‘RawKing’ Manoj Manchu Restores Dignity to a Forgotten Life at

కాటాలన్ లో ఇప్పటివరకు నేను చేయని ఒక విభిన్నమైన పాత్రను పోషించాను – సునీల్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న భారీ పాన్-ఇండియా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, టాలీవుడ్ నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు సునీల్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. పుష్ప తర్వాత నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్‌లో పడింది. ఏ భాష నుంచి, ఎప్పుడు, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో నిజంగా నాకు తెలియడం లేదు.(నవ్వుతూ) జైలర్ సినిమా చూసిన తర్వాత కేరళకు వెళ్లినప్పుడు కూడా నాకు తమిళ్లో సీన్ పేపర్లు ఇచ్చారు. (నవ్వుతూ) ఈ సినిమాలో నేను ‘మారి’ అనే కీలక పాత్ర చేస్తున్నాను. ఇది నాకు చాలా తృప్తిని ఇచ్చిన పాత్ర. ఇలాంటి పాత్రను నేను ఇప్పటివరకు చేయలేదు. అలాంటి అవకాశం రావడం పుష్ప దయ అనుకుంటున్నాను. చాలా వెరైటీగా, వెర్సటైల్‌గా ఉండే పాత్ర ఇది. షరీఫ్ గారు చాలా పెద్ద నిర్మాత. మార్కోతో అద్భుతమైన సినిమా తీశారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసే నిర్మాత. డైరెక్టర్ పాల్ గారు ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇందులో నాకు చాలా ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. ఈ పాత్ర చేయడానికి ఆయన ఎంతో ప్రోత్సహించారు. వారి సపోర్ట్‌తోనే ఈ సినిమా చేశాను. జగదీష్ గారు ఎన్నో సినిమాల్లో హీరోగా చేశారు. అలాంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ జర్నీ మొత్తం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. షూటింగ్ ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేశాను. ఇందులో నేను చేసిన పాట కూడా చాలా బాగా వచ్చింది. షూటింగ్ అనుభవం కూడా ఎంతో మెమొరబుల్‌గా నిలిచిపోయింది. రవి బస్రూర్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకొచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి ధన్యవాదాలు. ఇది చాలా మంచి సినిమా. ఇందులో చాలా బలమైన విషయం ఉంది. ప్రతిదీ చాలా లాజిక్‌తో ఉంటుంది. ఇది నేను చేసిన అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి. ప్రొడక్షన్ పరంగా చాలా భారీగా తెరకెక్కించారు. యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మే 28న విడుదలవుతున్న ఈ సినిమాను మీరందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఆజాద్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మార్కో తర్వాత ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. కాటాలన్లో అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. సినిమాలో హై లెవెల్ ఎనర్జీ, అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఉంటాయి. మే 28న థియేటర్లలో కలుద్దాం.”
నటుడు కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మార్కో తర్వాత క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్తో చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కాటాలన్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. సునీల్ గారు, హరీష్, జగదీష్ ఇలా ఎంతో మంది అద్భుతమైన నటీనటులు ఇందులో ఉన్నారు. దాదాపు 110 రోజులు షూటింగ్ చేశాం. చాలా హార్డ్‌వర్క్‌తో ఈ సినిమాను రూపొందించారు. డైరెక్టర్ పాల్ గారు ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సునీల్ గారు నాకు సోదరుడిలాంటి వారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మే 28న సినిమా విడుదల అవుతోంది. ఇది ఒక హార్డ్‌కోర్ యాక్షన్ మూవీ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను.
నటుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ చిత్రం హై-వోల్టేజ్ రా యాక్షన్ ఎమోషనల్ మూవీ. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి నటుడి స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. నేను ఇటీవలే నా సినీ కెరీర్‌ను ప్రారంభించాను. ఇలాంటి అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియన్ తమ వంతుగా 100 శాతం కృషి చేశారు. మా నిర్మాతలు కూడా మాకు ఎన్నో సర్ప్రైజ్లు ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. మే 28న థియేటర్లలో కలుద్దాం.
