Lopalliki Ra Cheptha 4th Single Tik Tok Chedama.. Released by

Aghathiyaa Release Date Postponed
జీవా, అర్జున్ సర్జా ‘అగత్యా’ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ – ఫిబ్రవరి 28న రాబోతున్న ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్
కోలీవుడ్ నటుడు జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్గా విడుదలైన సెకెండ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. ‘నేలమ్మ తల్లి’ అంటూ సాగే ఈ పాట అర్జున్ను హైలెట్ చేస్తూ ఉంది.
జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలను దర్శకుడు బలంగా స్పృశిస్తున్నారు. మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరికొంత సమయం కేటాయించాలని భావించిన మేకర్స్.. సినిమా విడుదలను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి పోస్ట్ పోన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే ఉద్దేశంతో కొంత సమయం తీసుకుంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ అగత్యా సరికొత్త అనుభూతిని అందిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
తారాగణం: జీవా, రాశీఖన్నా, అర్జున్ సర్జా, యోగిబాబు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: పా. విజయ్
బ్యానర్స్: వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా
నిర్మాతలు: డాక్టర్ ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
పీఆర్వో: వంశీ-శేఖర్