
Bhimavaram Talkies Launches 15 Films at Once -unprecedented world record in cinema history
Having already produced 114 films under the Bhimavaram Talkies banner, noted producer Tummalapalli Ramasatyanarayana has now set an unprecedented world record in cinema history — launching 15 films simultaneously.
The glittering event, held at the jam-packed Saradhi Studios in Hyderabad, witnessed the presence of several stalwarts from the Telugu film industry. Notable attendees included Murali Mohan, Suman, Srikanth, J.D. Chakravarthy, Tanikella Bharani, “30 Years” Prudhvi, Ajay Ghosh, C. Kalyan, Tammareddy Bharadwaja, Tummala Prasanna Kumar, Chadalavada Srinivasa Rao, Bharat Bhushan, Valluripalli Ramesh Babu, Directors’ Association President Veerashankar, eminent writer & Rajya Sabha MP Vijayendra Prasad, KL Studio head Kontham Lakshman, and many others, all congratulating Ramasatyanarayana for his achievement.
The 15 Films and Their Directors:
1. Justice Dharma – (Yandamuri Veerendranath)
2. Nagapanchami – (Om Sai Prakash)
3. Naa Peru Pawan Kalyan – (J.K. Bharavi)
4. Topper – (Uday Bhaskar)
5. K.P.H.B. Colony – (Tallada Sai Krishna)
6. Police Simham – (Sanga Kumar)
7. Avantika 2 – (Sriraj Balla)
8. Yandamuri Kathalu – (Ravi Basara)
9. B.C. – Black Commando – (Mohan Kanth)
10. Honey Kids – (Harsha)
11. Savaasam – (Ekari Satyanarayana)
12. Dark Stories – (Krishna Karthik)
13. Manalni Evadra Aapedi – (B. Srinivasa Rao)
14. The Final Call – (Pranay Raj Vangari)
15. Avataram – (Dr. Satish)
In a unique feat, all 15 films had their clapboard, camera switch-on, and honorary direction done simultaneously with 15 separate cameras. Guests hailed Ramasatyanarayana for this record-breaking initiative, set to etch Telugu cinema’s name in the global record books.
The producer announced that since the films were launched on August 15, 2025, they aim to complete all projects and celebrate the “pumpkin breaking” (completion ritual) by August 15, 2026. He also thanked Kontham Lakshman for offering KL Studio at a 25% discount for these productions.
Nine nationally renowned organizations have recognized this launch event in their World Record Books. Notably, senior film journalist Dheeraj–Appaji has been appointed as the PRO for all 15 films!!
అంగరంగ వైభవంగా అతిరధమహారధుల సమక్షంలో
భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం
భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్, చీకటి ప్రవీణ్, ఇమ్మడి రమేష్, వంశీ రామరాజు, కె.ధర్మారావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ తదితర దిగ్గజాలు హాజరై రామసత్యనారాయణను అభినందించారు.
కొబ్బరికాయలు కొట్టుకున్న
15 చిత్రాల-దర్శకుల వివరాలు!
1) జస్టిస్ ధర్మ
(యండమూరి వీరేంద్రనాధ్)
2) నాగపంచమి
(ఓం సాయిప్రకాష్)
3) నా పేరు పవన్ కల్యాణ్
(జె.కె.భారవి)
4) టాపర్
(ఉదయ్ భాస్కర్)
5) కె.పి.హెచ్.బి. కాలని
(తల్లాడ సాయికృష్ణ)
6) పోలీస్ సింహం
(సంగకుమార్)
7) అవంతిక- 2
(శ్రీరాజ్ బళ్ళా)
8) యండమూరి కథలు
(రవి బసర)
9) బి.సి. -(బ్లాక్ కమాండో)
(మోహన్ కాంత్)
10) హనీ కిడ్స్
(హర్ష)
11) సావాసం
(ఏకరి సత్యనారాయణ)
12) డార్క్ స్టోరీస్
(కృష్ణ కార్తీక్)
13) మనల్ని ఎవడ్రా ఆపేది
(బి.శ్రీనివాసరావు)
14) ది ఫైనల్ కాల్
(ప్రణయ్ రాజ్ వంగరి)
15) అవతారం
(డా: సతీష్)
ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ఛాన్, గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం. తలుగు సినిమాకు ప్రపంచ రికార్డు సాధించేలా ఒకేసారి 15 చిత్రాలు మొదలు పెట్టిన రామసత్యనారాయణను అతిధులంతా అభినందించారు. 2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలకు 2026 ఆగస్టు 15కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామసత్యనారాయణ పేర్కొన్నారు. ఈ 15 చిత్రాలకు KLస్టూడియోను 25% డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంతంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి. ఒకేరోజు మొదలై ప్రపంచ రికార్డ్స్ లో నమోదైన ఈ 15 చిత్రాలకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పి.ఆర్.ఓ. కావడం విశేషం!!