సారంగదరియా – ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా
Sarangadariya Movie Review and Rating
చిత్రం – సారంగదరియా
నటీనటులు – రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్రవరపు, మహ్మద్, మోహిత్ పెద్దాడ, నలాప్రియ దేవులపల్లి, శ్రీకన్ లత తదితరులు
నిర్మాతలు – శరత్ చంద్ర చల్లపల్లి, ఉమాదేవి ఆచంట
దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి
విడుదల తేదీ – 12 జూలై, 2024
రేటింగ్ – 3\5
రాజా రవీంద్ర కీలక పాత్ర పోషించిన చిత్రం సారంగదరియా. కంటెంట్ బాగుంటే, చిన్న సినిమాలు సైతం ఆడియన్స్ మెప్పును పొందగలుగుతాయనే నమ్మకంతో ఈ సినిమా చేసామని చిత్రం యూనిట్ చెబుతూ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
స్టోరీ
మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తి కృష్ణకుమార్. వైజాగ్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తుంటాడు. తన భార్య, కొడుకులు అర్జున్, సాయి తో పాటు కూతురు అనుపమ తో నివసిస్తుంటాడు కృష్ణకుమార్. కొడుకులు ఇద్దరూ తాగుడుకు అలవాటు పడటంతో అటు పర్సనల్ గానూ, వర్క్ పరంగానూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు కృష్ణకుమార్. మరోవైపు కూతురు అనుపమ కూడా ఓ ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటుంది. మరి ఈ సమస్యల నుంచి కృష్ణకుమార్ ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా స్టోరీ.
నటీనటుల పెర్ ఫామెన్స్
కృష్ణకుమార్ పాత్రలో రాజా రవీంద్ర ఒదిగిపోయిన వైనం సూపర్బ్. ఎమోషనల్ సీన్స్ లో రాజా రవీంద్ర చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. టోటల్ గా రాజా రవీంద్ర మంచి క్యారెక్టర్ చేసాడు. మిగతా నటినటులందరూ తమ పాత్రత పరిధిమేరకు నటించి మెప్పించారు.
టెక్నకల్ గా
చక్కటి స్టోరీ లైన్ తీసుకుని, స్ర్కీన్ ప్లేతో ఆడియన్స్ ని మెప్పించే విధంగా సినిమాని మలిచారు డైరెక్టర్ పద్మారావు. సంగీతం ఫర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బాగుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. అవుట్ డోర్ లొకేషన్స్ ని చక్కగా విజువలైజ్ చేసారు. ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ
పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ లో ఈ స్టోరీ లైన్ ని మలిచారు డైరెక్టర్ అబ్బిశెట్టి పద్మారావు. ఫస్టాప్ అంతా పెద్ద కొడుకు తాగుడు ప్రాబ్లమ్, చిన్న కొడుకు లవ్ ఎఫైర్ తో సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా వేగం పుంజుకుంది. ఆడియన్స్ ని సెకండాఫ్ లో ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తుంది. సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుంది. కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. చక్కటి మెసేజ్ ఉన్న సినిమా. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచ్ చేసే విధంగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే… ఫ్యామిలీ ఎమోషన్స్ ని చక్కగా ఆవిష్కరించిన ఈ సినిమాని కుటుంబంతో కలిసి ఆస్వాదించవచ్చు.