Tamil sensation “Dada” to release in Telugu as “pa.. pa..”
A feel-good emotional drama is set to captivate Telugu audiences. Starring Kavin and Aparna Das in lead roles, the Tamil sensation “Dada,” directed by Ganesh K Babu, will be released in Telugu under the title “Pa pa.” producer Neeraja Kota under JK Entertainment, this movie, which resonated deeply with Tamil audiences, was a massive blockbuster in Kollywood. In Telugu, it is being released by Achibabu under MG Movies on December 13.
Last year, “Dada” emerged as a sensational hit in Tamil cinema. Made on a modest budget, the film collected approximately ₹30 crores, becoming a blockbuster and earning tremendous profits for its distributors.
Producer Neeraja Kota expressed confidence that the Telugu version, “Pa pa,” with its heartwarming father-son sentiment, will equally impress Telugu audiences. Combining comedy, emotions, and romance, this feel-good emotional drama is expected to connect well with viewers and achieve blockbuster success. The movie is slated for a grand release on December 13 in theaters across Andhra, Telangana, the USA, and Australia.
Production House: JK Entertainments
Producer: Neeraja Kota
Hero: Kavin,
Heroine: Aparna Das
Supporting: BhagyaRaja, VTV Ganesh, Aishwarya, Pradeep Shakthi
Music: Jen Martin
Lyricist: Ravi Varma Akula
PRO: Kadali Rambabu, Ashok Dayyala.
తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా’
తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
గత ఏడాది తమిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్టు అవుతుందని, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారని చెప్పారు.
ప్రొడక్షన్ హౌస్: JK ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: నీరజ కోట
హీరో: కవిన్,
హీరోయిన్: అపర్ణా దాస్
నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
మ్యూజిక్: జెన్ మార్టిన్
సాహిత్యం: రవివర్మ ఆకుల
పీఆర్వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల