Purushothamudu Successmeet held grandly
పురుషోత్తముడు తో అలాంటి ప్రయత్నం చేశాం – నిర్మాత డా.రమేష్ తేజావత్
రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందించారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో “పురుషోత్తముడు” సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. రాజ్ తరుణ్ ఫోన్ లో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వంటి అభిరుచి గల ప్రొడ్యూసర్స్ ఉండటం వల్లే “పురుషోత్తముడు” వంటి మూవీ చేయగలిగాం. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ గారి పాత్రలకు మంచి అప్లాజ్ వస్తోంది. పూల రైతుల సమస్యను తెరపై చూపించడం అనేది ఒక కొత్త నేపథ్యం, కొత్త ప్రయత్నం అనే ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ హీరోతో చేస్తే మా మూవీ మరింత బ్లాక్ బస్టర్ అయ్యేది అనే మాటలు వినిపిస్తున్నాయి. మేము కంటెంట్ ను బిలీవ్ చేశాం. అది బాగుంటే ప్రేక్షకులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని నమ్మాం. ఇవాళ థియేటర్ లో ప్రేక్షకులు అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ కూడా మా మూవీని పంపిస్తాం. మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.
నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ – మా “పురుషోత్తముడు” సినిమా నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజైంది. అన్ని చోట్ల నుంచి మా సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేశారనే ప్రశంసలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. మా డైరెక్టర్ రామ్ గారికి ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చూసేంత క్లీన్ మూవీస్ ఈ మధ్య రావడం లేదు. “పురుషోత్తముడు”తో అలాంటి ప్రయత్నం చేశాం. మా సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా స్టార్ కాస్టింగ్ ఉన్నారు. వాళ్ల పాత్రలకు మంచి స్పందన వస్తోంది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు “పురుషోత్తముడు” సినిమా చూపించాలి. జీవితంలో ఎలా ధర్మంగా బతకాలో ఈ సినిమా నేర్పిస్తుంది. మా మూవీలో అసభ్యత, అశ్లీలత అనే మాటే వినిపించదు. ఐటెం సాంగ్స్, ఎక్స్ పోజింగ్ కు అవకాశం ఉన్నా మేము పెట్టలేదు. “పురుషోత్తముడు” 2 ప్లాన్స్ ఇప్పుడే లేవు. అయితే త్వరలో ఓ స్టార్ హీరోతో భారీ సినిమా నిర్మించే సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాలో నేను అమ్ములు క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్క్రీన్ మీద అందంగా ఉన్నానని చెబుతున్నారు. లంగావోణి కట్టుకుంటే తెలుగు ఆడియెన్స్ కు అందంగా కనిపించకుండా ఎలా ఉంటాను. ఈ పాత్ర కోసం ఏడాదిగా కాస్ట్యూమ్స్, మేకోవర్, వర్క్ షాప్స్ చేశాను. ఆ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమా కథ విన్నప్పుడే విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని అనుకున్నాను. మరో కాస్ట్లీ లొకేషన్ కు వెళ్లేందుకు ప్రొడ్యూసర్ ఒప్పుకున్నా..మా డైరెక్టర్ రామ్ గారు కడియపులంకలోనే మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అది దర్శకుడిగా ఆయనలోని జెన్యూనిటీకి నిదర్శనం. డైరెక్టర్ గారి ప్లానింగ్ వల్లే “పురుషోత్తముడు” సినిమాలో విజువల్స్ కు అంత మంచి పేరు వస్తోంది. అన్నారు.