
సరస్వతి కథ విని షాక్ అయ్యాను. ఆడియన్స్ కూడా థ్రిల్ అవుతారు – గోపీచంద్ మలినేని
వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ రోజు బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వరలక్ష్మీ చాలా ఎమోషనల్ పర్శన్. నేను క్రాక్ చేసినప్పుడు జయమ్మ క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు మైండ్ లో ఉంది. ఆ క్యారెక్టర్ ని వరలక్ష్మి చేసిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు. క్రాక్ లో ఒక సన్నివేశం చూస్తున్నప్పుడు ఒకే కంటి నుంచి ఆమె కన్నీరు కార్చే సన్నివేశం చూస్తే షాక్ అయిపోయాను. సావిత్రి గారు, శారద గారు ఎంత మంచి ఆర్టిస్టులో అలాంటి మంచి ఆర్టిస్టు వరలక్ష్మి. వీర సింహారెడ్డిలో బాలకృష్ణ గారితో ఒక కాంబినేషన్ సీన్ ఉంది. అది చాలా ఇంపార్టెన్స్ సీన్. రెండు రోజులు పడుతుందని అనుకున్నాను. కానీ వరలక్ష్మి సింగిల్ టేక్ లో చేసింది. అది షాక్ అయ్యాను. సీన్ చూసిన తర్వాత బాలయ్య గారు ఊర్వశి శారద గారిని చూసినట్టుగా ఉంది అన్నారు. అంత మంచి ఆర్టిస్ట్ వరు. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ రాసుకున్నాను. అది ఎవరు చేస్తారో చూడాలి(నవ్వుతూ) తను సరస్వతి కథ చెప్పినప్పుడు నేను స్టన్ అయిపోయాను. ఈ కథను ఎక్స్ట్రార్డినరీగా చేసింది. ఆడియన్స్ కూడా థియేటర్లో సినిమా చూసి షాక్ అవుతారు. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన మంచి సినిమా ఇది. వరు క్లారిటీ ఉన్న డైరెక్టర్. అందుకే ఇంత ఫాస్ట్ గా తీగలిగింది. తను ఆర్టిస్ట్ గా నిరూపించుకుంది. ఇప్పుడు డైరెక్టర్ గా కూడ తన మార్క్ చూపించబోతోంది. ట్రైలర్ చూసినప్పుడు తను ఏదైతే చెప్పిందో దానికి మించి తీసినట్టు అనిపించింది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సరస్వతి మార్చి6న రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమా.
నిర్మాత బన్నీ బాస్ మాట్లాడుతూ.. వరలక్ష్మి గారు ఈ సినిమాకి తను దర్శకత్వం చేసి, నటిస్తున్నాను, అలాగే నిర్మిస్తున్ననని చెప్పినప్పుడు కచ్చితంగా ఒక మంచి కంటెంట్ అయి ఉంటుందని అనుకున్నాను. ఈ సినిమాని మంచి క్యాలిటీతో చాలా ఫాస్ట్ గా తీశారు. ఇందులో ఏడు నిమిషాల సింగిల్ షాట్ ఉందని చెప్పారు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆ షాట్ ఎక్కడుందో నాకు తెలియలేదు. నిజంగా ఏడు నిమిషాలు సింగిల్ షాట్ ఉన్నప్పుడు మనకి తెలిసిపోతుంది. కానీ ఆ షాట్ ఎక్కడ వచ్చిందో పట్టుకోలేనంత లీనమై చూశాను. ఇది మామూలు విషయం కాదు. అది డైరెక్టర్ గా వరలక్ష్మి గారి గొప్పతనం. చాలా మంచి స్క్రీన్ ప్లే తో తీసిన సినిమా ఇది. ఈ ఇంత మంచి యాక్టర్స్ పెట్టుకుని సినిమాని ఇంత క్వాలిటీతో ఇంత వేగంగా తీయడం అనేది మామూలు విషయం కాదు. తల్లిదండ్రులు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాతో వరలక్ష్మి గారికి చాలా మంచి పేరు వస్తుంది. గీత ఆర్ట్స్ సినిమాని రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీ సపోర్ట్ తోనే ఇక్కడ నేను కొనసాగుతున్నాను. మీ అందరి అభిమానంతోనే ఇప్పుడు డైరెక్టర్ గా వస్తున్నాను.మీ అంచనాలకు తగ్గకుండా ఒక కంటెంట్ ని మీకు అందిస్తున్నాము. ఫిమేల్ కంటెంట్అని మరీ సందేశాత్మకంగా ఉండదు. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. బన్నీ వాసు గారు సినిమాని చూసి చాలా అభినందించారు. అదే నా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాను. తెలుగు సినిమాలో నన్ను రీలాన్చ్ చేసిన డైరెక్టర్ గోపి గారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆయన నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగు ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు. చాలా మంచి సినిమా తీశాం. అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేసి ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ఇంకా ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ట్రైలర్ ని డిజిటల్ లో లాంచ్ చేసిన నాని గారికి థాంక్యూ సో మచ్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నన్ను అద్భుతంగా సపోర్ట్ చేసిన తెలుగు పరిశ్రమకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సపోర్టు ఈ సినిమా కూడా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన గోపీచంద్ గారికి, అలాగే ఈ ట్రైలర్ ని డిజిటల్ లాంచ్ చేసిన నాని గారికి థాంక్యూ. ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. వరలక్ష్మి గారు అద్భుతమైన క్వాలిటీతో సూపర్ ఫాస్ట్ గా ఈ సినిమాని తీశారు. ఇంత ఫాస్ట్ గా ప్రొడక్షన్ అయిన సినిమాని నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు. ఒక లక్ష్మీ సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమా ఇది. చాలా బాగుంటుంది. థియేటర్స్ కి వచ్చి అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో వరలక్ష్మి గారు డైరెక్టర్ గా కూడా బిజీగా బిజీ అవుతారని కోరుకుంటున్నాను.
నిర్మాత పూజ నిర్మాత పూజా శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వరు తను అనుకున్న టైంకే ఈ సినిమాని పూర్తి చేసింది. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ అంత క్లారిటీగా నాన్ స్టాప్ గా సినిమాని ఫినిష్ చేయడం అనేది చాలా విశేషం. ఈ విషయంలో వరుకి థాంక్స్ చెప్పాలి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీరందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
తారాగణం: వరలక్ష్మి శరత్‌కుమార్, జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి, మైమ్ గోపి, హరేష్ పరేడే, తులసి, రఘు బాబు, దేవీ ప్రసాద్, వెంకట్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – వరలక్ష్మి శరత్ కుమార్
నిర్మాతలు – పూజా శరత్ కుమార్ & వరలక్ష్మి శరత్ కుమార్
సహ దర్శకుడు: నరేష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ డేనియల్
సినిమాటోగ్రాఫర్: ఎడ్విన్ సకాయ్
సంగీతం: థమన్
ఎడిటర్ : వెంకట్
ఆర్ట్ డైరెక్టర్ : సుధీర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: విక్రమ్ స్వామి
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్
పీఆర్వో- వంశీ శేఖర్
