“KA” team believed in the film, and hard work has paid off – Dil Raju
Young hero Kiran Abbavaram’s latest film KA is creating a huge buzz at the box office, with trade sources already declaring it a Diwali winner. The film stars Tanvi ram and Nayan Sarika as the female leads, and is directed by Sujith and Sandeep. Presented by Mrs. Chinta Varalakshmi and produced by Chinta Gopalakrishna Reddy under the banner of Sri Chakraas Entertainments, KA was released in Telugu by producer Vamsi Nandipati. The movie has received an overwhelming response from audiences and is entering its second week with great momentum. In this context, a grand success meet was held in Hyderabad to celebrate the film’s success.
At the event, actress Sharanya Pradeep expressed her happiness, saying, “I’m thrilled to be part of the success meet of KA, which has become a massive hit. I gained recognition as an actress through Dil Raju and Sekhar Kammula’s Fida, and with that recognition, I’m able to be part of films like KA. I’m glad that the hard work of our team has translated into this success.”
Director Sujith thanked everyone who attended the success meet, saying, “The success of KA is thanks to the efforts of our actors and technicians. Our direction team worked tirelessly on this film. I thank Kiran for believing in such a complex script and giving us the opportunity. We also can’t forget the support of our producer, Gopi garu. We appreciate every actor and technician who contributed to this film.”
Director Sandeep shared his thoughts, stating, “We didn’t have industry contacts when we started our careers, but we were determined to tell a great story. Kiran gave us the chance to tell our story at a time when we were struggling to find the right path. Some people doubted the script of KA, thinking it might only appeal to a specific section of the audience. But the Telugu audience proved that they will support a good film. This success is also a great encouragement for other filmmakers.”
Producer Dil Raju spoke highly of the film, saying, “I’ve been following the progress of KA from the beginning. Most of the team is young, and they’ve worked hard to make this film a success. This Diwali, there was tough competition at the box office, with five films achieving success. It’s no small feat for KA to stand out in this competition and perform so well. The team believed in the film, and that hard work has paid off. I’ll personally congratulate every member of the team. Early successes like this are memories that stay with you forever. Kiran came into the industry without any background, but through his talent and dedication, he has made a name for himself. I am sure he will continue to achieve more success in the future. In this industry, no one supports anyone, and talent is what ultimately saves us.”
Producer Bunny Vas also praised the team, saying, “Congratulations to Kiran and the entire team for the fantastic success of KA. As a producer, I hear many stories, and I can usually predict what will happen next in a film, but with KA, I was completely surprised by the climax. It’s the best screenplay I’ve seen in recent times, and the climax is receiving standing ovations in theaters. Vamsi made a significant investment in the distribution, and though I was initially concerned, after watching the film, I realized his decision was spot on. I hope this team continues to achieve great success.”
Producer Chinta Gopalakrishna Reddy expressed his gratitude to the media and audience for their support, saying, “We cannot forget the support we’ve received from the media, and the film has been embraced by audiences as well. Even those who watched the movie once are returning to see it again. I’m getting numerous phone calls, and KA has left me feeling fulfilled knowing we made a great film. I thank Kiran Abbavaram and the entire team for their hard work.”
Distributor Vamsi Nandipati shared his thoughts, saying, “We are enjoying the success of KA more than the success itself because of the effort we all put into making this film a hit. We’re all eagerly awaiting when we can have another success like this. Some friends had doubts when I took on the distribution of this movie, but after watching it, I knew it would be a success. If you believe in a good film, it rewards you manifold. I’ve had similar experiences with films like Polimera 2 and 2018. I’m thankful to Kiran and producer Gopi garu for trusting me with KA.”
Director Anil Viswanath of Polimera said, “KA started as a small idea, and I am happy to be celebrating such a huge success today. I personally enjoy screenplay-driven films, and KA stands out with its impressive screenplay. I believe this team has the potential to achieve many more successes like this one.”
Director Vasshishta congratulated the KA team, saying, “I love time-travel films, and KA kept the audience engaged with its story until the very end. The climax was especially surprising. It’s refreshing to see two directors working in sync on a project. Kiran Bhaiya should give more opportunities to new directors. I’m also eagerly waiting for KA 2. Kiran always believes in the content. Sometimes it clicks, sometimes it doesn’t, but Kiran consistently tries to make unique films. For those who haven’t seen the movie yet, I encourage you to watch it in theaters.”
Hero Kiran Abbavaram expressed his gratitude, saying, “I want to thank all the elders who came to our KA success meet and blessed us. I’m also grateful to the audience for giving our film such a big success. I remember everyone who supported me. Before the release of KA, 99 percent of those who spoke negatively about the movie were present. They questioned why we considered KA a big movie. Even though they acknowledged it was a good film, no one believed in it. But the audience made what we believed in come true. I credit the entire KA team for this success. Success and failure are not my responsibility, and that’s why I react the same to both. My journey is what matters most to me. This journey is what gives me satisfaction. We need to introduce more new directors, and heroes shouldn’t be judged based on their market value. In just one Friday, those numbers can change dramatically. I will personally meet those who supported our movie. With your encouragement, I will make more meaningful films.”
Hero Sundeep Kishan shared his thoughts, saying, “After Kiran’s Rajavaru Rani Garu, I’m back at the KA movie function. I’ve been following Kiran’s career from the beginning, and he has achieved great success. Even when a couple of his films didn’t do well, there was a lot of negativity surrounding him. People seemed happy about his failures, but despite all that, he went on to deliver a super hit like KA. He released it during the festival and made sure it reached the audience. I’m proud to see Kiran’s success. He’s an inspiration to many. The audience today is eagerly waiting for those who make good films. Directors Sujith and Sandeep are being highly praised, and I hope they become as famous as Raj & DK. I congratulate the entire KA team.”
కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే “క” విజయం – సక్సెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో “క” సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో….
శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ – మా “క” సినిమా ఘన విజయం సాధించి సక్సెస్ మీట్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు, శేఖర్ కమ్ముల గారి ఫిదా సినిమాతో నాకు నటిగా మంచి పేరు వచ్చింది. ఆ గుర్తింపుతోనే “క” వంటి మూవీస్ చేయగలుగుతున్నాను. మా టీమ్ సినిమా కోసం పడిన కష్టానికి సక్సెస్ రూపంలో రిజల్ట్ రావడం హ్యపీగా ఉంది. అన్నారు.
దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ – “క” సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కు థ్యాంక్స్. ఈ సినిమా విజయంలో నా యాక్టర్స్, టెక్నీషియన్స్ కు క్రెడిట్ ఇవ్వాలి. మా డైరెక్షన్ టీమ్ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ను నమ్మి అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గోపి గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. ప్రతి నటుడికీ, ప్రతి టెక్నీషియన్ కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
దర్శకుడు సందీప్ మాట్లాడుతూ – మాకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు లేవు. మంచి కథతోనే దర్శకులుగా కెరీర్ ప్రారంభించాలని అనుకున్నాం. మాకు సరైన దారి దొరకని టైమ్ లో కిరణ్ గారు అవకాశం ఇచ్చారు. మా కథను నమ్మి సినిమా చేశారు. “క” స్క్రిప్ట్ ఏదో ఒక సెక్షన్ ఆడియెన్స్ కే రీచ్ అవుతుందని కొందరు భయపెట్టారు. కానీ మంచి సినిమాను ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. మా తర్వాత వచ్చే వాళ్లకు కూడా ఎంకరేజింగ్ రిజల్ట్ ఇచ్చారు. అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – “క” సినిమా కంటెంట్ మొదటి నుంచీ చూస్తున్నాను. దాదాపు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో కూడా ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మరోసారి వస్తుందా లేదా అనేది చెప్పలేం. ఆ పోటీలో “క” సినిమా తట్టుకుని నిలబడి ఘన విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. మీరంతా మీ సినిమాను నమ్ముకుని హార్డ్ వర్క్ చేశారు. మీ టీమ్ అందరినీ ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడుతాను. “క” సక్సెస్ మీట్ వేదిక మీద ఉండటం మాకూ సంతోషాన్ని ఇస్తోంది. ఈ మూవీ టీమ్ కు నా అభినందనలు. మీరు తర్వాత ఎన్ని విజయాలు సాధించినా, కెరీర్ ఎర్లీ డేస్ లో సాధించిన సక్సెస్ లే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కిరణ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కష్టంతో, ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. ఇలాగే అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు, గెస్ట్ లుగా రారు. మన సినిమానే, మన టాలెంటే మనల్ని కాపాడుతుంది. అన్నారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – “క”తో ఘన విజయం అందుకున్న కిరణ్ కు మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్. నేను ప్రొడ్యూసర్ గా ఎన్నో కథలు వింటాను. ఆ కథలో నెక్ట్ ఏం జరుగుతుందో ఊహించగలను. కానీ “క” సినిమా క్లైమాక్స్ ను నేను గెస్ చేయలేకపోయాను. నేను ఇటీవల కాలంలో చూసిన ది బెస్ట్ స్క్రీన్ ప్లే ఇదే. క్లైమాక్స్ కు థియేటర్స్ లో చప్పట్లు కొడుతున్నారు. మా వంశీ ఈ సినిమాను పెద్ద మొత్తం చెల్లించి రిలీజ్ చేశాడు. రిస్క్ చేస్తున్నాడేమో అని ముందు నేను కొంత భయపడినా, సినిమా చూశాక ఆయన డెసిషన్ కరెక్టే అనిపించింది. ఈ టీమ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమాకు మీడియా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా అంతటి ఆదరణ దక్కింది. ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవాళ్లు కూడా మా మూవీకి వెళ్లి బాగుందని చెబుతున్నారు. నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంచి సినిమా చేశామనే సంతృప్తిని “క” మిగిల్చింది. కిరణ్ అబ్బవరంతో పాటు మిగతా టీమ్ అందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “క” సినిమా సక్సెస్ కంటే ఆ సక్సెస్ కోసం మేమంతా చేసిన ప్రయత్నాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి మరో సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఎక్కువ పెట్టావు అని మిత్రులు కొందరు అన్నారు. సినిమా చూసిన నాకు ఆ సక్సెస్ ముందే తెలుసుకోగలిగాను. ఒక మంచి సినిమాను నమ్మితే రెండు, మూడింతలు ఫలితాన్ని ఇస్తుంది. నేను పొలిమేర, 2018 తీసుకున్నప్పుడు కూడా ఇలాగే మిత్రులు సందేహాలు వ్యక్తం చేశారు. క సినిమాను నాకు ఇచ్చిన కిరణ్ కు, ప్రొడ్యూసర్ గోపి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు
పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ – “క” సినిమా చిన్న ఐడియాగా మొదలై..ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ మీట్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. నాకు స్క్రీన్ ప్లే డ్రివెన్ మూవీస్ అంటే ఇష్టం. “క” స్క్రీన్ ప్లే పరంగా బాగా ఆకట్టుకుంటుంది. ఈ టీమ్ ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలి. అన్నారు.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ – “క” సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్. నాకు టైమ్ ట్రావెల్ మూవీస్ అంటే ఇష్టం. ఈ కథలోని ఆసక్తిని చివరి వరకు అలాగే హోల్డ్ చేశారు. క్లైమాక్స్ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు డైరెక్టర్స్ ఒక మూవీకి సింక్ అయి వర్క్ చేయడం కొత్తగా ఉంది. కిరణ్ భయ్యా మరికొంత మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి. క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా. కిరణ్ ఎప్పుడూ కంటెంట్ నే నమ్ముకుంటాడు. అందులో కొన్ని ఆడతాయి, మరికొన్ని ఫెయిల్ కావొచ్చు. కానీ కొత్తగా మూవీ చేయాలనే కిరణ్ ప్రయత్నిస్తాడు. ఈ సినిమా చూడనివారు థియేటర్స్ కు వెళ్లి చూడండి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” సక్సెస్ మీట్ కు వచ్చి బ్లెస్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్స్. మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను. క రిలీజ్ కు ముందు నెగిటివ్ గా మాట్లాడిన వారు 99 పర్సెంట్ ఉండేవారు. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. క టీమ్ అందరికీ మూవీ సక్సెస్ క్రెడిట్ ఇస్తాను. సక్సెస్ ఫెయిల్యూర్స్ నా ఒంటికి పట్టవేమో, అందుకే ఫెయిల్యూర్, సక్సెస్ కు ఒకేలా రియాక్ట్ అవుతున్నాను. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలా ఆ నెంబర్స్ మారిపోవడానికి. మా మూవీని ఆదరిస్తున్న వాళ్లను పర్సనల్ గా వచ్చి కలుస్తాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను. అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – కిరణ్ రాజావారు రాణిగారు సినిమా తర్వాత మళ్లీ క మూవీ ఫంక్షన్ కు వచ్చాను. తన కెరీర్ ను మొదటినుంచీ చూస్తున్నా. మంచి సక్సెస్ లు అందుకున్నాడు. మధ్యలో రెండు మూడు సినిమాలు పోయినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. ఒకరి ఫెయిల్యూర్ ను ఇంతగా సంతోషపడతారా అనిపించింది. ఇలాంటి నెగిటివిటీని తట్టుకుని ఈరోజు క వంటి సూపర్ హిట్ సినిమా చేశాడు. ఆ సినిమాను పండక్కి రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాడు. కిరణ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఎంతోమందికి నువ్వు ఇన్సిపిరేషన్. ఈరోజు ప్రేక్షకులు మంచి సినిమా చేసిన వారిని తప్పకుండా ఆదిరస్తున్నారు. దర్శకులు సుజీత్, సందీప్ గురించి ప్రశంసలు వస్తున్నాయి. మీరిద్దరు రాజ్ డీకే అంత పేరు తెచ్చుకోవాలి. క టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్