
Peddi Long Shooting Schedule to Start Soon – Movie to Release on March 27
పెద్ది త్వరలోనే బిగ్ షెడ్యూల్ ప్రారంభం- మార్చి 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
త్వరలోనే ఈ చిత్రం బిగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన స్టిల్ లో రామ్ చరణ్ బీస్ట్ మోడ్ లో కనిపించడం అదిరిపోయింది. రాక్ సాలిడ్ మసిల్స్, ఇంటెన్స్ గా కనిపించిన లుక్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.
AR రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్ తో ఈ సాంగ్ గ్లోబల్ మూమెంట్ గా మారింది. త్వరలోనే మరో పాటని రిలీజ్ చేయబోతున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించిన ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్.
మార్చి 27న పెద్ది గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్ కాబోతుందని మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.
