Mega Supreme Hero Sai Durgha Movie Titled SYG (Sambarala Yetigattu)
షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం”
దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరో గా పరిచయం అవుతున్న చిత్రం “ఓం శివం”.కె. ఎన్. కృష్ణ . కనకపుర నిర్మాత. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆల్విన్ దర్శకుడు. విరానిక శెట్టి కథానాయిక. వైరాగ్యం లో వున్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటన లకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మలచిన చిత్రం “ఓం శివం” అని చిత్ర బృందం తెలిపింది. ఈస్ట్ గోదావరి,,మాండ్య, పుదుచ్చేరి, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందని నిర్మాత కె. ఎన్.కృష్ణ కనకపుర తెలిపారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది అని దర్శకుడు ఆల్విన్ తెలిపారు. భార్గవ కృష్ణ కి ఇది మొదటి సినిమా ఐనా చాలా బాగా శివ కేరక్టర్ కి పండించాడు, అలాగే కథ,సంగీతం, కెమెరా పనితనం ఈ చిత్రాన్ని ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు అన్నారు. కథ వినగానే అన్ని భాషలలో చేద్దాం అని దర్శకుడికి చెప్పగానే ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ వృదా చెయ్యకుండా చాలా బాగా చేసారు దర్శకుడు .
ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా మూడు భాషల పాటలను త్వరలో విడుదల చెయ్యటానికి, మరో రెండు నెలలలో ఒకేరోజు మూడు భాషలలో చిత్రాన్ని విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
నటీనటులు: భార్గవ కృష్ణ, విరానిక శెట్టి, రవి కాలే, ఉగ్రం రవి, అపూర్వ శ్రీ, , రోబో గణేష్ తదితరులు
సంగీతం :విజయ్ యార్డ్లి
నిర్మాత : కె.ఎన్.కృష్ణ కనకపుర
రచన,దర్శకత్వం: ఆల్విన్