హిలేరియస్ గా ‘సుందరకాండ’ టీజర్
నారా రోహిత్, వెంకటేష్ నిమ్మలపూడి, సందీప్ పిక్చర్ ప్యాలెస్ ‘సుందరకాండ’ ఫన్ ఫుల్ టీజర్ రిలీజ్
హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్‌ని లాంచ్ మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం టీజర్ లో హిలేరియస్ గా అనిపించింది. క్యారెక్టరైజేషన్, కామిక్ టైమింగ్‌తో హ్యుమర్ అందించే నారా రోహిత్‌కి ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్‌గా కనిపిస్తుంది. అతని జోడిగా వృతి వాఘని ఆకట్టుకుంది. శ్రీ దేవి విజయ్ కుమార్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు, నరేష్ విజయ కృష్ణ రోహిత్ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించారు.
టీజర్లో చూపినట్లుగా, ఈ కథ ప్రతి వ్యక్తికి రిలేట్‌గా చేసుకునేలా వుంది. వెంకటేష్ నిమ్మలపూడి ఫన్ ఫుల్ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందించారని టీజర్ ప్రామిస్ చేస్తోంది. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ వైబ్రెంట్ గా వుంది. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హ్యుమర్ ని ఎలివేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రోహన్ ఎడిటర్ కాగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. వెంకీ నాతో ఐదేళ్ళుగా జర్నీ చేస్తున్నాడు. ఇదొక పెక్యులర్ లవ్ స్టొరీ. కమ్ బ్యాక్ మూవీ గా ఈ స్క్రిప్ట్ నే లాక్ చేశాం. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్. సంతోష్, గౌతమ్, రాకేశ్ సినిమాని బలంగా నమ్మారు. వెంకీ బ్రిలియంట్ కథ రాశారు. ఈ స్టేజ్ మీద వున్న అందరినీ కథే తీసుకొచ్చింది. టీజర్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. లియాన్ జేమ్స్ మంచి ఆల్బం ఇచ్చాడు. మంచి పాటలు కుదిరాయి. మున్ముందు సినిమా నుంచి మరింత కంటెంట్ రాబోతోంది. థాంక్ యూ ఆల్’ అన్నారు.
డా. నరేష్ వికే మాట్లాడుతూ.. ‘సుందరకాండ’లాంటి లవ్ స్టొరీ తెలుగులో చూడలేదు, నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి లవ్ స్టొరీ ఎవరూ ఊహించలేరు. ఈ టీజర్ నాలుగు సార్లు చూడాలనిపిస్తుంది. చాలా ప్లజెంట్ గా వుంది. ఇది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. రోహిత్ తప్పా ఈ క్యారెక్టర్ లో ఎవరినీ ఊహించలేను. తన చాలా సపోర్ట్ చేస్తారు. తనతో మళ్ళీ మళ్ళీ కలిసి వర్క్ చేయాలని వుంది. వెంకటేష్ చాలా అందంగా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా విందు భోజనంలా వుంటుంది. నిర్మాతలు చాలా గ్రాండ్ గా తీశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’ అన్నారు.
యాక్ట్రెస్ శ్రీదేవి మాట్లాడుతూ… అందరినీ మళ్ళీ కలవడం చాలా ఆనందంగా వుంది. నాకోసం ఇంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్ వెంకీ గారికి థాంక్. టీజర్ ని చూసినప్పుడు ఈశ్వర్ డేట్స్ గుర్తుకువచ్చాయి. మా నిర్మాతలకు థాంక్స్. ఇది చాలా మంచి కలర్ ఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’ అన్నారు.
నిర్మాత సంతోష్ చిన్నపొల్ల మాట్లాడుతూ..అందరికీ థాంక్ యూ. రోహిత్ అన్న థాంక్ యూ. ఆయన ముందుంచి నడిపించారు. వెంకీ పెద్ద డైరెక్టర్ అవుతారు. అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు
డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి.. ఇది నా ఫస్ట్ స్టేజ్. ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి థాంక్ యూ వెరీ మచ్. టీజర్ లానే ఇంతే క్లీన్ ,నీట్ గా సినిమా వుంటుంది. సినిమా చూసి నవ్వుకొని కొన్ని మంచి మెమరీస్ ఇంటికి తీసుకెళతారు’ అన్నారు.
హీరోయిన్ వృత్తి వాఘని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా కోసం వండర్ ఫుల్ టీం తో కలిసి పని చేశాం. తప్పకుండా సినిమా అందరికీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.
యాక్ట్రెస్ వాసుకి మాట్లాడుతూ.. ఈ సినిమా సైన్ చేయడానికి రీజన్ వెంకీ రాసిన స్క్రిప్ట్. ఈ సినిమా ఫెయిరీ టేల్ లా వుంటుంది. టీజర్ లో చూసింది కొంచెం, సినిమాలో చాలా వుంది. అద్భుతమైన కథ. ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమాలో పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను
యాక్టర్ అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. చాలా మంచి రామ్ కం ఇది. రోహిత్ అన్న చాలా మంచి కథలు పట్టుకొని సినిమాలు చేస్తారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. వెంకీ చాలా అద్భుతంగా సినిమా తీశారు. టీజర్ లో కొంచెం చూపించారు. సినిమాలో చాలా వుంది. కథ కోసం ఈ సినిమాలో పార్ట్ అయ్యాను. సినిమా చాలా బావుంటుంది. ఇది క్రేజీ లవ్ స్టొరీ. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
సహ నిర్మాత రాకేష్ మహంకాళి.. రోహిత్ గారికి థాంక్ యూ సో మచ్. ఆయన్ని యాక్టర్ కంటే మంచి ఫిల్మ్ మేకర్ చూశాను ఆయనతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది.’ అన్నారు
సహ నిర్మాత గౌతమ్ రెడ్డి.. ఇంతమంచి అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి థాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎక్స్ లెంట్ ఎక్స్ పీరియన్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు.
నటీనటులు: నారా రోహిత్, వృత్తి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు.
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు
VFX సూపర్వైజర్: నాగు తలారి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ – ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్