మంచి కంటెంట్‌తో వస్తే ఆడియెన్స్ ఆదరిస్తారు – హీరో అశ్విన్ బాబు
గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంపై మీడియా, ఆడియెన్స్ ప్రశంసలు కురిపించింది. శుక్రవారం నాడు శివం భజే చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ‘నిర్మాత మహేశ్వర రెడ్డి, అప్సర్ గారు ఈ కథను నా వద్దకు తీసుకొచ్చారు. నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నానంటే.. కొత్త పాయింట్ ఉంటుందని అంతా అనుకుంటారు. ఆ మాట నిలబెట్టుకునేందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా.. అన్ని పాత్రలకు అందరూ అద్భుతంగా నటించారు. సాహి సురేష్ గారితో రాజు గారి గది 1, 3 పని చేశాను. ఇప్పుడు మా కాంబోలో శివం భజే వచ్చింది. చోటా డార్లింగ్‌కు రుణపడిపోయాను. శివేంద్ర గారంటే నాకు చాలా ఇష్టం. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో నాకు తెలుసు. ఆయనకు ముందు అడ్వాన్స్ ఇవ్వమని నిర్మాతకు చెప్పాను. పూర్ణా చారి పాటలు అద్భుతంగా వచ్చాయి. వికాస్ ఇక్కడ లేడు.. లేకపోయినా ఆయన గురించి మాట్లాడుతున్నామంటే అది ఆయన పనితనం. మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ముందు కథ చెప్పినప్పుడు అప్సర్ ఎలా చేస్తారా? అని అనుకున్నాను. కానీ కామెడీ, యాక్షన్ సీన్లకు మంచి అప్లాజ్ వస్తోంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ను నాకు ఇచ్చినందుకు థాంక్స్. నాకు నిర్మాత అంటే దేవుడితో సమానం. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను. నేను ఇంకెన్ని చిత్రాలు చేసినా నా కెరీర్లో ది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. మంచి కంటెంట్‌తో వస్తే ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్ అప్సర్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను ఆడియెన్స్‌కు దగ్గరగా తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఇక ఇప్పుడు టెక్నికల్ టీం గురించి చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ముందు నుంచీ సపోర్ట్‌గా నిలిచారు. వారు నాకెన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఎడిటర్ మా సినిమాను చక్కగా ట్రిమ్ చేశారు. ఆయన నాకు అడిషనల్ బ్రెయిన్. టీం అందించిన సహకారంతోనే సినిమా ఇంత బాగా వచ్చింది.శివేంద్ర విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. మంచి కథకు.. మంచి నిర్మాత దొరికారు. పూర్ణా చారి మంచి పాటలిచ్చారు. వికాస్ ఈ సినిమాకు ప్రాణం. ఆర్ఆర్తో సినిమాకు ప్రాణం పోశారు. శ్రీనివాస్ రావు గారు, నా డైరెక్షన్ టీం మెంబర్స్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. అర్దరాత్రి దాటినా నా కోసం కష్టపడ్డారు. మా నిర్మాత మహేశ్వర రెడ్డి లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. మా చిత్రాన్ని ఆదిరస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘శివం భజే సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని ఆడియెన్స్‌కు చేరువ చేసిన మీడియాకు, ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
శివేంద్ర మాట్లాడుతూ.. ‘శివం భజే టీంకు కంగ్రాట్స్. ఇంత మంచి సక్సెస్‌ను అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
చోటా కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమాకు పాజిటివ్ రిపోర్టులు వస్తే టీంకు చాలా ఆనందమేస్తుంది. దీని కోసమే కదా కష్టపడ్డామనిపిస్తుంది. అప్సర్ గారిది మోస్ట్ క్రియేటివ్ బ్రెయిన్. ఇంకా ఆయన వద్ద ఇలాంటి కొత్త కాన్సెప్టులు చాలా ఉన్నాయి. అశ్విన్ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డాడు. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
సాహి సురేష్ మాట్లాడుతూ.. ‘శివం భజే కథను ముందుగా నేను విన్నాను. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు అప్సర్‌కు థాంక్స్. నన్ను ఇంత బాగా చూపించిన అప్సర్, శివేంద్ర గారికి థాంక్స్. నిర్మాత ఎప్పుడూ కూల్‌గానే ఉంటారు. అశ్విన్ గారు చాలా మంచి వ్యక్తి. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘శివం భజే పాజిటివ్ టైటిల్. మహేశ్వరరెడ్డి మంచి నిర్మాత. అప్సర్ లాంటి దర్శకులు.. అశ్విన్ లాంటి డెడికేటెడ్ హీరో కలిసి చేసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.
నటుడు అప్పాజి మాట్లాడుతూ.. ‘శివం భజే చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. కార్తీకమాసంలా శివ కీర్తినలు వినిపిస్తున్నాయి. నాకు చాలా చక్కని పాత్ర లభించింది. ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
లిరిసిస్ట్ పూర్ణ మాట్లాడుతూ.. ‘నేను శివుడి భక్తుడ్ని. 21 రోజులు ఉపవాసం ఉంటూ ఈ పాటల్ని రాశాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారికి థాంక్స్. సినిమా చూసిన వారంతా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మా దర్శకుడు అప్సర్ సహకారంతోనే ఇంత మంచి పాటలు రాశాను. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన వికాస్ గారికి థాంక్స్. అశ్విన్ గారితో మరింతగా పని చేయాలని ఉంది’ అని అన్నారు.