Vijay Antony Badhrakali Releasing On September 5th Through Asian Suresh Entertainment

Vijay Antony Badhrakali Releasing On September 5th Through Asian Suresh Entertainment
After the success of Maargan, which resonated strongly with Telugu audiences, Vijay Antony is back with yet another compelling project. Titled Badhrakali, the film which marks landmark movie for Vijay Antony is directed by Arun Prabhu and produced by Ramanjaneyulu Javvaji under the Sarvanth Ram Creations banner. The project is presented by Vijay Antony Film Corporation and Meera Vijay Antony.
Touted to be a gritty political action thriller, Badhrakali is rooted in themes of rage, rebellion, and the fierce urge to dismantle a corrupt system. With an intense narrative and high-octane action, the film is slated for a worldwide release on September 5. Notably, Asian Suresh Entertainment, the distributor behind Maargan’s Telugu success, will also handle the Telugu release of Badhrakali, ensuring wide accessibility across the region, with support from Rana Daggubati’s Spirit Media.
The release date poster features Vijay Antony seated on the ground, gripping a pistol with both hands, exuding a fierce and brooding aura. His intense, resolute expression hints at a man on the brink of confrontation. Behind him, a massive blood-red full moon looms large, framed by silhouettes of ancient temple towers and historic structures, adding intensity.
The ensemble cast includes Vaagai Chandrasekar, Sunil Kripalani, Cell Murugan, Trupthi Ravindra, Kiran, Rini Bot, Riya Jithu, and Master Keshav.
With a strong technical team backing the project, expectations are high. Cinematographer Shelley Calist cranks the camera, while Vijay Antony himself has composed the music. Raymond Derrick takes charge of editing, Rajashekar oversees the action choreography, and Sreeraman leads the art department. Rajashekar Reddy has penned the Telugu dialogues.
With the release date now officially locked, the makers are all set to launch a high-voltage promotional campaign in the coming days.
Cast: Vijay Antony, Vaagai Chandrasekar, Sunil Kripalani, Cell Murugan, Trupthi Ravindra, Kiran, Rini Bot, Riya Jithu and Master Keshav
Technical Crew:
Director – Arun Prabhu
Producer – Ramanjaneyulu Javvaji (Sarvanth Ram Creations)
Presenters – Vijay Antony Film Corporation- Meera Vijay Antony presents
Telugu Release – Asian Suresh Entertainment – supported by Spirit Media (Rana Daggubati)
DOP – Shelley Calist
Music Director- Vijay Antony
Editor – Raymond Derrick
Action – Rajashekar
Art Director – Sreeraman
Telugu Writer – Rajashekar Reddy
Digital Marketing- South Bay
PRO – Vamsi-Shekar
‘భద్రకాళి’ చాలా కొత్త పొలిటికల్ జానర్ మూవీ. ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. ఆడియన్స్ కి ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: ప్రెస్ మీట్ లో హీరో విజయ్ ఆంటోనీ
-విజయ్ ఆంటోనీ, అరుణ్ ప్రభు, రామాంజనేయులు జవ్వాజీ, సర్వంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ‘భద్రకాళి’ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 5న రిలీజ్
తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న భద్రకాళి కోపం, తిరుగుబాటు, కరప్ట్ వ్యవస్థను తుడిచిపెట్టేయాలనే ఫైర్‌తో నిండిన కథతో రూపొందుతుంది. ఇంటెన్స్ కథనం, హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.
రిలీజ్ డేట్ పోస్టర్లో విజయ్ ఆంటోనీ నేలపై కూర్చుని, రెండు చేతులతో పిస్టల్ పట్టుకుని ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. తని ముఖంలో కనిపించే ఆ కోపం ఎవరినైనా ఢీకొట్టేలా ఉంది. బ్యాక్ డ్రాప్ లో ఎర్రచంద్రుడు, పురాతన గోపురాలు, చారిత్రక నిర్మాణాల సిల్వెట్లతో +పోస్టర్ ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ హై ఓల్టేజ్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రెస్ మీట్ లో హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నా గత చిత్రం మార్గన్ కి అద్భుతమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. భద్రకాళి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. అరుణ్ ప్రభు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. వెరీ టాలెంటెడ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆయన్ని గొప్పగా అభిమానిస్తారు. ఆయన ప్రొడక్షన్ మీద కూడా చాలా కంట్రోల్ ఉన్న డైరెక్టర్. ఏదైతే మేము ముందు బడ్జెట్ అనుకున్నాము ఆ బడ్జెట్ ప్రకారమే ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఆయనకి అన్ని విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. రామ్ గారు ఈ సినిమాతో కొలాబరేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నా తొలి సినిమా రిలీజ్ చేశారు. చాలా సపోర్టివ్ పర్సన్. మా కొలాబరేషన్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. ధనుంజయ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్. ఏ సమస్య ఉన్న నేను ఆయనకే చెప్తుంటాను. అన్ని విషయాల్లో చాలా సపోర్ట్ గా ఉంటారు. హీరోయిన్ తృప్తి చాలా మంచి నటి. ఈ సినిమాల్లో చాలా సెటిల్ గా పెర్ఫార్మ్ చేసింది. తప్పకుండా తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సురేష్ బాబు గారు లేకపోతే మేమెంత నమ్మకంగా గా ఉండే వాళ్ళం కాదు. ఆయన రిలీజ్ చేయడమే కాదు ప్రోడక్ట్ మీద ప్రతి విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారు. సురేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది నా 25వ చిత్రం. వెరీ న్యూ పొలిటికల్ జానర్. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ సినిమాలన్నిటికీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
డైరెక్టర్ అరుణ్ ప్రభు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా తొలి సినిమా అరువి రిలీజ్ అయినప్పుడు తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది. రానా గారు, విజయ్ దేవరకొండ గారు, త్రివిక్రమ్ గారు నా వర్క్ ని అప్రిషియేట్ చేశారు. భద్రకాళి నా ఫస్ట్ తెలుగు రిలీజ్. ఇది పొలిటికల్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా రిలేటబుల్ గా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. విజయ్ గారికి, సురేష్ బాబు గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.
ప్రొడ్యూసర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వినోదంతో సామాజికంగా ప్రాధాన్యత ఉన్న ఎలిమెంట్స్ ని తీసుకుని ప్రేక్షకుడు ఆలోచించే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. ‘బిచ్చగాడు ‘ఫేం విజయ్ ఆంటోని అంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత భద్రకాళి విజయ్ అంటోని అని పిలుస్తారని నమ్మకం ఉంది. ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ లో మార్గాన్ సినిమాని రిలీజ్ చేసి చాలా సక్సెస్ ని అందుకున్నా. ఇది ఒక లక్కీ టీం గా భావిస్తున్నాను. ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను’అన్నారు.
ప్రొడ్యూసర్ ధనంజయన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విజయ్ ఆంటోని గారు ఆయన ప్రతి సినిమాకి చాలా కష్టపడతారు. అరుణ్ ప్రభువు అద్భుతమైన డైరెక్టర్. ఇప్పుడు ఒక మాస్ సినిమాతో వస్తున్నారు. మార్గన్ కి ఇంత మంచి సక్సెస్ వచ్చిందంటే దానికి కారణం సురేష్ బాబు గారి మ్యాజిక్ టచ్. ఆయన ప్రజెంటేషన్ వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా అలాంటి అద్భుతమైన విజయాన్ని అందిస్తుందని మేము భావిస్తున్నాం. ఇది విజయ్ గారి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’అన్నారు.
హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ. అరుణ్ గారికి విజయ్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా నటిచండ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ థాంక్యు. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’అన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విజయ్ గారు ప్రతిదీ చాలా డీటెయిల్ గా డిజైన్ చేస్తారు. రామ్ గారికి మా నాన్న గారితో కూడా పరిచయం ఉంది. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రేక్షకులకి సినిమా రాబోతుందని చెప్పడం చాలా ముఖ్యం. ఈ సినిమాని ఎంత ఉత్సాహంగా ప్రమోట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’అంటారు.
నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – అరుణ్ ప్రభు
నిర్మాత – రామాంజనేయులు జవ్వాజి (సర్వంత్ రామ్ క్రియేషన్స్)
సమర్పణ- విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్- మీరా విజయ్ ఆంటోని
తెలుగు రిలీజ్ – ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా
DOP – షెల్లీ కాలిస్ట్
సంగీతం – విజయ్ ఆంటోని
ఎడిటర్ – రేమండ్ డెరిక్
యాక్షన్ – రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీరామన్
తెలుగు రైటర్ – రాజశేఖర్ రెడ్డి
డిజిటల్ మార్కెటింగ్- సౌత్ బే
పీఆర్వో – వంశీ-శేఖర్