Mega Supreme Hero Sai Durgha Movie Titled SYG (Sambarala Yetigattu)
The Birthday Boy movie with Real Incidents – Ravi Krishna
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ‘ది బర్త్‌డే బాయ్’ – రవికృష్ణ
నటుడిగా అన్ని తరహా పాత్రలు చేస్తూ నాకంటూ ఓ గుర్తింపు పొందాలి. సినిమా అంటే పిచ్చి, ప్రేమతో మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నటుడిగా మంచి సినిమాలు చేస్తున్నందుకు హ్యపీగా వుంది అన్నారు బిగ్‌బాస్ ఫేం నటుడు రవికృష్ణ. విరూపాక్షతో మంచి గుర్తింపు పొందిన రవికృష్ణ నటిస్తున్నతాజా చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’.
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రవికృష్ణ ఆదివారం పాత్రికేయులతో ముచ్చటించాడు.
ఈ చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది?
విరూపాక్ష సమయంలోనే ఈ ఆఫర్ వచ్చింది. ఎన్ఆర్ఐ నిర్మాతలు ఒక ట్రూ ఇన్సిడెంట్‌తో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. సాధారణంగా రియల్ ఇన్సిండెంట్తో రూపొందే కథలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ కథ విన్నాను. నచ్చింది. వెంటనే ఓకే చెప్పాను.
ది బర్త్‌డే బాయ్ ఎలాంటి కథ?
పుట్టినరోజు నాడు జరిగిన ఓ ఇన్సిండెంట్తో ఓ స్నేహితుడు చనిపోతాడు. అప్పటి నుండి ఆ సిట్యుయేషన్‌ను వాళ్లు ఎలా హ్యాండిల్ చేశారు అనేది కథ. వాళ్లు పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నారు? ఒకవేళ అరెస్ట్ అయితే వాళ్లు ఈ కేసు నుండి ఎలా బయటపడ్డారు అనేది కథ. చాలా ఆసక్తికరంగా వుంటుంది.
ఈ చిత్రంలో మీ పాత్ర ఏమిటి?
ఈ సినిమాలో ఐదుగురు స్నేహితులు వుంటారు. బర్త్‌డే బంప్స్ వల్ల అందులో ఒకతను చనిపోతాడు. అందులో ఒకతనికి సోదరుడు పాత్రలో నటిస్తున్నాను. నాది పుల్లెంగ్ పాత్ర ఇది.
ఈ సినిమాలో వున్న కొత్తదనం ఏమిటి?
ఇది కల్పిత కథ కాదు. రియల్ ఇన్సిడెంట్. ఇదొక ట్రూ ఎమోషన్, ట్రూ డ్రామా తప్పనిసరిగా ఇలాంటి కథలు ఆడియన్స్ థ్రిల్లింగ్‌గా వుంటాయి. సినిమా మొదలు నుండి చివరి వరకు చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది.
ఈ కథ మొత్తం యదార్థ ఘటన ఆధారంగా తయారు చేశారా? లేక ఫిక్షన్ యాడ్ చేశారా?
సినిమా మొత్తం రియల్ ఇన్సిండెంట్ ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సినిమాలో మరింత ఆసక్తి కోసం, కథలో గ్రిప్పింగ్ కోసం కొంత ఫిక్షన్ డ్రామాను దర్శకుడు కలిపాడు. 48 గంటల్లో జరిగే కథ ఇది. తప్పకుండా ప్రతి సన్నివేశం నవ్విస్తూనే, ఉత్కంఠభరితంగా వుంటుంది.
ఇంతకు ముందు బుల్లితెరకు పరిమితమైన మీరు ఇప్పుడు వెండితెరపై బిజీ అవ్వడం పట్ల మీ ఫీలింగ్?
సినిమా నటించడం అనేది నా గోల్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల, ఏ అవకాశం వస్తే ఆ అవకాశం చేస్తూ వచ్చాను. బిగ్‌బాస్ అయినా, సీరియల్ అయినా అప్పటి పరిస్థితులను బట్టి చేశాను. ఎలా చేసినా.. ఏమీ చేసినా నా ఫైనల్ గోల్ సినిమాల్లో నటించడమే. బిగ్‌బాస్ తరువాత సినిమాలపై దృష్టి పెట్టాను. విరూపాక్ష తరువాత సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.
విరూపాక్ష మీకు ఎలాంటి పేరు తెచ్చిపెట్టింది?
మంచి పాత్ర చేశాను అనుకున్నాను. ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. 100 కోట్ల సినిమాలో నేను ఓ ముఖ్యపాత్రను చేయడం లక్కీగానే భావిస్తాను. విరూపాక్ష అవకాశం ఇచ్చిన దర్శకుడికి, హీరో సాయిదుర్గా తేజ్, సుకుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. విరూపాక్ష సినిమాలో నటిస్తున్న సమయంలో వచ్చిన ఆఫర్ ఇది. అడిషన్ ద్వారా దిబర్త్డే బాయ్ సినిమలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.
నటుడిగా మీ గోల్ ఏమిటి?
సినిమా ప్రాసెస్ అనేది అంతా ఈజీ కాదు. కొంత టైమ్ పడుతుంది. సినిమా అంటే పిచ్చి, కాబట్టే చావైనా, బ్రతుకైనా ఇక్కడే కాబట్టి అవకాశాల కోసం వెయిట్ చేస్తాను. విరూపాక్షతో నటుడిగా ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. ఇలాగే నెమ్మదిగా మంచి పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు పొందాలి. నటుడిగా నేను చాలా నేర్చుకోవాలి.
ఇది కేవలం యూత్‌ను టార్గెట్ చేసిన సినిమా అనుకోవచ్చా?
ఇది పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. నలుగురు కుర్రాళ్లు నేచురల్‌గా బిహేవ్ చేస్తే ఎలా వుంటుందో ఈ సినిమా అలా వుంటుంది. అన్ని వర్గాల వారు తప్పకుండాఈ చిత్రం చూడొచ్చు.
హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నారని తెలిసింది.
అవును. అందులో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో కొత్త ప్రపంచంలా వుంటుంది. తప్పకుండా నా కెరీర్‌కు తేజ్ అన్న లక్కీ… విరూపాక్షతో తరువాత ఆయనతో మళ్లీ కలిసి నటించడం హ్యపీగా వుంది.
ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు?
ఏ1 ఏ2 ఏ3 అనే సినిమాలో హీరోగా చేస్తున్నాను. విజయ్‌దేవరకొండ సినిమాతో పాటు సాయిధరమ్ తేజ సినిమాలో నటస్తున్నాను. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి.