35 -చిన్నకథ కాదు అందరికీ పర్శనల్ గా కనెక్ట్ అవుతుంది – నేచురల్ స్టార్ నాని
నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.”35-చిన్న కథ కాదు”సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. .”35-చిన్న కథ కాదు’ సినిమా చూశాను. నేను ఈమధ్య కాలంలో చూసిన మోస్ట్ బ్యూటీఫుల్ తెలుగు సినిమా 35-చిన్న కథ కాదు. ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లలని తీసుకు వెళ్ళాల్సిన సినిమా. అందరికీ పర్శనల్ గా కనెక్ట్ అవుతుంది. ఒకరోజు స్కూల్ మిస్ అయినా పర్వాలేదు. ఆ రోజు స్కూల్ లో నేర్చుకున్నదానికంటే ఈ సినిమాలో ఎక్కువ నేర్చుకుంటారు. అరుదుగా వచ్చే మంచి సినిమాలివి. తెలుగు ఆడియన్స్ ఇలాంటి పాజిటివిటి, ఫ్రెష్ నెస్ ని చూసినప్పుడు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఈ సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 6 తర్వాత సినిమా సక్సెస్ స్టొరీ చిన్న కథ కాదు. అందరూ గొప్పగా పెర్ఫామ్ చేశారు. వివేక్, నికేత్ గ్రేట్ వర్క్ ఇచ్చారు. ఇండియాలోని మంచి మంచి టెక్నిషియన్స్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ టీం అంతా ఒక సినిమా చేస్తున్నారంటే నా బెత వీళ్ళపైనే వుంటుంది. బ్యూటీఫుల్ సినిమా తీశారు. ట్యాలెంట్ ఏ ఇండస్ట్రీలో వున్నా రానా కంటపడితే ఎంకరేజ్ చేయడంలో ముందుటారు. ఇండస్ట్రీలో నా బలమైన ఫ్రెండ్ రానా. ఈ సినిమాని రానా ప్రెజెంట్ చేయడం చాలా ఆనందంగా వుంది. నివేద జెంటిల్మెన్ నుంచి పరిచయం. తను ఇంట్లో మనిషి అయిపొయింది. తను చాలా హానెస్ట్. బ్యూటీఫుల్ గా యాక్ట్ చేసింది. తన క్యారెక్టర్ అమ్మని గుర్తుకు తెస్తుంది. విశ్వ చాలా మెచ్యురిటీతో పెర్ఫామ్ చేశాడు. తను మరెన్నో గొప్పగొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శి ఎంచుకున్న కంటెంట్ బావుటుంది. తనని చూస్తే తెలుగు అమీర్ ఖాన్ అనిపిస్తుంది. ఇందులో ఇరకొట్టాడు. వివేక్ తన సౌండ్ ట్రాక్ తో సినిమాని నిలబెట్టేయగలడు. ఇలాంటి సినిమాలు తను ఎక్కువ చేయాలి. నంద కిషోర్ గారిలో హానెస్ట్ వుంది. అది ఈ సినిమాలో కనిపించింది. అద్భుతమైన యాక్టింగ్ రాబట్టాడు. సృజన్ సినిమా పిచ్చోడు. ఇలాంటి సినిమాలు మరో వంద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి అమ్మ నాన్న ఇది మనమే కదా అనుకుంటారు. పిల్లల్ని తీసుకొని థియేటర్స్ కి వెళ్ళండి. సెప్టెంబర్ 6న ఒక సక్సెస్ స్టొరీ చూడబోతున్నారు. అది చిన్న కథ కాదు’ అన్నారు.
మూవీ ప్రజెంటర్, హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..”35-చిన్న కథ కాదు’ నాని గారి బయోపిక్ అన్నారు కానీ కథ విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా.(నవ్వుతూ). నాకు మ్యాథ్స్ అస్సల్ వచ్చేది కాదు. 35 అనే హ్యుజ్ టాస్క్ లా వుండేది. ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా వుంది. నేను స్కూల్ లో వున్నప్పుడు మ్యాథ్స్ టీచర్ నచ్చేవారు కాదు. ఇందులో దర్శి ఎగ్జాట్ గా అలానే వున్నాడు. నివేద, విశ్వ ని చూస్తే మా మదర్ ఫాదర్ ఎదో మూమెంట్ లో గుర్తుకు వచ్చారు. ఇలాంటి మంచి కథలు చేస్తున్న ఈ సినిమా నిర్మాతలకు ఎప్పుడూ నా సపోర్ట్ వుంటుంది. నాని నేను కలసి ఫేవరేట్ పర్శన్. నాని ఆల్వేస్ స్పెషల్. సెప్టెంబర్ 5న సినిమా విడుదలౌతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది’అన్నారు.
హీరోయిన్ నివేద థామస్ మాట్లాడుతూ.. మీరంతా నన్ను తెలుగు అమ్మాయని పిలవడం ఆ స్థాయి నాకు ఇవ్వడం చిన్న విషయం కాదు. మనస్పూర్తిగా అందరికీ కృతజ్ఞతలు.35-చిన్న కథ కాదు నాకు చాలా స్పెషల్. నాకు సరస్వతి క్యారెక్టర్ ఇచ్చిన నందుకి థాంక్ యూ . ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. ఈ క్యారెక్టర్ లో నన్ను బిలివ్ చేసినందుకు థాంక్ యూ. నికేత్, వివేక్ సాగర్ కి థాంక్ యూ. సినిమాకి పని చేసిన అందరికీ థాంక్. దర్శి, విశ్వ, గౌతమీ మేడంతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశా. వారితో వర్క్ చేయడం మెమరబుల్. ఈ కథని మొదట రానా గారు విన్నారు. నాని గారు చూశారు. ‘ఇది అందరి సినిమా’అని చెప్పారు. ఆ ఫీడ్ బ్యాక్ చాలా ఆనందాన్ని, నమ్మకాని ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాని తీసిన నిర్మాతలకు థాంక్ యూ. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి. చాలా అరుదైన సినిమా ఇది. ఒకరోజు స్కూల్ మిస్ అయినా పర్వాలేదు. ఆ రోజు స్కూల్ లో కంటే ఈ సినిమాలో ఎక్కువ నేర్చుకుంటారు. ఈ సినిమా చేసినప్పుడు నాకు అమ్మ గుర్తుకువచ్చింది. ఈ సినిమాని ప్రపంచంలోని అమ్మలందరికీ, పేరెంట్స్ అకింతం చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత మీ పేరెంట్స్ కి గట్టిగా హాగ్ ఇస్తారు. తప్పకుండా సినిమా చూడండి’ అన్నారు.
యాక్టర్ విశ్వదేవ్ మాట్లాడుతూ..నాని గారు ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. రానా గారితో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. 35-చిన్న కథ కాదు’ సినిమాని చాలా ఆస్వాదించాను. ఈ సినిమాలో పని చేసిన అందరికి ఒక యూనిక్ అప్రోచ్ వుంది. నందు ఈ కథ చెప్పిప్పుడే చాలా ఎమోషనల్ గా అనిపించింది. నందు చాలా అద్భుతంగా హానెస్ట్ గా సినిమా తీశారు. సెట్స్ లో చాలా లైఫ్ వుండేది. నివేత పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్. సినిమా అయ్యేవరకూ ఆ క్యారెక్టర్ లోనే వున్నారు. ప్రియదర్శి చాలా డౌన్ టు ఎర్త్. అందరూ తమ సినిమాగా హార్డ్ వర్క్ చేశారు. వివేక్ బెస్ట్ కంపోజర్ ఇన్ ఇండియా. 35-చిన్న కథ కాదు గ్రేట్ ఎక్స్ పీరియన్స్. అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
యాక్టర్ ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికీ నమస్తే. నాని అన్న, రానా అన్నకి థాంక్ యూ. పెళ్లి చూపులు నుంచి 35 వరకూ రానా అన్నతో బ్యూటీఫుల్ జర్నీ. ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా వుంది. ఈ ఇందులో క్యారెక్టర్ ఇచ్చిన నందుకి థాంక్. తిరుపతి యాస నేర్పించి మరీ అద్భుతంగా చేయించారు. నివేతని చూస్తే మా అమ్మ గుర్తుకు వస్తుంది. వివేక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. భాగ్యరాజ్ గారితో వర్క్ చేయడం హానర్ గా భావిస్తున్నాను. బ్యూటీఫుల్ సినిమా ఇది. తప్పకుండా అందరూ లవ్ చేస్తారు. సినిమా గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అన్నారు.
డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని మాట్లాడుతూ.. 35 గురించి చెప్పాలంటే చిన్న కథ కాదు. నా రైటింగ్ అండ్ డైరెక్షన్ టీంకి థాంక్. నికేత్ బొమ్మి, వివేక్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఇందులోకిడ్స్ అందరూ స్టార్స్. నా డైరెక్షన్ టీం చాలా కష్టపడ్డారు. రానా గారు బిగినింగ్ నుంచి సపోర్ట్ గా వున్నారు. ఇది ఆయన బయోపిక్ అన్నారు(నవ్వుతూ). నివేత, దర్శి, విశ్వ అందరూ అద్భుతంగా చేశారు. గౌతమి మేడం గారిని సెట్స్ కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. షూటింగ్ సమయానికి ఆమె యుఎస్ వెళ్ళాల్సింది వచ్చింది. బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాను.(నవ్వుతూ). చాలా అర్ధవంతమైన పాటలు వింటారు. అందరూ రండి. మీ పిల్లల చెవులు, కళ్ళు మూయాల్సిన అవసరం లేదు. అందరూ హ్యాపీగా చూడొచ్చు’ అన్నారు
నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి మాట్లాడుతూ.. మంచి స్టార్ట్ కాస్ట్ తో ఈ సినిమాని చేశాం. నికేత్ బొమ్మి, వివేక్ సాగర్ ఇలా అందరూ చాలా లవ్ తో ఈ సినిమా చేశారు. నివేద థామస్ గారు బ్రిలియంట్ గా యాక్ట్ చేశారు. నందు విశ్వ చాలా హార్డ్ వర్క్ చేశారు. సినియా అందరినీ సర్ప్రైజ్ చేశారు. నాని గారు, రానా గారికి థాంక్ యూ. తప్పకుండా అందరూ సినిమాని చూడండి’ అన్నారు.
నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ.. మేమంతా సున్నా అయితే పదికావడానికి మా పక్కన వున్న వన్ కోసం వెదుకుతున్నాం. ఆ పదే మా రానా గారు. నాని గారు ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి నేను ఫ్యాన్ బాయ్ ని. కన్నడలో కాంతార, మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్, తమిళ్ లో మహారాజ, తెలుగులో .”35-చిన్న కథ కాదు’అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలకి సపోర్ట్ గా నిలిస్తున్న నాని గారికి, సినిమాని ప్రజెంట్ చేసిన రానా గారికి థాంక్ యూ. ఇది చాలా బ్యూటిఫుల్ ఫిలిం. చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి మంచి కథ తీసిన నందుకి అభినందనలు. కథ చెప్పిప్పుడే సినిమా చేయాలని అనుకున్నాను. నా మ్యూజిక్ టీం అందరికీ థాంక్. నివేత, దర్శి, పిల్లలు అందరూ చించేశారు.ఫ్యామిలీలో కలసి అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది’ అన్నారు.
యాక్టర్ భాగ్యరాజ్ మాట్లాడుతూ..డైరెక్టర్ నంద కిషోర్ చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. తమిళ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం సంతోషంగా వుంది. అందరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్ ఇది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’ అన్నారు.
యూనిట్ తో పాటు సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరూ పాల్గొన్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.