Vidudala 2 narrates the revolutionary tale of a common man – Producer Chintapalli Ramarao
‘Vidudala 2’, which highlights Vijay Sethupathi’s performance, is a much-awaited sequel. The Telugu release rights for this film have been acquired by the renowned producer and head of Sri Vedaakshara Movies, Chintapalli Ramarao. Made as an intense period crime thriller by the visionary director Vetri Maaran, the film will hit the screens on December 20th.
Ahead of the movie’s release, the makers arranged an event to speak about it. Speaking on the occasion, Producer Chintapalli Ramarao said, “The recently released songs and trailer of this film have received a very good response. The trailer, as well as the songs, have made a mark. ‘Vidudala 2’ is the heroic revolutionary saga of an extraordinary individual who emerged from the common people who were suppressed by the arrogance of the rulers. This film is not a Tamil nativity film. It is a film based on the problems witnessed somewhere in a Telugu State. Vijay Sethuapathi is perfectly suited for the role of Perumal in this film. His acting in the role of a Naxalite and the way he portrayed the emotion of the character is amazing. He has a very good reputation among the audience as an actor. This film will further enhance his reputation. The directorial talent of Vetri Maaran, who has won the National Award seven times, is known to all. All the top heroes want to act under his direction. Maestro Ilaiyaraaja has provided thunderous music for this film. You can imagine what a film would be like with a combination like Vijay Sethupathi, Vetri Maaran, and Ilaiyaraaja. Peter Heins has brought together fights that have never been seen on the Indian screen so far, and Manju Warrier’s natural acting is a plus for this film. The emotional scenes between Sethupathi and Manju Warrier are amazing. Those scenes will make everyone’s eyes moist.”
This film, which is set to be released simultaneously in Telugu and Tamil on December 20, will achieve a blockbuster hit, the producer added.
Director Konda Vijayakumar, who attended the event, said that this film will take the audience to a different world. “Without a doubt, this film will achieve great success in Telugu as well as Tamil,” he added.
Producers Subba Reddy, Tummalapalli Ramasatyanarayana, and DS Rao expressed their hope that this film would be a huge success for producer Chintapalli Ramarao, who has presented such a great film to the Telugu audience.
Cast:
Vijay Sethupathi, Manju Warrier, Suri, Bhavani Sri, Gautam Vasudev Menon, Suri Sethupathi, Anurag Kashyap, Rajeev Menon, Ilavarasu, and Balaji Shaktivel, among others.
సామాన్యుల నుంచి ఉద్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ కథే, విజయ సేతుపతి, వెట్రీమారన్‌ల ‘విడుదల-2’ : నిర్మాత చింతపల్లి రామారావు
విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్ సేతుపతి ఇటీవల చెన్నయ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం ఈ చిత్రం విశేషాలను తెలియజేయడానికి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు నిర్మాత. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ” ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రయిలర్‌తో పాటు పాటల్లో కూడా మంచి టెంపో ఉంది. ఈ చిత్ర కథాంశాన్ని చెప్పాలంటే.. ” పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2′. ఈ చిత్రం తమిళ చిత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఈ చిత్రంలో పెరుమాళ్ పాత్రకు సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్ పాత్రలో విజయ్ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం ఆయన పేరు మరింత పెరుగుతుంది. ఏడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న వెట్రీమారన్ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్రహీరోలదరూ ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ప్రళయం లాంటి సంగీతాన్ని అందించారు. ఇక విజయ్, వెట్రిమారన్, ఇళయరాజా ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రంలో పీటర్ హెయిన్స్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు, మంజు వారియర్ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది. విజయ్, మంజు వారియర్ మధ్య ఎమోషన్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి. డిసెంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధిస్తుంది’ అన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకవెళుతుంది. తప్పుకుండా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అన్నారు. విడుదల-2 లాంటి గొప్ప సినిమాని చింత పల్లి రామారావు తెలుగు ప్రేక్షకులను అందించడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం ఆయనకు ఘనవిజయం అందిస్తుందని నిర్మాతలు సుబ్బారెడ్డి, తుమ్మల పల్లి రామసత్యనారాయణ, డీఎస్రావులు ఆకాంక్షించారు.
విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ బాలాజీ శక్తివేల్
తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, డి ఓ పి: వేల్ రాజ్, ఎడిటింగ్: ఆర్ : రామర్, పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు,
నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్
చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)