కమిటీ కుర్రోళ్ళు మెప్పిస్తారు
Committee Kurrollu Movie Review and Rating
చిత్రం – కమిటీ కుర్రోళ్ళు
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వీ రావు, టీన శ్రావ్య, విశిక, షణ్ముఖి నాగుమంత్రీ, సాయి కుమార్, రమణ రాజు గోపరాజు, కిషోర్ కుమార్ తదితరులు
సంగీత దర్శకుడు – అనుదీప్ దేవ్సి
సినిమాటోగ్రఫీ – ఎదురురోలు రాజు
ఎడిటర్ – అన్వర్ అలీ
నిర్మాతలు – పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియో
దర్శకత్వం – యదు వంశీ
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా యువ నటీనటుల కలయికలో తెరకెక్కిన చిత్రం “కమిటీ కుర్రోళ్ళు”. యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు (9.8.2024) విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
పశ్చిమ గోదావరి ప్రాంతంలో పురుషోత్తపల్లి అనే చిన్న గ్రామంలో ఎప్పుడు నుంచో ఆనవాయితీగా బరింకలమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతర, అలాగే 10 రోజుల్లో వచ్చే ఎన్నికలను సజావుగా జరపాలని ఊరి పెద్దలు భావిస్తారు. సర్పంచ్ పొలిశెట్టి బుజ్జి (సాయి కుమార్) పై ఈసారి ఎన్నికల్లో గెలవాలని ఆ ఊరి మాజీ సర్పంచ్ కొడుకు శివ (సందీప్ సరోజ్) ప్లాన్ చేస్తాడు. ఇక ఆ ఊరి ఆనవాయితీ ప్రకారం సత్తయ్య (కిశోర్ కుమార్) చేతుల మీదుగానే జాతర జరగాల్సి ఉంటుంది. కానీ తన జీవితంలో పన్నెండేళ్ల క్రితం జరిగిన ఓ విషాదం వలన ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మరి ఆ ఊరిలో ఏం జరిగింది? శివ తన ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ ఊర్లో ఏం చేశారు. చివరికి ఆ ఊర్లో జాతర జరిగిందా లేదా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు తదితర అంశాలతో ఆ సినిమా తెరకెక్కింది.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఈ సినిమా ద్వారా పరిచయమైన ప్రతి కుర్రాడు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. శివ పాత్ర సినిమాకి చాలా ప్లస్. ఈ పాత్రను బాగా పెర్ పామ్ చేసాడు సందీప్ సరోజ్. తన ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించిన ప్రతి నటుడు సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. ఈ పాత్రలకు జోడిగా కనిపించిన హీరోయిన్స్ కూడా ఆడియన్స్ ని మెప్పించారు. ఇంకా లీడ్ నటీనటుల్లో యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహరాకి మంచి పాత్ర దక్కింది. మిగతా పాత్రల్లో నటించిన సాయి కుమార్, గోపరాజు రమణ రాజు, కిషోర్ కుమార్ సూపర్బ్ గా పెర్ ఫామ్ చేసారు.
సాంకేతిక వర్గం
చక్కటి కథను ఎంచుకోవడంలో మెగా డాటర్ నిహారిక సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇలాంటి కథలు యూత్ ని ఇంప్రెస్ చేస్తాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని ర్యాప్ బిట్స్ సినిమాకి చాలా ప్లస్. విజువల్ గా సినిమా చాలా బాగుంది. డైలాగ్స్ మెప్పిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. దర్శకుడు యదు వంశీ ఈ సినిమాతో యూత్ కి బాగా దగ్గరవుతాడు. ప్రతి పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథ రొటీన్ గా అనిపిస్తుంది. కానీ స్ర్కీన్ ప్లే ఆసక్తిగా ఉంది. ఓవరాల్ గా టీమ్ వర్క్ బాగుంది.
విశ్లేషణ
ప్రతి కుర్రాడు సినిమాల్లోని పాత్రల్లో తమను పోల్చుకోవడం ఖాయం. దాదాపు అందరి జీవితాల్లో జరిగే సంఘటలను తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ డీసెంట్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్, సరదా సన్నిశాలతో ఆడియన్స్ సినిమాలో ఇన్ వాల్వ్ అవుతారు. దాంతో సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. మెయిన్ గా నటీనటులని కాలానికి అనుగుణంగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. ఫ్రెండ్షిప్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి బాగా నచ్చుతుంది.
ఫైనల్ గా… ఈ కమిటీ కుర్రోళ్ళు ను మీ ఫ్రెండ్స్ తో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.
రేటింగ్ – 3/5