మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
కంటెంట్ ఉంటే సినిమా హిట్ – హీరో, దర్శకుడు ధృవ వాయు
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమాను తీయడం.. హిట్టు కొట్టడం.. హౌస్ ఫుల్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీడియా సపోర్ట్ వల్లే మా సినిమా ఇంత వరకు వచ్చింది. వారి సహకారం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. వర్డ్ ఆఫ మౌత్ తో మా సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది. మా సినిమాను ఇంత ఇష్టపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ నిరూపించారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ ఈ సినిమా మీద ముందు నుంచీ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది. ఆయన వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా వచ్చింది. టెక్నికల్‌గా మూవీ అద్భుతంగా వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమాను ఇంత బాగా ఆధరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా సినిమాను ఇంత బాగా ముందుకు తీసుకు వెళ్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. ‘నన్ను ప్రేక్షకులంతా కూడా పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా ఈ చిత్రం కోసం పని చేశాను. ఈ రోజు ఈ సక్సెస్ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ మాట్లాడుతూ.. ‘ధృవ వాయు కళింగ సినిమా కోసం రెండేళ్లు చాలా కష్టపడ్డాడు. అడవుల్లో షూటింగ్ చేశాం. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. కళింగ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని ఆడియెన్స్ అంటున్నారు. సినిమాని చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
కెమెరామెన్ అక్షయ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. మా గురించి అందరూ బాగా రాశారు. టెక్నికల్ టీం గురించి మాట్లాడుతున్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన ధృవ వాయు గారికి థాంక్స్’ అని అన్నారు.
Thanks to the Audience for making ‘Kalinga’ such a Huge Hit: Hero and Director Dhruva Vaayu During Success Meet
Dhruva Vaayu, who gained recognition with the film Kerosene, has now achieved a big hit with Kalinga. Both as a director and actor, he has captivated everyone with Kalinga. Produced by Deepthi Kondaveeti and Pruthvi Yadav under the banner of Big Hit Productions, the film was released on September 13 and has achieved great success. Interim, the film unit held a success meet.
Hero and Director Dhruva Vaayu said, “For a newcomer like me to make a film under tough circumstances, score a hit, and achieve housefuls is no ordinary feat. It’s thanks to the media support that our film has reached this point. Their cooperation has led to such a big hit. Through word of mouth, our film is reaching even further. I am very happy that people love our film so much. Every element of our film, from the visuals to the portrayal of the goddess, is being talked about by the audience. Thanks to everyone who worked on this film. Thanks to the audience for supporting our film so well. Once again, Telugu audiences have proven that content makes the film a hit. Thanks to the audience for making our film such a big hit.”
Producer Deepthi Kondaveeti said, “Our director has had unwavering faith in this film from the beginning. His faith is what brought the film to where it is now. It is because of him that the film has turned out so great. Everyone is praising the movie for its technical excellence. Thanks to the audience for giving our film such a great success.”
Producer Pruthvi Yadav said, “Thanks to the audience for supporting Kalinga so well. Thanks to the media for taking our film forward.”
Heroine Pragya Nayan said, “The audiences are calling me ‘Paddu’ with affection. I am happy with the great response to my role. I have worked on this film for the past three years. Seeing the success today makes me very happy. Thanks to our director and producers for giving me this great opportunity.”
Chief Marketing Head Vamshi said, “Dhruva Vaayu worked very hard on Kalinga for two years. We shot in forests with no phone signals. The audience says that the climax is the soul of the film. They mention getting goosebumps while watching the movie. Thanks to the audience for giving so much love to our film.”
Cameraman Akshay said, “Thanks to the audience for making Kalinga such a big hit. Everyone has written well about us. They are talking about the technical team. Thanks to everyone who worked on this movie. Thanks to Dhruva Vaayu for giving me such a great opportunity.”