Upasana Kamineni Konidela and Ram Charan Announce Second Pregnancy, Couple

PrabhutvaSaraiDukaanam Teaser Unveiled
The teaser of the much-anticipated film “Prabhutva Sarai Dukaanam” was officially launched today amidst a grand gathering. Produced under the banners of SVS Productions and Srinidhi Cinemas, the film is helmed by National Award-winning director Narasimha Nandi, who is known for bold and thought-provoking storytelling
Set against the backdrop of rural politics, the film highlights the pivotal role of women and their strength in reshaping society.
The ensemble cast includes:
Sadhan Hasan, Vikram Jith, Naresh Raju, and Vinay Babu in key roles, with Sreelu Dasari, Aditi Michael, and Mohana Siddi as the leading ladies. Senior actor 30 Years Industry Prudhviraj, BJP Balu Nayak, Balagam Sahadev, Ranga Raju, Tilak, Swapna, and Jyothi will be seen in strong supporting characters.
Technical brilliance comes from Murali Mohan Reddy (Cinematography), Nagi Reddy (Editing), and Siddharth (Music).
At the teaser launch, director Narasimha Nandi remarked:
“This story reflects human nature and personality traits inspired by mythology. Every character brings out a unique shade of society, and that’s why we describe it as a tale of humans with animal instincts.”
Producer Daiva Naresh Goud stated:
“This is not just cinema—it’s a bold political drama that will stir conversations. We are confident the film will leave a lasting impact.”
Co-producer Parigi Sravanthi Mallik added:
“Each character is equally important. It’s a film rooted in real incidents that showcases the strength of women with unflinching honesty. We believe audiences will experience goosebumps throughout.”
With its powerful performances, raw narrative, and striking social commentary, “Prabhutva Saraayi Dukaanam” promises to be a film that challenges perspectives while entertaining audiences.
Cast highlights:
Sadhan Hasan, Vikram Jith, Naresh Raju, and Vinay Babu play the male leads, while Sreelu Dasari, Aditi Michael, and Mohana Siddi take up the female lead roles. Veteran actor 30 Years Industry Prudhviraj, BJP Balu Nayak, Balagam Sahadev, and several others play pivotal characters.
Technical crew:
Direction: Narasimha Nandi
Producers: Daiva Naresh Goud & Parigi Sravanthi Mallik
Cinematography: Murali Mohan Reddy
Editing: Nagi Reddy
Music: Siddharth
PRO : MadhuVR, Viswanath Thenneeru
Digital : Digital Dukanam
ఘనంగా ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ లాంచ్
ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీలో నాగిరెడ్డి ఎడిటింగ్ చేస్తూ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రల పోషించారు. మల్లిక్, నరేష్ గౌడ్ ఈ చిత్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాటలు పోషించడం విశేషం. కాగా నేడు మీడియా సమక్షంలో ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ… “మా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఒక కథను రెండు భాగాలుగా అనుకుని మొదటిగా ఈ సినిమా మొదలుపెట్టాను. ఈ సినిమాలో ప్రతి పాత్ర మనకు పురాణాల నుండి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు అలాగే మనిషి యొక్క ఇతర ఆలోచనలు అన్నిటిని ఈ సినిమాలోని పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటూ ట్యాగ్ పెట్టడం జరిగింది. అలాగే చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు కూడా ఎంతో శ్రద్ధతో నటించారు. ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. అటువంటి వారితో కలిసి పనిచేసినందుకుగాను ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత దైవ నరేష్ గౌడ మాట్లాడుతూ… “ముందుగా పాత్రికేయ మిత్రులందరికి థాంక్స్. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఎంతో అద్భుతంగా ఉండిపోతుంది. ఇటువంటి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరొక 3 సినిమాలు రాబోతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా నిలిచిపోతుంది. మా సినిమా ప్రేక్షకులలోకి తీసుకు వెళ్తున్న మీడియా వారికి మరోసారి ధన్యవాదాలు అనుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత పరిగి స్రవంతి మల్లిక్ మాట్లాడుతూ… “ఒక దర్శకుడికి సినిమానే అన్ని అన్నట్లుగా ఉంటుంది. అటువంటి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నరసింహ నంది గారు ఎంతో శ్రద్ధతో చేసిన సినిమా ప్రభుత్వ సారాయి దుకాణం. ఈ సినిమాలో ప్రతి పాత్ర హీరోనే. ఒక గ్రామంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకొని శ్రీ శక్తి చూపిస్తూ చేసిన సినిమా. ఎంతో ధైర్యం ఉంటే కానీ ఇటువంటి సినిమా తీయలేరు. అంతటి ధైర్యం ఉన్న వ్యక్తి మా దర్శకుడు. ఈ సినిమా అందరికీ గోస్బంప్స్ తప్పించేలా ఉంటుంది. సినిమా కోసం పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చినందుకుగానూ అందరికీ థాంక్స్. నాకు ఈ చిత్రానికి పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాలో ట్విస్టులు, మలుపులు ఉంటాయి. ఎన్నో సీన్స్ చాలా హై ఉంటాయి. సినిమాలోని పాత్రలలో మానవత కోణాల నుండి రాజకీయ కోణాల వరకు వివిధ రకాలుగా పాత్రలను మనం చూడబోతున్నాము. ఇటువంటి సినిమాలు ప్రేక్షకులు అంతా థియేటర్లో ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు విక్రమ్ జిత్ మాట్లాడుతూ… “సాధారణంగా మనిషి లోపల రెండు కోణాలు ఉంటాయి. ఒకటి కనిపించేది, మరొకటి కనిపించనిది. ఈ సినిమా ద్వారా స్త్రీ శక్తి ఎంత బలంగా ఉంటుంది అనేది మా డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు నేను ఎంతో ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను. సినిమాలో నాకంటూ ఒక చక్కటి పాత్ర, కథ ఉంటుంది. అటువంటి పాత్రకు నన్ను ఎంచుకున్నందుకుగాను దర్శక నిర్మాతలకు నా థ్యాంక్స్” అన్నారు.
నటి శ్రీలు మాట్లాడుతూ… “ఇప్పటికి ఎన్నో సినిమాలు చేశాను కానీ ఈ సినిమా నా సినీ కెరియర్లో మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నా పాత్ర కాస్త కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమా ద్వారా నాకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
నటి మోహన సిద్ధి మాట్లాడుతూ… “నేను ఈ సినిమాలో నా పాత్ర గురించి విన్నప్పుడు ఎంతో భయపడ్డాను. రెండు రోజులపాటు ఆలోచించాను. నాకంటూ ఒక గుర్తింపు వచ్చే పాత్ర అనిపించింది. అందుకే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పాత్రను నేను చేయడానికి సిద్ధపడ్డాను. ఒక్క పాత్రకు కూడా డైలాగ్ ప్రాక్టీస్ కానీ, వర్క్ షాప్ కానీ లేదు. అన్ని సెట్స్ లోనే చేసుకున్నాము. అటువంటి దర్శకుడు దగ్గర పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరం. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉండబోతుంది” అంటూ ముగించారు.
నటీనటులు : సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు, శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి, మల్లిక్, నరేష్ గౌడ్ తదితరులు.
సాంకేతిక బృందం :
దర్శకుడు: నరసింహ నంది
నిర్మాతలు: స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ్
బ్యానర్: SVS ప్రొడక్షన్, శ్రీనిధి సినిమాస్
డిఓపి : ఎస్ మురళీ రెడ్డి
ఎడిటర్: వి నాగి రెడ్డి
సంగీత దర్శకుడు: సిద్ధార్థ్
PRO : మధు VR, విశ్వనాథ్ తన్నీరు
డిజిటల్: డిజిటల్ దుకాణం