The 2nd annual UKIDFF health camp took place in Bhimavaram on January 20, 2025
Under the leadership of Dr. Venu Kavarthapu and coordinated by Smt. Shyamala Uppalapati and Sai Praseedha Uppalapati, the camp brought together an elite team of diabetic foot specialists and doctors from the UK, UAE, and India. The Indian medical team included representatives from Apollo Hospital Jubilee Hills, led by Dr. Srinivas Seshabattaru; Dr. Varma group of hospitals in Bhimavaram, led by Dr. Varma; and Imperial Hospital in Bhimavaram, led by Dr. Naresh.
The camp provided comprehensive diabetic foot care services, including screenings, free medications, expert advice on foot protection, wound treatment, and ongoing wound care recommendations. This initiative aims not only to treat but also to raise awareness about diabetic foot complications, a growing concern in India and worldwide.
The event was graced by several distinguished guests who lent their support to this noble cause. Special guests included Dr. Srinivas from Apollo Hospitals; Dr. Vijay Papineni from Abu Dhabi; Bhupathi Raju Srinivasa Varma, Narasapuram MP; Pulaparthi Ramanjaneyulu, Bhimavaram MLA; Somu Veerraju, BJP Former State President; Katipally Venkata Ramana Reddy, Kamareddy MLA; Naga Rani, West Godavari Collector; Patsamatla Dharmaraju, Unguturu MLA; Seetha Mahalakshmi, Rajya Sabha MP; Arimilli Radha Krishna, Tanuku MLA; Koyye Moshenu Raju, MLC; T.D. Janardhan, MLC; Solomon Raju, GHMC Commissioner; V. Surya Narayana Raju, Kshatriya Corporation Chairman; G.V. Narasimha Raju, DNR College Chairman; G. Rama Raju, Former TTD Board Member; Govinda Rao, Janasena West Godavari Incharge; Thathaji, BJP West Godavari Incharge; and Paka Satyanarayana, BJP Leader. Their presence highlighted the collaborative effort required to address the challenges of diabetic foot health.
Reflecting on the event, Smt. Shyamala Uppalapati expressed her gratitude, saying, “It fills my heart with immense pride and joy to witness the success of the second UKIDFF health camp. Seeing the overwhelming response and the significant number of people who sought care reminds us of the importance of such initiatives. This camp is a tribute to the vision of the late Sri Krishnam Raju Garu, who always believed in making healthcare accessible to everyone. We remain committed to taking this mission forward.”
Adding to this sentiment, Sai Praseedha Uppalapati remarked, “It is truly inspiring to see our efforts making a difference in so many lives. The team’s dedication and the support from the community have been incredible. We are motivated to conduct more such camps in the future and ensure that diabetic foot care is accessible to all.”
The UKIDFF health camp stands as a testament to the power of collaboration and community-driven initiatives, striving to create a healthier, more informed society.
భీమవరంలో సక్సెస్ ఫుల్ గా జరిగిన యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్
యుకెఐడిఎఫ్ఎఫ్ రెండో వార్షిక హెల్త్ క్యాంప్ భీమవరంలో ఈ నెల 20న సక్సెస్ ఫుల్ గా జరిగింది. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 వేల మంది హాజరై చికిత్స పొందారు. ఈ హెల్త్ క్యాంప్ లో వైద్యులు డయాబెటిక్ ఫుట్ హెల్త్ పై అవగాహన, సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ హెల్త్ క్యాంప్ డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో జరిగింది. స్వర్గీయ రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలా గారు, కూతురు సాయి ప్రసీద గారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేశారు. ఈ హెల్త్ క్యాంప్ లో మన దేశంతో పాటు యూకే, యూఏఈకి చెందిన డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్టులు, అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాస్ శేషబట్టారు సారథ్యంలోని జుబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్, డాక్టర్ వర్మ నేతృత్వంలోని భీమవరంలోని డాక్టర్ వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ నరేష్ సారథ్యంలోని భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ ప్రతినిధులు ఈ హెల్త్ క్యాంప్ లో భాగస్వామ్యులు అయ్యారు.
యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ లో డయాబెటిక్ ఫుట్ కేర్ స్క్రీనింగ్, ఉచిత మందులు, ఫుట్ ప్రొటెక్షన్ పై వైద్య నిపుణులు సలహాలు అందజేశారు. చికిత్సతో పాటు డయాబెటిక్ ఫుట్ సమస్యల గురించి అవగాహన పెంచారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా అపోలో ఆస్పత్రుల నుంచి డాక్టర్ శ్రీనివాస్, అబుదాబి నుంచి డాక్టర్ విజయ్ పాపినేని, భూపతి రాజు హాజరయ్యారు. నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకట రమణ రెడ్డి, పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగ రాణి, ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు, రాజ్యసభ ఎంపీ సీత మహాలక్ష్మి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ కోయ్యే మోషేను రాజు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, జిహెచ్ఎంసి కమిషనర్ సోలమన్ రాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వి. సూర్య నారాయణ రాజు, డిఎన్ఆర్ కళాశాల చైర్మన్ జీవీ నరసింహారాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జి. రామరాజు, జనసేన పశ్చిమ గోదావరి ఇన్ఛార్జ్ గోవింద రావు, బిజెపి పశ్చిమ గోదావరి ఇన్ఛార్జ్ తాతాజీ, బిజెపి నాయకుడు పాక సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయంవంతం అయిన సందర్భంగా శ్రీమతి శ్యామల ఉప్పలపాటి గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీమతి శ్యామల ఉప్పలపాటి గారు మాట్లాడుతూ – రెండవ యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మా ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంత అవసరమో ప్రజల స్పందన తెలియజేస్తోంది. అందరికీ వైద్యం అందాలని స్వర్గీయ కృష్ణంరాజు గారు కోరుకునేవారు. ఆయన ఆశయానికి ప్రతిరూపమే ఈ వైద్య శిబిరం. ఈ హెల్త్ క్యాంప్ ను మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అన్నారు.
సాయి ప్రసీద ఉప్పలపాటి గారు మాట్లాడుతూ – యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడం సంతోషంగా ఉంది. మా వైద్య బృందం, ప్రజల సహకారంతో సక్సెస్ ఫుల్ గా క్యాంప్ నిర్వహించాం. డయాబెటిక్ పుట్ కేర్ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మరిన్ని నిర్వహిస్తామన్నారు.