Women are getting emotional after watching The Girlfriend – Allu

Rebelstar Prabhas creates another record with Kalki
“కల్కి” తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన రెబెల్ స్టార్ ప్రభాస్
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి” వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. దీంతో బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మూవీ చేసిన ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. జూన్ 27న రిలీజైన కల్కి సినిమా కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 1002 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వెయ్యి కోట్లు ఆర్జించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి.
ఓవర్సీస్ లో 17 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు అందుకున్న “కల్కి” బాలీవుడ్ లోనూ భారీ వసూళ్లు అందుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి. కల్కి సినిమాతో తన స్టార్ డమ్ సత్తా చాటారు ప్రభాస్. భారీ పాన్ ఇండియా మూవీస్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగల స్టామినా ప్రభాస్ కే సొంతమని చెప్పేందుకు కల్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. కల్కి సాధించిన హిస్టారికల్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు.
