
Ma Chinni Siva Devotional Video Song Launched
ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఎంఎం శ్రీలేఖ స్వరపర్చి పాడిన మా చిన్ని శివ డివోషనల్ వీడియో సాంగ్ రిలీజ్
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ స్వరపర్చి పాడిన మా చిన్ని శివ డివోషనల్ వీడియో సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మా చిన్ని శివ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను జి. మణి లక్ష్మణరావు ప్రొడ్యూస్ చేశారు. భారతి బాబు లిరిక్స్ అందించగా శ్రీరామ్ కంగటాల డీవోపీ, ఎడిటింగ్ తో పాటు దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ జి. మణి లక్ష్మణరావు మాట్లాడుతూ – ఈ రోజు మా చిన్ని శివ డివోషనల్ సాంగ్ లాంఛ్ చేసేందుకు అతిథిగా వచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి థ్యాంక్స్. అద్భుతమైన ట్యూన్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఎంఎం శ్రీలేఖ ఈ పాటను పాడారు. ఈ పాటను గ్రాండ్ గా మన ముందుకు తీసుకొచ్చిన నిర్మాత జి.మణి లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. మా చిన్ని శివ పాటను మీరంతా విని భక్తితో పరవశిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ – నేను గతంలో శివుడి డివోషనల్ సాంగ్స్ చేశాను. శివుడి పాటలు వైబ్రెంట్ గా మంచి సౌండింగ్ తో ఉంటాయి. ప్రొడ్యూసర్ మణి లక్ష్మణరావు గారు ఈ పాట కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ఆలోచించి చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. ఒక తల్లి కనిపించని తన కొడుకుని శివుడిగా భావించి అతన్ని వెతుకుతూ వెళ్తుంది. శివుడు ఆ సమయంలో ఎలా విశ్వరూపం చూపించాడనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఈ పాటను డిజైన్ చేశారు. ఈ పాటను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వివిధ లొకేషన్స్ లో నిర్మించారు ప్రొడ్యూసర్ గారు, అలాగే ప్రమోట్ చేస్తున్నారు. నా పాటలు కొన్ని గతంలో బాగున్నా, అవి ప్రమోషన్ లేక ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఈ పాటను కంపోజ్ చేసి పాడాను. మా చిన్నాన్న విజయేంద్రప్రసాద్ గారితో ఈ పాటను లాంఛ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. అన్నారు
రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ఈ పాటకు బాగా కంపోజ్ చేశారు. శ్రీలేఖ బ్యూటిపుల్ గా పాడింది. సాహిత్యం మనసు పెట్టి రాశారు భారతి బాబు. మీ పిల్లాడు ఎక్కడా తప్పిపోలేదు. మా మహేశ్ బాబు వారణాసి సినిమా ఈవెంట్ కు వచ్చాడు. ఈ విషయం రాజమౌళిని, ప్రియాంక చోప్రాను అడిగినా చెబుతారు. మా చిన్ని శివ పాట టీమ్ అందరికీ నా ఆశీర్వాదాలు అందజేస్తున్నా. అన్నారు.
లిరిసిస్ట్ భారతి బాబు మాట్లాడుతూ – విజయేంద్రప్రసాద్ గారు మా గురువు గారు. ఆయన మూవీస్ కు సాంగ్స్ రాశాను. ఎంఎం శ్రీలేఖ గారితో గతంలోనూ ఎన్నో సాంగ్స్ కు లిరిక్స్ అందించాను. మా చిన్ని శివ సాంగ్ మీలో మరింతగా భక్తి శ్రద్ధలు పెంచుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నటి ప్రియ జాస్పర్ మాట్లాడుతూ – మా చిన్ని శివ వీడియో సాంగ్ లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాటను అందరి మనసుకు హత్తుకునేలా భక్తిభావం ఉట్టిపడేలా రూపొందించాం. ఈ పాటకు నాతో పాటు పనిచేసిన అందరికీ థ్యాంక్స్. మా చిన్ని శివ సాంగ్ చాలా బాగా వచ్చింది. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ రామ్ గణపతి మాట్లాడుతూ – నేను గతంలో రాజయోగం అనే మూవీకి డైరక్షన్ చేశాను. ప్రొడ్యూసర్ జి. మణి లక్ష్మణరావు గారు అమ్మవారి ఉపాసకులు. నవబాల యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎంతోమందికి భక్తిమార్గం సూచిస్తున్నారు. ఆయన ప్రతి సంవత్సరం సాంగ్స్ మూవీస్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే మా చిన్ని శివ అనే మంచి డివోషనల్ సాంగ్ చేశారు. ఈ పాటకు కొంతవరకు పిక్చరైజేషన్ నేనూ చేశాను. ఈ సాంగ్ డైరెక్టర్ శ్రీరామ్ కంగటాల మరో చోట ఉండిపోయి రాలేకపోయారు. అన్నారు.
