘కంగువ’కు వస్తున్న ప్రతి ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా తీసుకుంటున్నాం.
- ‘కంగువ’ 2 సినిమాలో దీపిక పడుకోన్ ను నాయికగా తీసుకుంటున్నామనే విషయంలో నిజం లేదు. ఇంకా ఆ మూవీ వర్క్స్ స్టార్ట్ చేయలేదు. డైరెక్టర్ శివ కు అజిత్ తో ఓ మూవీ చేయాల్సిన కమిట్ మెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక ‘కంగువ’ 2 వర్క్స్ బిగిన్ చేస్తాం. ఈ సినిమా ప్రమోషన్ కోసం నెల రోజులకు పైగా నిద్రలేకుండా వివిధ ప్రాంతాలకు ట్రావెలింగ్, ఈవెంట్స్ లో పాల్గొంటున్నాం. నేను చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కొత్త స్క్రిప్ట్స్ వింటాను.
- ప్రస్తుతం కార్తితో మా స్టూడియో గ్రీన్ లో చేస్తున్న వా వాతియర్ జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ఆ సినిమా తర్వాత మా సంస్థలో చేసే కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటిస్తాం.