Gaddaranna intention was that the steel plant should not be privatized – Vennela
The final film of revolutionary poet and activist Gaddar, Ukku Satyagraham, is set to release on November 29. Directed and produced by Janam Star P. Satya Reddy under Janam Entertainments, the film is a powerful depiction of the people’s struggle against the privatization of the Visakhapatnam Steel Plant, encapsulated by the slogan, Visakha Ukku Telugu Vari Hakkam.
Gaddar, renowned for his activism and inspiring poetry, contributed significantly to the film. He sang three songs, performed in two, and acted in key message-driven scenes. With lyrics penned by celebrated writers Goreti Venkanna and Suddala Ashok Teja, and music composed by Srikoti, the film promises to be both emotionally stirring and thought-provoking.
During the film’s press meet about the release date announcement, Director Satya Reddy described the film as a “movement film” deeply rooted in real-life struggles. “The character Gaddar garu plays was crafted keeping in mind activists like Lakshmi Narayana garu and others who have fought for justice. I hope the film becomes a big hit,” he said.
Former CBI Joint Director VV Lakshmi Narayana praised the film’s portrayal of the steel plant’s privatization issues. “I have seen some scenes and this film is inspiring. Watching this film, I feel like we should also be a part of this process. It is a good thing that Gaddar garu is also acting in this film. He used to greet me as Lachchanna Etlunnav. This is a film in which he himself acted. He has infused his inspiration into this film. I hope that this film will be a huge success. My congratulations also to the director of this film,” he said.
Gaddar’s daughter Vennela said, “Today I have come here to be a part of the release date announcement press meet. Gaddaranna used to leave Hyderabad for Visakhapatnam and then return home. He spent a lot of time for this movie. His intention was that the steel plant should not be privatized. Gaddar made this movie for those who shed their blood and developed the steel plant. It is not as if he acted in this movie, it is as if he lived. I wish this movie a big success.”
Cast: Gaddar, P. Satya Reddy, Jhansi (‘Pulsar Bike’), MLA Dharmasri, MVV Satyanarayana, Prasanna Kumar, Vennela
Music: Srikoti
Editor: Srinu
Story, Screenplay, Producer, and Direction: P. Satya Reddy
PRO: Madhu VR
విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ ఈనెల 29న విడుదల
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని నేడు ప్రకటించారు. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ లో దర్శకులు సత్యారెడ్డి మాట్లాడుతూ, “విప్లవ కవి గద్దర్ అన్న గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం ఈ నెల 29 న విడుదల కానుంది. తన పదవి కి తృణప్రాయం గా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ గారి తో పాటు ఎంతో మంది ఉద్యమకారులని దృష్టి లో ఉంచుకొని ఈ సినిమా కథానాయకుడి పాత్ర గద్దర్ గారు తీర్చిదిద్దారు. ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ చిత్రం” అని అన్నారు.
ఎక్స్ సీబీఐ డైరెక్టర్ వీవీ లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ, “ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు, అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు అనేది చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసాను, ఈ సినిమా ఇన్స్పిరింగ్ గా ఉంది. ఈ సినిమా చూస్తుంటే, ఈ ప్రక్రియ లో మనం కూడ భాగస్వామ్యం అవ్వాలని అనిపిస్తుంది. గద్దర్ గారు కూడా ఈ సినిమా లో నటించడం మంచి విషయం. అయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు. అయన స్వయంగా నటించిన సినిమా ఇది. అయన స్ఫూర్తి ని ఈ సినిమా లో నింపారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం చవిచూస్తుందని, అందరూ సినిమా ని ఆదరిస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఈ సినిమా లో నటించిన అందరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా దర్శకులు సత్యా రెడ్డి గారికి కూడా నా అభినందనలు.” అని తెలిపారు.
గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ, “ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల తేదీ ని అనౌన్స్ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. గద్దర్ అన్న గారు హైదరాబాద్ నుంచి విశాఖ కు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కెటించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళని కోసం ఈ సినిమా చేసారు గద్దర్ గారు. ఆయన ఈ సినిమా లో నటించినట్టు లేదు, జీవించినట్టు ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
నటీనటులు :
గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల
సాంకేతిక నిపుణులు:
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు VR