మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
‘FLASH BACK’- లేనిది ఎవరికి? అంటున్నఏఎస్ రవికుమార్ చౌదరి
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.
ఎఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘FLASH BACK’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. ‘లేనిది ఎవరికి?’ అనే క్యాప్షన్ క్యురియాసిటీని క్రియేట్ చేసింది.
న్యూ ఏజ్ స్టొరీతో రాబోతున్న ఈ మూవీకి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తుండగా, జేబీ మ్యూజిక్ అందిస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీను లిరిక్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రైటర్ డైమండ్ రత్నం బాబు. ఫైట్ మాస్టర్ గా వెంకట్ వర్క్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబధించిన నటీనటులు, ఇతర వివరాలని మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: కార్తీక్ రెడ్డి రాకాసి
బ్యానర్: ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్
సమర్పణ: ఎఎస్ రిగ్వేద చౌదరి
మ్యూజిక్: జెబి
డీవోపీ: ప్రభాకర్ రెడ్డి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీను
ఫైట్స్: వెంకట్
రైటర్: డైమండ్ రత్నం బాబు
పీఆర్వో: వంశీ-శేఖర్