K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Vidhrohi First Song Released
The upcoming film ‘Vidhrohi’, featuring Ravi Prakash, Shivakumar, Charishma Srikar, and Sai in lead roles, is a suspense crime thriller directed by V.S.V. and produced by Vijjana Venkata Subrahmanyam.
Recently, the first look of the film was unveiled by actor Srikanth, who extended his best wishes to the film’s team. With the post-production work now completed, the makers are gearing up for the film’s release and have started promotions.
As part of the promotions, the first song from the movie was launched by renowned mass and action film director V.V. Vinayak, thereby kickstarting the music promotions.
V.V. Vinayak’s Comments:
”I’ve seen the first look of ‘Vidrohi’ and heard about the story as well. It’s a very good concept, and I believe it will connect well with the audience. The song I released today is also very impressive. I wish the director and producer all the best. I’ve known Ravi Prakash, who plays a police officer in the film, for a long time — he’s a fine actor. I wholeheartedly wish success to the entire team of this movie.”
Pappula Kanaka Durga Rao (IBM Mega Music Head) added:
”We are thankful to director V.V. Vinayak garu for launching the song of our film ‘Vidrohi’. Earlier, actor Srikanth garu also supported us. We’re happy to receive such support from the industry. We are planning to bring this film to the audience very soon.”
Director V.S.V. shared:
”The first look released by Srikanth garu received a tremendous response. Now we are thrilled that one of our favorite directors, V.V. Vinayak garu, has launched the song. We’re grateful for his blessings. Ravi Prakash and Shivakumar have acted brilliantly in this movie. Every character in this film has been designed to be engaging. ‘Vidhrohi’ is a suspense crime thriller with a completely fresh and unique concept. We will be announcing the release date soon.”
The entire film team also thanked V.V. Vinayak and expressed confidence in the film’s success.
Cast:
Ravi Prakash, Shivakumar, Charishma Srikar, Sai, Tagubothu Ramesh, Madhunandan, Koteshwara Rao, Jabardasth Bobby, Ranveer Sai, R. Karna, Naviketh Patil, Raghavendra Pappula, Anvesh, DJ, Manamma, Diya, Madhuri, Saniya, Aneesh Ram, RJ Naidu, Krishnarao, Thadivelu, and others.
Crew:
PRO: Veerababu B
Stills: Shake Aleem Pasha
Publicity Designer: Vivereddy
DI: Ganesh Kommarapu
CGI: Anil Kumar Bangaru
Makeup: Raja Badisa
Costumes: V. Edukondalu
DTS & Mixing: Jayanthan Suresh
SFX: Hemanth Mandula
Manager / Executive Manager: K. Malik
Art Director: Ravibabu Dondapati
Choreographers: Sun Ray Master, Mohan Krishna Master
Fights: Dragon Prakash
Editing: Upendra, MNR
DOP: Satish Muthyala
Lyrics: Suresh Gangula, Dev Pawar, Uma Vanguri
Music: Bheems Ceciroleo
Producer: Vijjana Venkata Subrahmanyam
Story, Screenplay, Dialogues, Direction: V.S.V.
టాలీవుడ్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా ‘విద్రోహి’ 1st సాంగ్ విడుదల
రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్ గారు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ చిత్ర సాంగ్‌ని మాస్, యాక్షన్ చిత్రాల దర్శకుడు వి వి వినాయక్ గారి చేతుల మీదుగా విడుదల చేసి, మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు.
సాంగ్ విడుదల అనంతరం వి వి వినాయక్ మాట్లాడుతూ.. ‘‘విద్రోహి ఫస్ట్ లుక్ చూశాను. అలాగే ఈ కథ గురించి కూడా విన్నాను. చాలా మంచి కథ. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. నేను విడుదల చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా చేసిన రవి ప్రకాష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా, టీమ్ అందరికీ మంచి సక్సెస్‌ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
IBM MEGA MUSIC అధినేత పప్పుల కనక దుర్గారావు మాట్లాడుతూ – మా ‘విద్రోహి’ మూవీ సాంగ్‌ను విడుదల చేసిన దర్శకులు వి వి వినాయక్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.
దర్శకుడు వి ఎస్ వి మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మాకెంతో ఇష్టమైన దర్శకులు వి వి వినాయక్ గారు మా చిత్ర సాంగ్‌ని విడుదల చేయడంతో ఎంతో హ్యాపీగా ఉంది. ఆయన ఆశీస్సులు మాకు అందించినందుకు.. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మూవీలో రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాము. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర టీమ్ అంతా వి వి వినాయక్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. సినిమా సక్సెస్‌పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రవిప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి, తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ, రణ్వీర్ సాయి, ఆర్ కర్ణ, నవికేత్ పాటిల్, రాఘవేంద్ర పప్పుల, అన్వేష్. డిజె, మనమ్మ, దియా, మాధురి, సానియా, అనీష్ రామ్, ఆర్ జే నాయుడు, కృష్ణారావు, తడివేలు తదితరులు నటించిన ఈ చిత్రానికి
పీఆర్ఓ – వీరబాబు. బి
స్టిల్స్ – షేక్ అలిం పాషా
పబ్లిసిటీ డిజైనర్ – వివరెడ్డి
డీఐ – గణేష్ కొమ్మరాపు
సీజీ – అనిల్ కుమార్ బంగారు
మేకప్ – రాజా బడిస
కాస్ట్యూమ్ – వి.ఏడుకొండలు
డీటీఎస్ అండ్ మిక్సింగ్ జయంతన్ సురేష్ , ఎస్ఎఫ్ఎక్స్ – హేమంత్ మందుల
మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ – కె మల్లిక్
ఆర్ట్ డైరెక్టర్ – రవిబాబు దొండపాటి
కొరియోగ్రాఫర్స్ – సన్ రే మాస్టర్, మోహన్ కృష్ణ మాస్టర్
పైట్స్ – డ్రాగన్ ప్రకాష్
ఎడిటింగ్ – ఉపేంద్ర, ఎంఎన్ఆర్
డీవోపీ – సతీష్ ముత్యాల
లిరిక్స్ – సురేష్ గంగుల, దేవ్ పవార్, ఉమా వంగూరి
మ్యూజిక్ – భీమ్స్ సిరోలియో
ప్రొడ్యూసర్ – విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – వి ఎస్ వి