Lyrical Song ‘Vassahi’ from Mr. Idiot Released by Actor Sivaji
Mass Maharaja Ravi Teja’s younger brother, Raghu’s son, Maadhav, plays the lead role in the upcoming film Mr. Idiot. Simran Sharma stars as the female lead. The film is produced by JJR Ravichand under the banner of JJR Entertainments LLP and presented by Mrs. Yelamanchi Rani. The movie is directed by Gowri Ronanki, who previously delivered the commercial hit Pelli Sandadi. Mr. Idiot is set to release theatrically soon.
Today, versatile actor Sivaji launched the lyrical song ‘Vassahi Vassahi..’ from Mr. Idiot. He praised the song for its beautiful composition and vibrant picturization. Sivaji also noted that this is the first song ever sung in Sanskrit, appreciating its uniqueness. He extended his best wishes to hero Maadhav and the entire team behind the film.
The song ‘Vassahi Vassahi’ features a catchy composition by Anup Rubens, with lyrics penned by legendary lyricist Shivashakti Dutta. Singer Sree Ramachandra delivered an energetic performance.
Technical Team:
- Cinematography: Ram Reddy
- Art: Kiran Kumar Manne
- Editing: Viplav Naishadhyam
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Producer: JJR Ravichand
- Written & Directed by: Gowri Ronanki
వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియట్” సినిమాలోని ‘వస్సాహి వస్సాహి..’ లిరికల్ సాంగ్ రిలీజ్
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియట్” సినిమా నుంచి ‘వస్సాహి వస్సాహి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘వస్సాహి వస్సాహి..’ సాంగ్ బ్యూటిఫుల్ కంపోజిషన్ తో, కలర్ ఫుల్ పిక్చరైజేషన్ తో ఆకట్టుకుందని శివాజీ అప్రిషియేట్ చేశారు. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదు, ఇది ఫస్ట్ సాంగ్ అని శివాజీ ప్రశంసించారు. హీరో మాధవ్ తో పాటు ఎంటైర్ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
‘వస్సాహి వస్సాహి..’ పాటను అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా లెజెండరీ లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర ఎనర్జిటిక్ గా పాడారు. ‘సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా…వస్సాహి వస్సాహి’ అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట
నటీనటులు – మాధవ్, సిమ్రాన్ శర్మ, జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ, తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ – శ్యామ్, వంశీ, కూచిపూడి బ్రదర్స్
సంగీతం అనూప్ రూబెన్స్
లిరిక్స్ – శివశక్తి దత్తా, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్
కొరియోగ్రఫీ – భాను, జిత్తు, వెంకట్, పృథ్వీ
స్టంట్స్ – రాజేశ్ లంక
సినిమాటోగ్రఫీ – రామ్ రెడ్డి
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ – విప్లవ్ నైషధం
పీఆర్వో – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం – గౌరి రోణంకి