Upasana Kamineni Konidela and Ram Charan Announce Second Pregnancy, Couple

తెలుసు కదా కొన్ని సంవత్సరాలు పాటు మీతో ఉండిపోతుంది – సిద్ధు జొన్నలగడ్డ
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రాడికల్ బ్లాక్ బస్టర్ ‘తెలుసు కదా’. మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ అప్రిషియేషన్ మీట్ నిర్వహించారు.
అప్రిసియేషన్ మీట్ లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..మీడియా వారికి థాంక్ యు. టిల్లు రిలీజ్ అయినప్పుడు ఎక్సైజ్మెంట్ ఫీల్ అయ్యాను. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. జాక్ రిలీజ్ అయిన తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను. వీటన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ ఫీలింగు తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీలయ్యాను. ఒక మనశ్శాంతిని ఫీలయ్యాను. ఈ సినిమా నన్ను ప్రశాంతంగా పడుకునేలా చేసింది. దీనికి అందరికంటే ముందుగా డైరెక్టర్ నీరజ కోన కి థాంక్స్ చెప్పాలి. నితిన్ అన్నకి థాంక్స్ చెప్పాలి. ఈ కథకు నేనైతేనే కరెక్ట్ గా ఉంటుందని నాకు కనెక్ట్ చేశారు. నీరజ్ నేను అనుకున్న ఆలోచనలు తను చాలా గొప్పగా తీసుకుని ఈ కథలో ఇంప్లిమెంట్ చేసుకున్నందుకు తనకు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమానే అందరు రాడికల్ అనుకుంటున్నారు. కానీ తన నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ చూస్తే మామూలుగా ఉండదు. మా విజన్ సపోర్ట్ చేసిన నిర్మాత విశ్వ గారికి థాంక్యూ. ఆయన డబ్బు గురించి ఆలోచించలేదు. ఒక మంచి సినిమా తీద్దామని ముందుకు వచ్చారు. తమన్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ నా కెరీర్లో ఎప్పటికీ మిగిలిపోతుంది. నవీన్ నూలి సినిమాని అద్భుతంగా ఎడిట్ చేశారు. అవినాష్ గారు అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ చేశారు. హర్ష శ్రీనిధి రాశి ఈ ముగ్గురు కూడా స్పెషల్ థాంక్స్. అద్భుతంగా పెర్ఫార్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరున థాంక్ యూ. మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చిన సందీప్ గారికి ఎస్ కే ఎన్ గారికి బండ్ల గణేష్ గారికి కోన వెంకట్ గారికి, రవి గారికి, శశి గారికి థాంక్యూ. తెలుసు కదా థియేటర్స్ లో వుంది. ఇది పక్కా మాస్ సినిమా. థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఈ సినిమా మీకు నచ్చుతుంది. మీకు గుర్తుండిపోతుంది. కొన్ని సంవత్సరాలు పాటు మీతో ఉండిపోతుంది. ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేసిన అందరికీ థాంక్యూ.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అందరు కంటెంట్ ని చాలా డీటెయిల్ గా అనలైజ్ చేశారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి యూనిక్ పాయింట్ మీద కొత్త డైరెక్టర్ కి సిద్దు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. మేము ఒక యూనిక్ స్టోరీని చెప్పాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. సినిమా పరిశ్రమను, నిర్మాతకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీడియాకి హృదయపూర్వక కృతజ్ఞతలు. సిద్దు రవితేజ కి ఆల్టర్నేట్. సిద్దు తేజ మరో రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఎలడానికి పుట్టిన స్టార్. నేనైతే నిర్మాతగా ఇలాంటి సినిమా చేయలేను. ఇలాంటి సినిమా చేయడానికి దమ్ము కావాలి. విశ్వ ప్రసాద్ గారికి హాట్సాఫ్. నీరజ చెల్లి లాంటిది. నేను తీసిన బాషా సినిమాతో తను కాస్ట్యూమ్ డిజైనర్ గా పరిచయం అయింది. తనకున్న ఫ్యాషన్ అద్భుతం. తనని చూసి చాలా గర్వపడుతున్నాను. సిద్దు వండర్ఫుల్ యాక్టర్. తనకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడండి. ఇలాంటి సినిమాని అందరు సూపర్ హిట్ చేయాలి. విశ్వ గారు కథను నమ్మి సినిమా తీస్తున్నారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఇంత సూపర్ హిట్ టీం లో భాగమైన అందరికీ అభినందనలు.
ప్రొడ్యూసర్ రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ.. తెలుసు కదా రాడికల్ బ్లాక్బస్టర్ ఇది. 100% యాప్ తో క్యాప్షన్. చాలామంది రాడికల్ మైండ్స్ రాడికల్ థాట్ తో తీసిన సినిమానే తెలుసు కదా. దీన్ని అప్రిషియేట్ చేయడానికి కూడా ఒక రాడికల్ మైండ్ కావాలి. అది థియేటర్లో చూసిన తర్వాత నాకు అర్థమైంది. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమా ఇది. సిద్దు నాకు ఎల్బీడబ్ల్యు సినిమా నుంచి తెలుసు. ఆ సినిమా నాకు చాలా నచ్చింది. టిల్లు లాంటి ఇమేజ్ నుంచి బయటికి రావడం మామూలు విషయం కాదు. వరుణ్ డీజీ టిల్లుని మర్చిపోయేలా చేశాడు. మా సిస్టర్ నీరజ ఇంత కాంప్లికేట్ కథని తీసుకుని ఎంత బ్యూటిఫుల్ గా చేస్తుందని చూసేంత వరకు నేను నమ్మలేదు. సినిమా చాలా అందంగా ఉంది. విశ్వప్రసాద్ గారి లాంటి ప్రొడ్యూసర్ దొరకడం ఇండస్ట్రీకి వరం. ఆయన లాంటి ప్రొడ్యూసర్ ని మనం కాపాడుకోవాలి. ఇది వెరీ బోల్డ్ అండ్ రాడికల్ ఫిలిం .తప్పకుండా ఇలాంటి సినిమాలు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. తెలుసు కదా జెమ్ ఆఫ్ ఎ ఫిలిం. సిద్దు గారు కెరీర్ పీక్స్ లో వున్నప్పుడు ఒక డెబ్యు మహిళ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. అది ఆయన గొప్పతనం. ఇది ఒక టీం వర్క్. ఈ సినిమా చూస్తున్నప్పుడు కరణ్ జోహార్, జోయా అక్తర్ సినిమాలా అనిపించింది. నీరజ గారు చాలా అద్భుతంగా తీశారు. ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. దీపావళికి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్న సినిమా మాత్రం తెలుసు కదా. విశ్వ ప్రసాద్ గారు సినిమా అంటే నమ్మకమున్న ప్రొడ్యూసర్. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ… తెలుసు కదా లాంటి సినిమాకి సిద్దు గారి యాక్టింగ్ చాలా హెల్ప్ అయ్యింది. అద్భుతంగా నటించారు. ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. నీరజ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ముఖ్యంగా అర్బన్ ఆడియన్స్ ఈ సినిమాని చాలా ఇష్టపడ్డారు. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. విశ్వప్రసాద్ గారు అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీశారు. క్వాలిటీ పరంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో మెట్టు ఎక్కింది.
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇలాంటి కొత్త కథని అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు డైరెక్టర్ నీరజ కోన గారికి కంగ్రాజులేషన్స్. ఇలాంటి కథలు మరెన్నో చెప్పాలి. సిద్దు గారు అందరికి ఇన్స్పిరేషన్. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పరంగా టాప్ క్లాస్ ఫీలింగ్ ఇచ్చింది. విశ్వగారు కథని నమ్మి కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తారు. మొగ్లీతో నన్ను నమ్మినందుకు ఆయనకి కృతజ్ఞతలు. తెలుసు కదా సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడండి.
డైరెక్టర్ నీరజకోన మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యు. ఈ సినిమాకి సిద్దు బ్యాక్ బోన్. ఒక డెబ్యూ డైరెక్టర్ గా నన్ను బిలివ్ చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నా జర్నీ ప్రారంభమైంది. డిఓపి జ్ఞాన సాగర్, తమన్ గారు ఈ సినిమాకి చాలా బిగ్ టెక్నికల్ సపోర్టు. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ చాలా సూపర్ హిట్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, అందరికీ పేరుపేరునా థాంక్ యూ.
వైవా హర్ష మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలలని నిజం చేసే ఫ్యాక్టరీ వారి వలన చాలామంది కుటుంబాలు బతుకుతున్నాయి.నీరజ గారు ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్యూ. సిద్దు గారితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉంది.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇందులో సీమంతం సాంగ్ రాశాను. ఇది చాలా కొత్త కథ. చాలా అద్భుతంగా తీశారు. టీజర్ దగ్గర్నుంచి ఈ సినిమాలో సిద్దు గారి మార్క్ కనిపించింది. చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ విజయంలో భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇందులో నేను రాసిన పాట చాలా అద్భుతమైన సన్నివేశంలో వచ్చింది. డైరెక్టర్ నీరజ గారు అద్భుతంగా ఈ కథని రాశారు తీశారు. సిద్దు గారు టిల్లు క్యారెక్టర్ని ఎంత పవర్ఫుల్గా చేశారు ఇందులో వరుణ్ పాత్రను కూడా అంతే అద్భుతంగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇలాంటి మరెన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మూవీ యూనిట్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.