
Arya-2 Re-releasing on April 5
Icon Star Allu Arjun and brilliant director Sukumar—this is a sensational combo! After delivering blockbusters like Pushpa and Pushpa-2, their collaboration has gained worldwide recognition. Before these massive hits, this dynamic duo worked together on Arya and its sequel, Arya-2, which became a sensational love story when it was released in 2009.
With Allu Arjun’s phenomenal performance, Devi Sri Prasad’s sensational music, and Sukumar’s brilliant screenplay, Arya-2 remains one of the most beloved films among fans and audiences.
Amidst the growing trend of re-releases, the makers have now officially announced that Arya-2 will hit the big screens once again on April 5. This exciting news has thrilled fans who have been eagerly waiting for its re-release.
Produced under the Aditya Arts banner, Arya-2 was presented by BVSN Prasad and produced by Aditya Babu. The film also stars Navdeep and Kajal Aggarwal in key roles. After nearly 15 years, Arya-2 is making a grand comeback to theaters!
Get ready for the nostalgia—Arya-2 is back on the big screen on April 5!
ఏప్రిల్ 5న ఐకాన్‌స్టార్, అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల మ్యాజికల్ లవ్ ఎంటర్టైనర్ ‘ఆర్య-2’ రీరిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్.. ఇదొక సన్సేషనల్ కాంబో.. పుష్ప, పుష్ప-2 ఈ చిత్రాల తరువాత ఈ కాంబినేషన్ పవర్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. పుష్ప-2 చిత్రంతో వసూళ్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఈ క్రేజీ కాంబో.. తొలి సినిమా
ఆర్య’ వంటి విభిన్న ప్రేమకథా చిత్రం తరువాత రూపొందిన రెండో చిత్రం ‘ఆర్య-2’. ఆర్యకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సన్సేషనల్‌గా నిలిచింది. 2009లో విడుదలైన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ పర్ఫార్మెన్స్, దేవి శ్రీప్రసాద్ సన్సేషనల్ మ్యూజిక్, సుకుమార్ బ్రిలియంట్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌కు, ఐకాన్ స్టార్ అభిమానులకు వన్ఆఫ్ దఫేవరేట్ చిత్రంగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఆర్య-2 చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఆర్య-2 రిరీలీజ్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఎంతో కిక్ ఇచ్చే వార్త. సో.. ఏప్రిల్ 5న ఆర్య-2 రిరీలీజ్ కోసం అందరూ సిద్దమవుతున్నారు. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్యబాబు నిర్మించిన ఈ చిత్రంలో నవదీప్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్య తారాగణంగా నటించారు. 2009లో విడుదలైన ఆర్య-2 అంటే దాదాపు 15 సంవత్సరాలు తరువాత మళ్లీ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రానుంది.