
మేఘాలు చెప్పిన ప్రేమ కథ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ – నరేష్ అగస్త్య
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిడం ఆనందంగా వుంది. ఆగస్టు 22న సినిమా రిలీజ్ అవుతుంది. నిర్మాత ఉమా గారికి థాంక్యూ సో మచ్. నన్ను ఒక కొడుకులా చూసుకున్నారు. విపిన్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. తనతో వర్క్ చేయడం నాకు ఎంతో నచ్చింది. జస్టిన్ మ్యూజిక్ లో పనిచేయడం నా డ్రీమ్. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మోహన్ గారు నా మెంటర్. చాలా అద్భుతంగా సినిమాని తీశారు. హీరో కంటే అందంగా ఉండే కామియో కావాలి. అందుకే వెతికి వెతికి రాజాని పట్టుకున్నారు(నవ్వుతూ). తను నాకు మంచి స్నేహితుడు. రబియా చాలా అద్భుతంగా నటించింది. వెరీ బ్యూటీఫుల్ క్లీన్ ఫిలిం ఇది. సినిమా ఆగస్టు 22న వస్తుంది. చాలా మంచి సినిమా. తప్పకుండా చూడండి’అన్నారు
ప్రొడ్యూసర్ ఉమాదేవి కోట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో పనిచేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వెరీ నైస్ అండ్ క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. మీరందరూ ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు
హీరోయిన్ రబియా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా ఫస్ట్ డైరెక్టర్ ధనుష్ గారికి థాంక్యూ. ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ స్థానంలో నిలుచున్నాను. ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత ఉమా గారికి, దర్శకుడు విక్రమ్ గారికి థాంక్యూ సో మచ్. నరేష్ లవ్లీ కో స్టార్. తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. చాలా మంచి ఎంటర్టైనర్ ది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు
డైరెక్టర్ విపిన్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాము. చాలా ఎఫర్ట్ పెట్టాము. అన్ని కుదిరాయని కనిపిస్తుంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము, ఆగస్ట్ 22న మీ ముందుకు వస్తున్నాము. తప్పకుండా ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను
యాక్టర్ రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి చాలా థాంక్యూ. నిర్మాత ఉమా గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమాని రూపొందించారు. విపిన్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా క్లియర్ విజన్ తో డైరెక్టర్. మోహన్ కృష్ణ గారు మా అందరిని చాలా డిఫరెంట్ గా చూపించారు. నరేష్ తో వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. ఆగస్టు 22న సినిమా వస్తుంది. తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు
తారాగణం: నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ కార్తికేయ, మోహన్ రామన్ .
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – విపిన్
నిర్మాత – ఉమాదేవి కోట
బ్యానర్ – సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్ – మోహన కృష్ణ
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్
ఆర్ట్ – తోట తరణి
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
పీఆర్వో: వంశీ-శేఖర్