
Meghana Movie Teaser and Poster Launched grandly
A youth-oriented crime and suspense thriller film titled “Meghana” is all set to hit the Telugu silver screen soon. Featuring ‘Chitram’ Srinivas, Sushma, and Ram Bandaru in the lead roles, the film is directed by Sudhakar Reddy Varra and produced by Nandi Venkat Reddy under the banner of Sri Shiva Sai Films. The poster and teaser launch event was held grandly at the Telugu Film Chamber, Hyderabad, with several film celebrities gracing the occasion.
Speaking at the event, hero ‘Chitram’ Srinivas said, “This film is being made with strong content and will surely become a success. I believe it will add another hit to my career. I thank the director and producer for giving me this opportunity.”
Heroine Sushma said, “Since the beginning, everyone in the team has been very supportive. I’m happy to have been given a chance to play the lead role. My father passed away three years ago, and I haven’t celebrated my birthday since. But celebrating it during this press meet made me feel deeply emotional and happy. This movie will be a special milestone in my life.”
Director Sudhakar Reddy Varra shared, “Though it’s a small production, we made this movie with big dreams. Despite facing several challenges, we completed it within two years. The story mainly revolves around human emotions and relationships. I’m confident audiences will connect deeply with it.”
Producer Nandi Venkat Reddy stated, “We’ve made this film with a strong social message and designed it to appeal to family audiences. The story is engaging and entertaining for all age groups. We will soon announce the release date.”
Chief guests — director Sanjeev Mogoti, ‘Meelo Okadu’ movie hero Kuppili Srinivas, and noted actors ‘Gharshana’ Srinivas, Lankela Ashok Reddy, and Dhanunjay — praised the teaser, saying, “It looks gripping and fresh. Making a crime suspense thriller with new talent is truly inspiring. We sincerely wish the entire team great success.”
The movie is currently in its final post-production stage and will soon be released in theatres.
Banner: Sri Shiva Sai Films
Cast: Chitram Srinivas (Hero), Sushma (Heroine), Ram Bandaru (Hero), Venkat Ramana, Mounika, Soumya, Malleswari, M. Nagesh Babu, Rosireddy
Producer: Nandi Venkat Reddy
Co-Producers: Sudhakar Reddy Varra, M. Nagesh Babu
Story, Screenplay & Direction: Sudhakar Reddy Varra
Dialogues: Hara Uppada
Music: Drums Ramu
DOP: D. Yadagiri
PROs: Dayyala Ashok, Kadali Rambabu
ఘనంగా ‘మేఘన’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్
యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కథనంలో యూనిక్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెలుగు తెరపైకి రాబోతోంది. ‘చిత్రం’ శ్రీను ,సుష్మ , రామ్ బండారు హీరోహీరోయిన్లు గా సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘మేఘన’ శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్‌పై నంది వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ‘చిత్రం’ శ్రీనివాస్ మాట్లాడుతూ – “మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని, నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకం ఉంది, నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
చిత్ర హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ – “ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్‌డే సెలబ్రేట్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రెస్‌మీట్ సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో భావోద్వేగంగా, ఆనందంగా అనిపించింది. ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది” అన్నారు.
దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ – “చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం” అన్నారు.
నిర్మాత నంది వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – “సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా సినిమా తీర్చిదిద్దాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథ సాగుతుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం” అన్నారు.
ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకుడు సంజీవ్ మోగోటీ, ‘మీలో ఒకడు’ మూవీ హీరో కుప్పిలి శ్రీనివాస్, ప్రముఖ నటులు ‘ఘర్షణ’ శ్రీనివాస్, లంకెల అశోక్ రెడ్డి, ధనుంజయ్ తదితరులు మాట్లాడుతూ – “టీజర్ చాలా ఆకట్టుకునేలా ఉంది. కొత్తవారితో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్న ప్రయత్నం ఎంతో స్పూర్తిదాయకం. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్యానర్: శ్రీ శివ సాయి ఫిలిమ్స్
నటీనటులు : చిత్రం శ్రీను (హీరో) , సుష్మ (హీరోయిన్ ) , రామ్ బండారు (హీరో ) , వెంకట్ రమణ, మౌనిక , సౌమ్య , మల్లేశ్వరి ,,యం.నగేష్ బాబు , రోశిరెడ్డి…
నిర్మాత: నంది వెంకట్ రెడ్డి
సహా నిర్మాతలు : సుధాకర్ రెడ్డి వర్ర , యం .నగేష్ బాబు
కథ , స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సుధాకర రెడ్డి వర్ర
డైలాగ్స్: హర ఉప్పాడ
మ్యూజిక్: డ్రమ్స్ రాము
డీఓపీ: డి. యాదగిరి
పీఆర్వో: దయ్యాల అశోక్ ,కడలి రాంబాబు