
Icon Star Allu Arjun Praises Daksha Trailer – Film to Release on September 19
The upcoming film ‘Daksha – The Deadly Conspiracy’ stars Manchu Lakshmi Prasanna in the lead role and is being produced under the banners of Sri Lakshmi Prasanna Pictures and Manchu Entertainment. Veteran actor Dr. Mohan Babu will be seen in a key role. This marks the first time that father-daughter duo Mohan Babu and Lakshmi Manchu are appearing together on screen.
The film is written, directed, and the screenplay is provided by Vamsee Krishna Malla. The movie has completed its censor formalities and has been awarded a U/A certificate by the Censor Board. With all preparations complete, the makers are planning a grand worldwide release on September 19.
Recently, Icon Star Allu Arjun released the theatrical trailer of Daksha via social media and extended his best wishes to the team.
In his tweet, Allu Arjun wrote:
“Best wishes to my dear friend and well-wisher Lakshmi Manchu for her upcoming film #Daksha. Sending my heartfelt love. It’s wonderful to see you and Mohan Babu garu together on screen. Wishing the film a huge success. Congrats to director Vamsee Krishna Malla and the entire team.”
Director Vamsee Krishna Malla also expressed his happiness, saying:
“Huge thanks to Icon Star Allu Arjun sir. We’re very, very happy that he liked the trailer. Thank you so much, sir! The trailer was also screened at the SIIMA 2025 event held in Dubai, where it received an overwhelming response. We have great confidence in this film. The promotional content released so far has received very positive feedback. Lakshmi Manchu garu has done a never-before-seen role. It was a joy to direct both Mohan Babu garu and Lakshmi garu together. The film has turned out really well. It’s releasing grandly on September 19. We hope audiences watch it in theaters and bless us.”
Cast:
Mohan Babu, Lakshmi Manchu, Samuthirakani, Malayalam actor Siddique, Vishwant, Chitra Shukla, Rangasthalam Mahesh, Gemini Suresh, and others.
Technical Crew:
Music: Achu Rajamani
Cinematography: Gokul Bharathi
PRO: b.veerababu
Choreography: Brinda
Screenplay & Direction: Vamsee Krishna Malla
మంచు లక్ష్మి ‘దక్ష’ ట్రైలర్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు.. సెప్టెంబర్ 19న సినిమా విడుదల
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్వీట్లో.. ‘‘నా మిత్రురాలు, ఆప్తురాలైన లక్ష్మీ మంచుకి, ఆమె తదుపరి చిత్రం #దక్ష (Daksha)కు శుభాకాంక్షలు. మీకు ఆత్మీయమైన నా ప్రేమను తెలియజేస్తున్నాను. మీరు, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వంశీ కృష్ణ మల్లా @itsMVKrishna మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్‌కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్‌లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్‌ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మిగారు ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్రని ఇందులో చేశారు. అలాగే మోహన్ బాబుగారిని, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.
మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: అచు రాజమణి
ఛాయాగ్రహణం: గోకుల్ భారతి
నృత్య దర్శకురాలు: బృంద
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ మల్లా
