Sundeep Kishan Unveiled Announcement Poster Of Attitude Star Chandrahass’s New

ఎర్రచీర దర్శకుడు సీ. హెచ్ సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీకారం
ఎర్రచీర దర్శకుడు సి. హెచ్. సుమన్ బాబు దర్శకత్వంలో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతోంది. దీనిని సోషియో ఫాంటసీ జోనర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఈ చిత్రం టైటిల్ ” పరకామణి ” ని విడుదల చేశారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ సి.హెచ్. సుమన్ బాబు తెలిపారు.
సుమారు రూ.20 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. సృష్టిలో ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తల తల, రసాతల, పాతాళ లోకాలను చూపిస్తూ, అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కే ఈ సోషియో ఫాంటసీ చిత్రం… ప్రేక్షకులకు అధ్భుతమైన అనుభూతిని ఇస్తుందని సుమన్ బాబు తెలిపారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు నటిస్తారని, ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్ర చీర డిసెంబర్ 20న విడుదల కానుంది.