I feel blessed working with Shankar sir – Global Star Ram Charan
Global Star Ram Charan teamed up with legendary filmmaker Shankar for the pan-India biggie “Game Changer”. The film is set for a grand release on January 10. Ahead of the theatrical release, the team held a press meet in Mumbai today. Along with the film’s lead hero Ram Charan, the event witnessed the presence of producer Dil Raju, AA Films’ Anil Thadani, and actor SJ Suryah.
Speaking at the event, Ram Charan said, “Shankar sir remade 3 Idiots as Nanban in Tamil. I was the chief guest for the audio launch of the Telugu version of that movie. When I met Shankar sir on that day, I wished that he could make a Telugu film one day, not with me but any other day. But I never expressed my wish to him. After a few years, Dil Raju garu called me when I was shooting for RRR and told me that Shankar sir wants to work with me. Initially, I did not believe him. But when it was confirmed, I immediately called back Shankar sir. We have all grown up watching his films. As recently Rajamouli said, he is an epitome of commercial films. He defined larger-than-life cinema and global cinema. He was the first pan-Indian director we had. I feel blessed working with Shankar sir. As an actor, I feel enriched to work with Rajamouli garu and Shankar sir in a span of five years. Both Shankar and Rajamouli are taskmasters, and they expect a lot from each actor. They give you every opportunity to perform and give your best. It is very rare to work with such talent. They keep pushing you. Not a single day do they make you relax. They don’t want to waste a single shot. Shankar sir is so particular that he once found out a 5% difference in my hairstyle. Such particularity he has. SJ Suryah is one of the craziest actors and persons I have ever met.”
Producer Dil Raju said, “This was my 50th film. I wanted something special for this movie. From the time I heard the script, I decided to make it big. On top of it, Ram Charan became a Global Star after RRR. So we didn’t want to compromise. I wanted to do something special with Game Changer. As everyone was going across India to promote their films, I wanted to go to America. Thus, we held the event in Dallas. It was a great event that witnessed an attendance of more than 12,000 people. There are five songs in the movie. We spent Rs. 75 crore for those five songs. Each song was shot for 10-12 days. Shankar sir designs the songs himself, and he is very particular about it. Jaragandi was shot for 10 days in Hyderabad. Naanaa Hyraanaa was an experimental song shot for 10 days in New Zealand. Ra Macha Macha was shot for 10 days in Amritsar.”
Anil Thadani, who is releasing the film’s Hindi version, said, “I am really thanking Dil Raju garu for letting me be a part of his special 50th film. He has been the backbone of this massive film. I have worked with Shankar sir before, and he is known for his larger-than-life films. Hopefully, this turns out to be as successful as his previous films I worked on. SJ Suryah has got a massive fan following, and I have seen his skills; he is amazing. Coming to Ram Charan, being such a massive star, he is a great human being. It is always a pleasure to work with him. I hope the film is going to be the best for everyone involved.”
Actor SJ Suryah said, “Wishing you a very Happy New Year. I hope this year, God will bless us with hits in every language. I hope that the success streak will start with Game Changer. I dubbed myself in the Hindi version. I hope you like it. I got this offer from Shankar sir to work with a big star like Ram Charan garu. Ram Charan garu’s performance as Ram Nandan and Appanna will enthrall you. I’m not exaggerating, but the Appanna character, which comes in the flashback, will stay in your hearts. I watched Jaragandi for the first time, and I got high with those visuals. I loved it, and people will love it for sure. The film is coming on January 10. The movie is all about the war between a crooked politician and an honest IAS officer. It will entertain you for sure. What Pawan Kalyan garu has been doing on-field is what Ram Charan does in this movie. Everyone did a good job, including me (smiles). Game Changer is going to be a real game-changer. I hope you will enjoy it all.”
Game Changer features a stellar cast, including Kiara Advani, Anjali, Srikanth, Samuthirakani, Jayaram, Sunil, and Naveen Chandra. Thaman composed the music for it. Dil Raju and Sirish bankrolled the film under the banners of Sri Venkateswara Creations, Dil Raju Productions, and Zee Studios. SVC and Adityaram Movies produced the film in Tamil. AA Films’ Anil Thadani is releasing it in Hindi.
శంకర్ గారితో పని చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను.. జనవరి 10న రాబోతోన్న గేమ్ చేంజర్ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది.. ముంబై ఈవెంట్లో రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక శనివారం నాడు ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలని చూస్తుంటారు. రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారాతో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్‌లో చేసిన ఈవెంట్‌కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్‌లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్‌లో ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్‌లోనే ఉంటాయి. నా బ్యానర్లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.
అనిల్ తడాని మాట్లాడుతూ.. ‘హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. శంకర్ గారు ఎప్పుడూ కూడా భారీ సినిమాల్నే తీస్తుంటారు. గతంలో నేను ఆయన సినిమాల్ని రిలీజ్ చేశాను. ఎస్ జే సూర్య గారు అద్భుతమైన నటులు. రామ్ చరణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.
ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్‌గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేం సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది’ అని అన్నారు.