Give us the space to grow, support Roti Kapada Romance – Vikram Reddy
Vikram Reddy, the debut director of Roti Kapda Romance, expressed his thoughts about his journey, his first film, and the challenges faced by small-budget movies in the industry during a recent media interaction.
Drawing inspiration from S.S. Rajamouli, Vikram said, “Even Rajamouli’s first film was a small-budget project like Student No. 1. From there, he went on to create cinematic marvels like Baahubali and RRR. My first film, Roti Kapda Romance, is like Student No. 1 to me. I also have grand stories that could rival the scale of RRR. But for that, debut directors like me need opportunities. The industry must support small films and provide the space we need to showcase our work.”
He emphasized, “Currently, there’s a lack of space for smaller movies. In some places, even old films like Amaran continue to screen. If my film were given that space, it could have achieved half the collections. My humble request to the industry is to promote and nurture small films. Give us a chance to grow.”
His Background
Born and raised in Hyderabad, Vikram credits his mother as his inspiration for pursuing a career in films. “My mom was a huge movie lover and never missed a Friday release. She would go with her friends, and I would tag along. This sparked my love for films. Later, I decided to become a director after seeing Teja’s name on the poster of Chitram. I struggled to get into the industry, hoping to join as an assistant director, but it didn’t work out. Puri Jagannadh advised me to focus on studying films instead, which helped me understand the craft better. Eventually, I presented my story to Bekkem Venugopal, who gave me my first break.”
About Roti Kapda Romance
“This is a youthful romantic entertainer filled with friendship and comedy. It revolves around four boys whose lives change after four girls enter their world. It explores love, breakups, and their realizations. The film is a perfect blend of emotions and entertainment. The last 15 minutes, in particular, will touch everyone’s hearts and leave a lasting impression.”
Challenges and Changes
When asked about story changes, Vikram shared, “Initially, Dil Raju showed interest in producing the film, but he suggested some changes. I believed those changes would compromise my story, so I chose to stay true to my vision. Dil Raju respected my decision and even came up with the title Roti Kapda Romance.”
Confidence and Vision
“I have always been confident in my storytelling. My ultimate dream is to create a multi-starrer film featuring Chiranjeevi and Ram Charan. I already have a story prepared for them. For me, this journey began with hard work and determination. Over the past seven years, I’ve written 15 scripts, all aiming to tell compelling stories. I believe I can achieve great things with perseverance.”
The Need for Space in the Industry
Vikram concluded with an appeal to the industry: “Every director starts small; even legends like Rajamouli began with smaller films. Give us the space to grow, support our films, and help us showcase our talent. I firmly believe that small films are the foundation for the next generation of great filmmakers.”
చిన్న సినిమాకు స్పేస్ ఇవ్వండి.. నాకు అవకాశం ఇస్తే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేస్తాను! : రోటి కపడా రొమాన్స్ చిత్ర దర్శకుడు విక్రమ్ రెడ్డి
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కూడా తొలిసినిమా స్టూడెంట్ నెం.1 చిత్రమే. ఆ తరువాత ఆయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు సృష్టించాడు. నాకు కూడా నా తొలిచిత్రం రోటి కపడా రొమాన్స్ చిత్రం కూడా నాకు స్టూడెంట్ నెం.1 లాంటిదే. భవిష్యత్‌లో నేను కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తీస్తా. అలాంటి కథలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ తొలి చిత్ర దర్శకుడిని నిలబడే ఛాన్స్ ఇవ్వండి.. చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వండి. ఇక్కడి సినిమాలకు అవకాశం ఇవ్వండి.. ఏ సినిమాలు లేక ఇప్పటికీ అమరన్ సినిమానే ఇక్కడ ఆడుతుంది. మన సినిమాలు అక్కడ పట్టించుకోరు. ముందు మన సినిమాను బ్రతికించుకోండి అంటున్నారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్‌రెడ్డి చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
మీ నేపథ్యం ఏమిటి?
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను సినీ రంగంలోకి రావడానికి కారణం మా అమ్మ. ఆమె నాకు ఇన్స్పిరేషన్. ప్రతి శుక్రవారం విడుదలైన ప్రతి సినిమా తన లేడీ గ్యాంగ్‌తో కలిసి చూసేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు తెలియకుండానే సినిమాపై ఇష్టం ఏర్పడింది. ఇక ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. అయితే దర్శకుడు తేజ ‘చిత్రం’ సినిమా పోస్టర్‌పై ఆయన పేరు చూసిన తరువాత దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ తరువాత సినిమా రంగంలోకి రావడానికి చాలా ప్రయత్నించాను. ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ దర్శకుడిగా జాయిన్ కావాలని అనుకుని ప్రయత్నించాను కానీ కుదరలేదు. కానీ పూరి జగన్నాథ్ ఇచ్చిన సలహాతో అసిస్టెంట్‌గా చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుని.. సినిమాలు చూడటం మొదలుపెట్టి.. సినిమాలు చూడటమే పనిగా అనుకుని సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌లపై గ్రిప్ వచ్చిన తరువాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ తరుణంలో నేను చెప్పిన కథ బెక్కం వేణుగోపాల్‌కు నచ్చి ఈ రోజు దర్శకుడిగా మీ ముందు ఉన్నాను.
రోటి కపడా రొమాన్స్ ఎలాంటి చిత్రం?
ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, కామెడీ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏమిటి అనేది సినిమా. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.
కథలో ఏమైనా మార్పులు చేశారా?
ఫస్ట్ ఈ సినిమా దిల్ రాజు చేద్దామని అనుకున్నారు. అయితే ఆయన కథలో మార్పులు చేయమని అడిగారు. ఆ మార్పుల వల్ల నా కథకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత కూడా కథలో నేను ఎలాంటి మార్పులు చేయలేదు.
దిల్ రాజు లాంటి నిర్మాత బ్యానర్లో సినిమా చేసి వుంటే బాగుండేది కదా? ఆయనను కాదని సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
తప్పు అయినా ఒప్పు అయినా నేను అది నేనే చేయాలి. నేను ఏదో ఒక విధంగా ఏదో ఒక సినిమాతో దర్శకుడిని అయిపోవాలి అనుకునే తత్వం నాది కాదు. నా కథకు నేనే క్రిటిక్‌ని . కథపై నాకున్న నమ్మకం అలాంటిది. ఈ విషయాన్ని రాజు గారు కూడా స్వాగతించారు. అంతే కాదు నా చిత్రానికి ‘రోటి కపడా రొమాన్స్ అనే టైటిల్ కూడా దిల్ రాజు ఇచ్చారు.
మీ మీద మీకు అంతా కాన్ఫిడెన్స్ ఏమిటి?
నా కథలు చాలా పెద్దవి. నా కెరీర్లో బెస్ట్ సినిమా ఊహించుకుని నా కెరీర్‌ను స్టార్ చేశాను. చిరంజీవి, రామ్‌చరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి అది నా అల్టీమేట్ గోల్. దాని కోసం నేను కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉంది.
ఈ సినిమా కథకు రియల్‌లైఫ్ సంఘటనలు ఏమైనా ఇన్స్పిరేషన్గా నిలిచాయా?
ఈ సినిమాకు సంబంధించి నాకళ్ల ముందు చూసినవి.. నా ఫ్రెండ్ష్ లైఫ్‌లో జరిగిన ఇన్సిండెంట్స్ ఇన్స్పిరేషన్.. ఇందులో వున్న నాలుగు విభిన్న ప్రేమకథలు చేయడం చాలా కష్టం ఇలాంటి సినిమాలు చేసినప్పుడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్లంతా ఓ కొత్త దర్శకుడిలా సినిమా తీయలేదు అని అభినందించారు.
రొమాన్స్ ఎక్కువ ఉందని సెన్సారు వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారా?
ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా నేచురల్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా ఉంటాయి. అప్పుడే సినిమాకు ఆ వైబ్ వుంటుంది ఈ సినిమాలో రొమాన్ష్ శృతి మించి వుండదు. ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ చేసిన తరువాత మీకు మంచి కిక్ వస్తుంది.
సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఈ తరుణంలో విడుదల చేయడం రిస్క్ అనిపించలేదా?
సినిమా అన్ని హక్కులను ముందే అమ్మేయడం వల్ల ఈ రిలీజ్ డేట్ రిస్క్‌లో మేము వుండాల్సి వచ్చింది. థియేటర్ష్ లేకపోవడం వల్ల పలుసార్లు విడుదల తేది మార్చాం. సినిమాను ఈటీవి వీన్ వాళ్లు, పంపిణీదారులు ఇచ్చిన సలహాతో డేట్స్ మార్చాం. సినీ పరిశ్రమలో పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అందరికి రీచ్ అవ్వాలనే ఈ డేట్‌ను అనుకున్నాం. అయితే సినీ పరిశ్రమకు నా విన్నపం ఒక్కటే ఇక్కడ చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వండి.. ప్రతి దర్శకుడు మొదటి సినిమానే ఆర్ఆర్ఆర్ చేయడు. రాజమౌళికి తొలి సినిమా కూడా స్టూడెంట్ నెం.1 లాంటి చిన్న సినిమానే. ఆ తరువాత ఆయనే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమాలు తీశాడు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా కూడా నేను తీస్తాను. అలాంటి కథలు కూడా వున్నాయి. అయితే ఇక్కడ కావాల్సింది. స్పేస్ ఇచ్చి నిలబెట్టడం ఇప్పుడు ఏ సినిమాలు లేక అమరన్ ఆడుతుంది. నా సినిమా విడుదల చేసే స్పేస్ ఇచ్చి వుంటే అందులో సగం వసూళ్లు నా సినిమాకు వచ్చేవి. అసలు మన సినిమాలకు అక్కడ స్పేస్ కూడా ఇవ్వరు. ఇక్కడ మన సినిమాను కాపాడుకోండి అని అందరిని విన్నవించుకుంటున్నాను
మీ తదుపరి చిత్రం ఏమిటి?
ఈ జర్ని స్టార్ అయిన తరువాత నిద్ర లేని రాత్రుళ్లు గడిపాను. ఈ సినిమా ప్రయాణంలోనే ఈ ఏడేళ్లలోనే 15 కథలు రాసుకున్నాను. ఈ సినిమా తరువాత నా తదుపరి సినిమా డిసైడ్ అవుతుంది.
సినిమా నచ్చకపోతే సినిమాలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చారు?
ఈ సినిమా ఒక్కరైనా బాగా లేదు అంటే నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను. ఈ సినిమా నా బేబి.. లాంటింది ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది. పది మంది వచ్చి చూసి బాగాలేదు అంటే రిటైర్మెంట్ ఇస్తాను. నా సినిమాతో మల్లీప్లైక్ థియేటర్స్‌ను మాస్ థియేటర్లు అవుతాయి