‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల – విక్టరీ వెంకటేష్
Dhoom Dhaam Blended with all the commercial elements – Hero Chetan Krishna
Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles, with Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana playing key supporting roles. Produced by MS Ram Kumar under the banner of Friday Framework Works, the film is directed by Sai Kishore Macha, who has crafted it as a love and family entertainer. The story and screenplay are by Gopi Mohan. The film is set to have a grand theatrical release on the 8th of this month. In a recent interview, hero Chetan Krishna shared insights about the movie.
- “Acting is my passion, and I’ve always wanted to be part of films. I’ve worked on movies like First Rank Raju, Beach Road Chetan, Rojulu Maaray, and Gulf. Some of these films had a good opening, and I gained recognition from the audience. I’m a fan of Gopi Mohan’s scripts because he creates stories that can be enjoyed by the whole family, and I was eager to do a movie like that. Until now, I’ve acted in various types of films, but when we started Dhoom Dhaam, we had the vision of making it a big movie.”
- “The film is based on the concept of a father doing anything for his son, and vice versa. We’ve incorporated all the commercial elements into the narrative. In our film, the father wants his son to excel in everything, but the son’s mischief only makes things more complicated. He then tries to fix a problem that arises in a girl’s life due to his antics.”
- “Our movie features several well-known artists, and I made sure to prepare thoroughly to match their performance levels. It was particularly challenging to match Vennela Kishore’s timing. He enters in the second half, and from that point on, the entire second half is filled with the chaos of a wedding. This section of the movie is the highlight of Dhoom Dhaam, and the laughter in the theater was non-stop during the premiere in Vizag.”
- “In films like Adhurs, the hero often works alongside a well-known comedian, and the story progresses with their chemistry. Similarly, in Dhoom Dhaam, I share screen space with Vennela Kishore. He was incredibly supportive during the shooting, and we would discuss the scenes before filming them. It was a pleasure to work with Hebah Patel as well. She is full of energy and always active before the shoot, and once the camera starts rolling, she transforms completely into her character.”
- “My father always wanted me to reach a good position as a hero, and this movie was made on a grand scale. In terms of quality, Dhoom Dhaam stands out in every aspect. One of the advantages is that the film is being released by Mythri Movie Makers. The music, composed by Gopi Sundar, is already a hit, and we have secured good theaters for our release. There was some concern about small dubbed films getting more screens, but we’ve managed to get the theaters we need.”
- “The current trend in the industry is thrillers, and if I had gone that route, Dhoom Dhaam would have been just another thriller. I chose to do something different. I wanted this film to stand out from the commercial formula films that are so common nowadays. My main goal is for the audience to enjoy the film and for it to be a success. Once this movie is released, I’ll start planning my next project.”
“ధూం ధాం” పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో చేతన్ కృష్ణ
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో చేతన్ కృష్ణ.- నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది. నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని “ధూం ధాం” మొదలుపెట్టాం.
- తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.
- మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా “ధూం ధాం” సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి. మొన్న వైజాగ్ లో ప్రీమియర్ వేసినప్పుడు కూడా సెకండాఫ్ లో నవ్వులు తప్ప మరే సౌండ్ థియేటర్ లో వినిపించలేదు.
- అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా “ధూం ధాం”లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.
- నేను హీరోగా మంచి పొజిషన్ లో ఉండాలని నాన్న గారు కోరుకుంటారు. ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ప్రతి విషయంలో “ధూం ధాం” సినిమా ది బెస్ట్ గా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి.
- ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. నేను గతంలో డిఫరెంట్ మూవీస్ చేసినప్పుడు అన్ని కమర్షియల్ ఫార్ములా మూవీస్ వచ్చాయి. ఇప్పుడున్న ట్రెండ్ కు భిన్నంగానే నేను “ధూం ధాం” చేశాను. తప్పకుండా ప్రేక్షకులు మా మూవీతో ఎంటర్ టైన్ అవుతారని, సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా పూర్తయిన తర్వాత నా కొత్త మూవీ ప్లాన్ చేసుకుంటాను.