మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
“Bahirbhoomi,” Pre Release Event held grandly
A lavish pre-release event took place recently at Prasad Labs in Hyderabad. During the event, producer Venu Madhav conveyed his excitement about the occasion and acknowledged the contributions of everyone involved, from the set boy to the lead actors. He announced that the film would be released in multiple languages following its launch and introduced a social media contest: three individuals using the hashtag “#Bahirbhoomi” will each be rewarded with INR 5,000. The movie trailer will also feature on a billboard in New York’s Times Square.
Director Rampasad Konduru discussed the importance of the title “Bahirbhoomi,” which reflects land disputes between villages. He commended Venu Madhav and emphasized that the audience would grasp the title’s significance after watching the film. He expressed gratitude to the cast and crew for their support.
Lead actor Noel praised producer Venu Madhav and stated that the film contains all the elements needed to engage audiences. He recognized the contributions of the cast and crew, including co-star Rishita Nellore and music director Ajay, whose songs will further enrich the movie.
Rishita Nellore expressed her gratitude to the director for casting her in the film. She noted that the film was shot in just 21 days and commended the support from Noel and the entire team.
Actress Garima Singh, making her Telugu debut, shared her excitement for her role.
Music director Ajay Patnaik, along with Jabardasth Phani and actor Chitra Sreenu, reflected on their experiences. Phani highlighted the comedic elements in his scenes, while Sreenu discussed his unexpected role in the film.
Cinematographer Praveen Komari shared his positive experience working on “Bahirbhoomi” and expressed his hopes for the movie’s success.
ఘనంగా “బహిర్భూమి” ప్రీ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ – ఈ రోజు మా “బహిర్భూమి” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమాకు సెట్ బాయ్ నుంచి హీరో వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నిర్మించినందుకు ఆనందంగా ఉంది. అక్టోబర్ 4న “బహిర్భూమి” సినిమా రిలీజ్ చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఇతర భాషల్లోనూ మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రేపు సాయంత్రం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై మా మూవీ ట్రైలర్ డిస్ ప్లే చేస్తాం. హాష్ ట్యాగ్ “బహిర్భూమి” అని సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 వేల రూపాయల బహుమతి అందిస్తాం. థియేటర్ లో మా “బహిర్భూమి” సినిమా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ – “బహిర్భూమి” అనే మాటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో రెండు ఊర్ల మధ్యలో బహిర్భూమి ప్లేస్ కోసం గొడవలు జరిగేవి. ఈ టైటిల్ సినిమాకు ఎందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుంది. మా వేణు మాధవ్ గారు మంచి ప్రొడ్యూసర్. అలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో స్థిరపడాలి. మా సినిమాకు హీరో నోయెల్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్ తో మీ అందరికీ నచ్చేలా సినిమా చేయగలిగాను. థియేటర్ లో మా సినిమాను అక్టోబర్ 4న చూసి మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరో నోయెల్ మాట్లాడుతూ – “బహిర్భూమి” వంటి మంచి మూవీ చేసిన నిర్మాత మచ్చ వేణు మాధవ్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన ఇండస్ట్రీలో వంద సినిమాలు చేయాలి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ మన పరిశ్రమలో కొనసాగాలి. అలాగే మా డైరెక్టర్ రాంప్రసాద్ కు ఫస్ట్ మూవీ ఇది. చాలా బాగా సినిమాను తెరకెక్కించాడు. అన్ని ఎలిమెంట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సినిమా కోసం మా మూవీ టీమ్ ఎంతో కష్టపడింది. హీరోయిన్ రిషిత, చిత్రం శీను, ఫణి వీళ్లందరి క్యారెక్టర్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. మా సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వల్లే నేను ఈ సినిమా కంఫర్ట్ గా చేయగలిగాను. అజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. లిరిక్స్ చాలా బాగున్నాయి సినిమాను థియేటర్ లో మీరంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. తప్పకుండా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
హీరోయిన్ రిషిత నెల్లూరు మాట్లాడుతూ – మాది నెల్లూరు. సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాంప్రసాద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే మా ప్రొడ్యూసర్ గారు సినిమా మీద ఇష్టంతో ఈ మూవీ నిర్మించారు. 21 డేస్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. నోయెల్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు గరిమా సింగ్ కూడా ఒక రోల్ చేసింది. “బహిర్భూమి” సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ గరిమా సింగ్ మాట్లాడుతూ – “బహిర్భూమి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం 15 రోజుల షెడ్యూల్ వర్క్ చేశాను. నా క్యారెక్టర్ కు మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా. “బహిర్భూమి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ . అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ – బహిర్బూమి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వేణు గారు, డైరెక్టర్ రాంప్రసాద్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేసే అవకాశం దొరికింది. మంచి సాంగ్స్ చేశాం. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలి. అన్నారు.
జబర్దస్త్ ఫణి మాట్లాడుతూ – బహిర్భూమి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. నోయెల్ కాంబినేషన్ లో నా కామెడీ సీన్స్ హిలేరియస్ గా వచ్చాయి. దర్శకుడు రాంప్రసాద్ గారు అందరికీ నచ్చేలా ఈ మూవీ చేశారు. వేణుమాధవ్ గారు మంచి ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటారు. అన్నారు.
నటుడు చిత్ర శ్రీను మాట్లాడుతూ – “బహిర్భూమి” సినిమాలో నా క్యారెక్టర్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. నోయెల్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అతను హీరోగా మరిన్ని మంచి మూవీస్ చేయాలి. అలాగే మా డీ ఓ పీ ప్రవీణ్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. డైరెక్టర్ రాంప్రసాద్, ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. “బహిర్భూమి” సినిమా పెద్ద హిట్ కావాలి. అన్నారు.
డి ఓ పి ప్రవీణ్ మాట్లాడుతూ- “బహిర్భూమి” సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. వీలైనంత అందంగా మూవీని మా లెన్స్ ద్వారా చూపించాను. టీమ్ అంతా బాగా కష్టపడ్డారు. మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారు ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. అలాగే ఈ సినిమాతో డైరెక్టర్ గా రాంప్రసాద్ కు మంచి పేరు రావాలి. మా టీమ్ అందరికీ “బహిర్భూమి” సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – నోయల్, రిషిత నెల్లూరు, గరిమా సింగ్, చిత్రం శీను, విజయ రంగరాజు, జబర్దస్త్ ఫణి, జయ వాహిని ఆనంద్ భారతి, కిరణ్ సాపల,సునీల్, పెళ్లకూరు మురళీకృష్ణ రెడ్డి,తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ కోమరి,
మ్యూజిక్ – అజయ్ పట్నాయక్,
పీఆర్ఓ – వీరబాబు,
నిర్మాత – మచ్చ వేణుమాధవ్,
రచన దర్శకత్వం – రాంప్రసాద్ కొండూరు