
Tortoise Movie Launched with Pooja Ceremony
The film Tortoise, starring Raj Tarun and Amrutha Chowdary as the lead pair, with Srinivas Avasarala and Dhanya Balakrishna in key roles, is being jointly produced by Sasidhar Nalla, Vijay Kumar, Santhosh Emmadi, and Ramisetti Rambabu under the banners of Prashvitha Entertai9ment, SK Golden Arts, Chandamama Creations, and NVL Creations. The film is directed by Rithvik Kumar. Launched today with a Pooja ceremony at Prasad Labs in Hyderabad, the film promises a riveting narrative. A motion poster was also released. Oscar-winner Chandra Bose has penned the lyrics for this film, and Anup Rubens has composed the music.
Raj Tarun said, “The film ‘Tortoise’ will be very fresh and new. It has a very different story, and the way the director Rithvik Kumar narrated the story was excellent. Congratulations to our producers, Sasidhar Nalla, Vijay Kumar, Santhosh Emmadi, and Ramisetti Rambabu, for coming forward with such a good script. This film will be a good kick-start for my career.”
Director Rithvik Kumar stated, “Welcome to the media friends who attended our film’s Pooja ceremony. The film ‘Tortoise’ will be very new. It will be the best film in Raj Tarun garu’s career. The characters of Srinivas Avasarala, Dhanya Balakrishna, and the heroine Amrutha Chowdary are very strong. This is a great thriller with a different story and a new screenplay. We will start the shooting soon. Today, we also released the motion poster for our film. My thanks to my producers for believing in me and giving me this opportunity.”
Producers Sasidhar Nalla, Vijay Kumar, Santhosh Emmadi, and Ramisetti Rambabu stated, “We liked the story very much. The shooting will commence soon. We have complete faith in our director Rithvik Kumar. We are very happy to be making a film with Raj Tarun garu.”
Banners: Prashvitha Entertai9ment, SK Golden Arts, Chandamama Creations, and NVL Creations
Producers: Sasidhar Nalla, Vijay Kumar, Santhosh Emmadi, Ramisetti Rambabu
Cast: Raj Tarun, Amrutha Chowdary, Srinivas Avasarala, Dhanya Balakrishna, Ravi Kale, Shiju, and others.
Music: Anup Rubens
Lyricist: Oscar-winner Chandra Bose
Cinematographer: Sabari
Editor: Gullapalli Madhav Kumar
Art Director: Devara Madhukar
Story, Direction: Rithvik Kumar
రాజ్ తరుణ్ “టార్టాయిస్” చిత్రం ప్రారంభం
“పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే “
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “టార్టాయిస్”. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం అయింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “”టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కథతో వస్తున్నా మా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లకి కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుంది” అని తెలిపారు.
దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమా పూజ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు స్వాగతం. “టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ గారికి కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ మరియు హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈరోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసాం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లకి నా ధన్యవాదాలు.
నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు మాట్లాడుతూ “మా “టార్టాయిస్” చిత్రం ఈ రోజు ప్రారంభం అయింది. మాకు కథ చాలా బాగా నచ్చింది. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మా దర్శకుడు రిత్విక్ కుమార్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. రాజ్ తరుణ్ గారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.
బ్యానర్ : ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్
చిత్రం పేరు : టార్టాయిస్
నటి నటులు: రాజ్ తరుణ్, అమృత చౌదరి, శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, రవి కాలే, షిజు మరియు తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
లిరిక్స్: ఆస్కార్ చంద్రబోస్
సినిమాటోగ్రఫీ : శబరి
ఎడిటర్ : గుళ్ళపల్లి మాధవ్ కుమార్
ఆర్ట్ : దేవర మధుకర్
కథ & దర్శకత్వం : రిత్విక్ కుమార్
నిర్మాతలు: శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు
