
Manchu Manoj as a Intense Police Officer in Rakshak
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘రక్షక్’ అనౌన్స్ మెంట్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు)” అనే ట్యాగ్‌లైన్ కథలోని మిస్టరీని సూచిస్తుంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా బిజీగా వున్న మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం, మిరాయ్ సినిమాల్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ‘రక్షక్’ చిత్రంతో మళ్లీ హీరోగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేస్తారు.