అంచనాలను అందుకోలేకపోయిన భారతీయుడు – 2
Bharateeyudu-2 Movie Review and Rating
భారతీయుడు – 2 మూవీ రివ్య్వూ
చిత్రం – భారతీయుడు – 2
నటీనటులు – కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, యస్.జె. సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని తదితరులు
సంగీతం – అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ – రవి వర్మన్
ఎడిటింగ్ – ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు – సుభాస్కర్న్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్
దర్శకత్వం – ఎన్.శంకర్
విడుదల తేదీ – జూలై 12, 2024
రేటింగ్ – 2.75\5
భారీ విజయాన్ని సొంతం చేసుకున్నభారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు – 2 చిత్రం ఈ రోజు (జూలై 12) థియేటర్స్ లో విడుదలయ్యింది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతీయుడు అంత విజయాన్ని అందుకునే విధంగా ఉందా అనే విషయాన్ని రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్) తన ఫ్రెండ్స్ తో కలిసి సొసైటీ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాల పై వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటాడు. కొన్ని సంఘటనల నేపధ్యంలో భారతదేశంలో అవినీతి పై పోరాటం జరిపిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు (కమలహాసన్) ఇండియా తిరిగి రావాలని పోస్ట్ లు పెడతారు. భారతీయుడు ఇండియాకి తిరిగి వచ్చి, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని, అవినీతి చేసినవారిని చంపేస్తాడు. ఈ క్రమంలో చిత్ర అరవిందన్ జీవితంలో జరిగిన విషాదానికి కారణం భారతీయుడే అని భావించిన జనాలు… అతనిపై కోపం పెంచుకుంటారు. అవినీతి, అన్యాయాల పై పోరాడిన భారతీయుడుకు ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత ఎదురయ్యింది… అసలు భారతీయుడు టార్గెట్ ఎంటీ… తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
సొసైటీ లో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలను చూపించడం బాగుంది. దీనివల్ల సొసైటీ ఎలా ఉందో అవగాహన కలుగుతుంది. భారీ తారాగణం ఈ సినిమాకి ప్లస్. విజువల్ గా సినిమా సూపర్బ్ గా ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ఇక కమలహాసన్ నటన, మ్యానరిజమ్స్, లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. తనదైన శైలిలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు కమలహాసన్. గ్రాండియర్ విజువల్స్ తో సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సిద్దార్థ్, యస్.జె.సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, వివేక్, సముద్రఖని ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్
సొసైటీ లో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ, స్ర్కీన్ ప్లే పెద్ద ఆకట్టుకునే విధంగా లేకపోవడం నిరాశపరిచే విషయం. ఫ్రెష్ నెస్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆల్ రెడీ భారతీయుడు పస్ట్ పార్ట్ చూసాం కాబట్టి, సీక్వెల్ పై ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోవడం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అనిరుద్ సంగీతం కూడా ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకి మరో మైనస్.
పైనల్ గా చెప్పాలంటే… భారీ తారాగణం, గ్రాండియర్ విజువల్స్ కోసం ఈ సినిమాని థియేటర్స్ లో చూడొచ్చు.